తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Braid Jewellery: జడ బిల్లల ఫ్యాషన్ పోయింది.. జడకు పెట్టుకునే ట్రెండింగ్ ఆభరణాలివే ఇప్పుడు

Braid jewellery: జడ బిల్లల ఫ్యాషన్ పోయింది.. జడకు పెట్టుకునే ట్రెండింగ్ ఆభరణాలివే ఇప్పుడు

20 July 2024, 8:00 IST

google News
  • Braid jewellery: అంబానీల పెళ్లిలో జడకు పెట్టుకునే ఆభరణాలు తెగ వైరల్ అయ్యాయి. ఏ సెలెబ్రిటీలు ఎలాంటి సిగాభరణాల్ని ఎంచుకున్నారో చూడండి. 

జడ ఆభరణాలు
జడ ఆభరణాలు (Instagram )

జడ ఆభరణాలు

అంబానీల పెళ్లి ఫ్యాషన్‌కు, సెలెబ్రిటీల అందాల అరబోతకు వేదికగా నిలిచింది. ఒక్కొక్కరు తమదైన ఫ్యాషన్ శైలిలో మెరిసిపోయారు. పచ్చలు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఒకరిని మించి మరొకరు ధరించారు. అయితే అందరూ తప్పకుండా పెట్టుకున్న ఆభరణం మాత్ర ఒకటుంది. అదే జడ ఆభరణం. సిగాభరణం.. ఇంకేదైనా అనుకోండి. తలకట్టుకు ఆభరణాలు పెట్టి చాలా వైవిధ్యం చూయించారు. పూల జడ, బిల్లల జడ, జడ కొప్పు, జడ.. ఇలా చాలా పేర్లున్నాయి దీనికి. ఇదివరకు దీన్ని ఎక్కువగా పెళ్లి కూతుర్లు మాత్రమే పెట్టుకునే వాళ్లు. ఇప్పుడు అందరు పెట్టుకునే యాక్సెసరీ అయిపోయింది. 

ఎవరెవరు ఏం పెట్టుకున్నారో చూడండి:

పెళ్లికూతురు రాధిక మర్చంట్ మొదలుకుని ఇషా అంబానీ, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, షనాయా కపూర్.. ఇంకా చాల మంది సెలెబ్రిటీలు ఈ యాక్సెసరీలో కనిపించారు. వాళ్ల జడలను ఎలా అలంకరించుకున్నారో చూసేద్దాం. 

రాధిక మర్చంట్:

రాధిక మర్చంట్ పెట్టుకున్న జడాభరణం అందరి దృష్టి ఆకర్షించింది. మల్టీ కలర్ బాందినీ లెహెంగా వేసుకున్న రాధికి జడను ఈ ఆభరణంతో స్టైల్ చేశారు. జడ మొత్తం కవర్ అయ్యేలా బంగారు రంగున్న యాక్సెసరీ పెట్టుకున్నారు. దీనిమీద జెమ్ స్టోన్స్, టాజెల్స్ వేలాడుతున్నాయి. ఇవి రాధిక మర్చంట్ అమ్మ నగలు. అందుకే ఈ నగలు ప్రత్యేకంగా నిలిచాయి. 

ఇషా అంబానీ:

అనురాధ వకిల్ డిజైన్ చేసిన లెహెంగాకు జతగా ఇషా జడను సాంప్రదాయ లుక్ తో పూర్తి చేశారు. జడ పొడవునా పూలజడ వేసుకున్నారు. పైన కొప్పు పెట్టుకున్నారు. దీనిమీద వజ్రాలతో చేసిన వర్క్, రూబీలు, పచ్చలు పొదిగి ఉన్నాయి. జడ చివరన జడ కొప్పులు కొసమెరుపుగా ఉన్నాయి.

కృతి సనన్:

కృతి సనన్ స్టైలిస్ట్ సుక్రితి గోవర్ కూడా జడను చక్కగా డిజైన్ చేశారు. కృతి జడలో బంగారం, పోల్కి డిజైన్ తో పూల జడ అల్లారు. అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో కృతి ఈ స్టైల్ లో కనిపించారు. ఈ జడ కొప్పులో పచ్చలు, గులాబీ రంగు జెమ్ స్టోన్స్ పొదిగి ఉన్నాయి. జడ పైన భాగంలో జడ కొప్పు పెట్టుకున్నారామె.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్:

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అనామిక ఖన్నా డిజైన్ చసిన లెహెంగాను టెంపుల్ జ్యువెలరీతో జత చేశారు. తన జడలో పొడవుగా పొదిగి ఉన్న ఆభరణాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. పోల్కీ వర్క్, ముత్యాలు, జెమ్ స్టోన్స్, కమలం పువ్వు ఆకారాలతో ఈ ఆభరణం డిజైన్ చేశారు.

షనాయా కపూర్:

తదుపరి వ్యాసం