Diabetes: ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లలకి టైప్1 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువట, ఎందుకో తెలుసా?
05 November 2024, 12:21 IST
- Diabetes: టైప్1 డయాబెటిస్ అనేది పుట్టుకతోనే వచ్చే సమస్య. చాలా చిన్న వయసులోనే పిల్లలకు దీని ప్రభావాలు మొదలైపోతాయి. అయితే టైప్1 డయాబెటిస్ అబ్బాయిలకి ఎక్కువ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
టైప్1 డయాబెటిస్ ఎవరికి వస్తుంది?
డయాబెటిస్ పేరు చెబితేనే ఎంతోమందికి ఆందోళనగా అనిపిస్తుంది. డయాబెటిస్ తనతో పాటు అనేక రోగాలను శరీరంలోకి ఆహ్వానిస్తుంది. డయాబెటిస్‌లో ముఖ్యమైనవి రెండు రకాలు ఉన్నాయి. అవి టైప్1 డయాబెటిస్, టైప్2 డయాబెటిస్. టైప్2 డయాబెటిస్ అనేది వయసు ముదిరాక వచ్చే వ్యాధి. కానీ టైప్1 డయాబెటిస్ మాత్రం వారసత్వంగా వస్తుంది. అలాగే కుటుంబంలో ఎవరికి లేకపోయినా కూడా కొంతమంది పిల్లలకి వచ్చే అవకాశం ఉంది. చిన్న వయసులోనే టైప్1 డయాబెటిస్ బయటపడుతుంది. కొందరికి రెండేళ్ల వయసులో బయటపడితే మరికొందరికి పదహారేళ్ళ వయసులో బయటపడుతుంది. ఈ టైప్1 డయాబెటిస్ వచ్చే అవకాశం ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లల్లోనే ఎక్కువగా ఉంటుందని అధ్యయనం చెబుతోంది.
చిన్న వయసులోనే డయాబెటిస్ సోకడం వల్ల ఆ పిల్లల్లో ఎదుగుదల సమస్యలు మొదలవుతాయి. వారు బాల్యాన్ని ఆనందంగా జీవించలేరు. ఆహారం విషయంలో కూడా ఎన్నో పరిమితులు ఏర్పడతాయి. వారికి ఇష్టమైన ఆహారాన్ని తినలేరు. అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. బాల్యాన్ని ఎక్కువసేపు ఇంట్లోనే గడపాల్సి రావచ్చు. అందుకే టైప్1 డయాబెటిస్ వచ్చిన పిల్లలు మానసికంగా కూడా కుంగిపోతారు.
టైప్1 డయాబెటిస్ వల్ల వచ్చే సమస్యలు
టైప్1 డయాబెటిస్ వచ్చే అవకాశం అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలలో ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థ పనితీరు, జీవక్రియ పనితీరుపై కూడా ఆధారపడి వస్తుంది. పిల్లలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల కూడా టైపు1 డయాబెటిస్ రావచ్చు. అలాగే వారు ఒకేచోట స్థిరంగా కూర్చోవడం, ఎలాంటి శారీరక వ్యాయామానికి సంబంధించిన ఆటలు ఆడక పోవడం కూడా మధుమేహం రావడానికి ప్రధాన కారణం కావచ్చు. ఇక వారసత్వంగా వచ్చే అవకాశం ఉంటే దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. ఈ పిల్లల్లో చిన్నప్పుడే డయాబెటిస్ బారిన పడిన పిల్లల్లో జీవక్రియ రుగ్మతలు ఎక్కువగా వస్తాయి. వారు యుక్త వయసుకు రాగానే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైపోతాయి. దీనివల్ల మూత్రపిండాలు ఫెయిల్ అవ్వడం, రక్తనాళాలకు ఇబ్బంది కలగడం, గుండె సమస్యలు రావడం వంటివి జరుగుతాయి.
టైపు1 డయాబెటిస్ అనేది ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో కనిపించే సమస్య. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేనప్పుడు ఈ సమస్య మొదలవుతుంది. దీనికి పర్యావరణ కారకాలు రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం కూడా కారణంగానే చెప్పవచ్చు.
టైప్1 డయాబెటిస్ లక్షణాలు
పిల్లల్లో టైప్1 డయాబెటిస్ ఉంటే వారి షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల వారికి అలసటగా ఉంటుంది. నిద్ర వచ్చేలా అనిపిస్తుంది. మూత్ర విసర్జన కూడా తరచూ చేస్తుంటారు. దాహం అధికంగా ఉంటుంది. బరువు తగ్గి సన్నగా మారిపోతారు. మగతగా ఉండడం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, మూర్చ లక్షణాలు కనిపించడం, పొట్ట నొప్పి, వాంతులు, దృష్టి మసకబారడం వంటివి కూడా కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే వారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లి తగిన చికిత్స అందించడం అవసరం.
టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారికి పెట్టే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వారిచేత ప్రతిరోజూ ఎంతో కొంత శారీరక వ్యాయామం చేసేలా చూడాలి. ఇవన్నీ కూడా వారిలో టైప్ వన్ డయాబెటిస్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. టైప్ 1 డయాబెటిస్ అమ్మాయిల్లో కాకుండా అబ్బాయిల్లోనే ఎక్కువ రావడానికి వారి శరీర నిర్మాణం, వారిలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు సమ్మేళనాలు కూడా కారణం అవుతాయని పరిశోధకులు భావిస్తున్నారు.
టాపిక్