తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Black Layer On Neck : మెడపై నల్లగా ఉంటే మురికి కాదు.. ఈ 4 వ్యాధులే కారణం!

Black Layer On Neck : మెడపై నల్లగా ఉంటే మురికి కాదు.. ఈ 4 వ్యాధులే కారణం!

Anand Sai HT Telugu

16 March 2024, 10:30 IST

google News
    • Black Layer On Neck : కొందరికి మెడపై నల్లటి పొరలు వస్తుంటాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల వ్యాధులు కూడా ఇందుకు కారణం కావొచ్చు.
మెడపై నల్లటి పొరకు కారణాలు
మెడపై నల్లటి పొరకు కారణాలు (Unsplash)

మెడపై నల్లటి పొరకు కారణాలు

కొన్ని వ్యాధులకు లక్షణాలు మనం అర్థం చేసుకోలేం. లక్షణాలు చాలా సాధారణమైన అనేక వ్యాధులు ఉన్నాయి. ఫలితంగా మనం వాటి గురించి ప్రత్యేకంగా పట్టించుకోం. అలాంటి సమస్యల్లో ఒకటి నలుపు మెడ. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెడపై నల్ల మచ్చలు, అకాంథోసిస్ నైగ్రికన్స్ అని పిలుస్తారు. ఇది కొన్ని తీవ్రమైన వ్యాధికి సంకేతం. మురికి అని విస్మరించడాన్ని వీలు లేదు. మెడపై నల్లని పొరలు వస్తే ఎలాంటి వ్యాధులు ఉంటాయో చూద్దాం..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఊబకాయంతో బాధపడేవారిలో అకాంథోసిస్ నైగ్రికన్స్ సర్వసాధారణం. ఎందుకంటే స్థూలకాయం చర్మంలో అనేక పొరలను కలిగిస్తుంది. దాని వలన చర్మంలో పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. దీని కారణంగా మెడ చర్మం నల్లబడటం ప్రారంభమవుతుంది. కొందరికి ఈ సమస్య అతిగా ఉంటే.. మరికొందరికేమో తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

డయాబెటిక్ రోగులలో అకాంథోసిస్ నైగ్రికన్స్ సంభవించవచ్చు. ఎందుకంటే అలాంటి వారిలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేయదు. ఇన్సులిన్ కణాలు ఈ హార్మోన్ ప్రకారం పనిచేయలేవు. అటువంటి పరిస్థితులలో ఇన్సులిన్ నిరోధకత టైప్ 2 డయాబెటిస్‌కు కారణమవుతుంది. మధుమేహం ఉన్నవారికి ఇలా మెడపై నల్లటి చరలు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. దీనిని లైట్ తీసుకోవద్దు. వైద్యుడిని సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి.

హైపోథైరాయిడిజంలో, థైరాయిడ్ గ్రంథి ఈ హార్మోన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేయదు. దీని వలన అకాంథోసిస్ నైగ్రికన్స్ కారణంగా మెడ నల్లబడటం జరుగుతుంది. ఇలా మెడ నల్లబటినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని దానికి తగిన విధంగా మెడిసిన్ వాడుతూ ఉండాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయపడేందుకు అవకాశం ఉంటుంది. పట్టించుకోకపోతే సమస్య పెద్దగా అవుతుంది.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఓవేరియన్ సిస్ట్‌లు కూడా ఈ సమస్యను కలిగిస్తాయి. వాస్తవానికి ఈ పరిస్థితి ఉన్న మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు చాలా చెడుగా ఉంటాయి. దీని ప్రభావాలు చర్మంపై కనిపిస్తాయి. ఈ కారణంగా చర్మంపై నల్లగా మారుతుంది. ఇది మాత్రమే కాదు, PCOD ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్. ఇది అకాంథోసిస్ నైగ్రికన్స్ కారణమవుతుంది. ఈ కారణంగా సమస్యలు వస్తాయి.

మెడ మీద ఇలాంటి నల్లటి పొరలు ఏర్పడితే చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ పైన చెప్పిన వివిధ రకాల సమస్యలు వస్తాయి. అందుకే వైద్యుడిని సంప్రదించాలి. అప్పుడే సమస్య నుంచి బయటపడొచ్చు. అది మురికి అని మీరు భ్రమ పడితే మాత్రం సమస్యలు తప్పవు. ఎందుకంటే మురికి అయితే గట్టిగా చేతితో అంటే పోతుంది. కానీ పైన చెప్పిన వ్యాధులు ఉన్నవారికి మెడపై నలుపు పోదు. అందుకే సరిగా చికిత్స చేయించుకోవాలి.

తదుపరి వ్యాసం