తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rangoli Tips: ముగ్గులు వేయడం రాదా? వీటిని మీకోసమే కనిపెట్టారు

Rangoli tips: ముగ్గులు వేయడం రాదా? వీటిని మీకోసమే కనిపెట్టారు

27 August 2024, 12:30 IST

google News
  • Rangoli tips: ముగ్గులు వేయడం అందరికీ రావాలని లేదు. అయితే ముగ్గులేని లోటు లేకుండా కొన్ని మంచి ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ వినాయక చవితికి, రానున్న పండగలకు వాటిని వాడి ఇంటిని రంగులమయం చేసేయండి. కొత్త కళ తీసుకురండి.

రంగోలీ టిప్స్
రంగోలీ టిప్స్ (freepik)

రంగోలీ టిప్స్

రంగవళ్లులు వేయడం ఒక కళ. పెయింటింగ్ వేయడం, బొమ్మలు గీయడం వచ్చినవాళ్లు అలవోకగా ముగ్గులు వేసేస్తారు. కానీ అందరికీ రావాలని ఏముంది? అలానీ పండగరోజు ఇంట్లో రంగులద్దకపోతే ఏం బాగుంటుంది. ఈ వినాయక చవితికి మీ పని సులువు చేయడానికి మార్కెట్లోకి కొన్ని బెస్ట్ రంగోలీ ఉత్పత్తులు వచ్చేశాయి. వీటి ముందు చేయితో వేసిన రంగోలీ కూడా తీసిపోతుంది.

రంగోలీ స్టెన్సిల్స్:

రంగోలీ స్టెన్సిల్స్

పైన ఫోటోలో చూపిస్తున్నట్లు ఉంటాయి రంగోలీ స్టెన్సిల్స్. చిన్నా పెద్దా కాకుండా ఇల్లు మొత్తం నిండిపోయేంత పెద్ద డిజైన్లలోనూ ఈ అచ్చులు దొరుకుతున్నాయి. వీటిని ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు. వీటి మీద ముందే డిజైన్ వస్తుంది. దాంట్లో రంగులు నింపితే చాలు. ప్రతిసారీ ఒకే రకంగా అనిపించకుండా.. ఒకసారి పూరేకులతో నింపితే, మరోసారి నవధాన్యాలు, పప్పులు.. ఇలా రకరకాలుగా మార్చొచ్చు.

రంగోలీ మ్యాట్స్:

రంగోలీ మ్యాట్స్

రంగోలీ మ్యాట్స్ ఇప్పుడు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి. విభిన్న క్వాలిటీలలో అందుబాటులోకి వచ్చాయి. వీటిని డూర్ మ్యాట్ లాగా పరిచేయడమే. చూస్తే అచ్చం ముగ్గు లాగే ఉంటాయి. కార్నర్ రంగోలీ మ్యాట్స్ కూడా ఉంటాయిందులో. అంటే మూలల్లో అలంకరణ కోసం పెట్టేలా అదే ఆకారంలో దొరుకుతాయి. వీటి చుట్టూ పూరేకులు కానీ, చిన్న ముగ్గు వరస కానీ వేసి మీ చేత్తో ఒక టచ్ ఇచ్చేయండి. ఇవి మురికి అయితే ఉతికేసి మళ్లీ కొత్తగా వాడుకోవచ్చు. మంచి మంచి డిజైన్లు, రంగుల్లో దొరుకుతాయివి. పండగ రోజు ఇంటి గుమ్మం ముందు, లేదంటే రానున్న వినాయక చవితికి పీట ముందు వేసినా మంచి లుక్ వస్తుంది.

మెటాలిక్ ముగ్గులు:

మెటాలిక్ ముగ్గులు

మెటల్‌తో చేసిన ముగ్గులు కాని ముగ్గులు ఇవి. ఇవి కొన్ని పీసులతో సెట్ లాగా వస్తాయి. అందులో విభిన్న ఆకారాలుంటాయి. పూలు, ఆకులు, నెమలి పించాలు, కమలాలు.. రకరకాలుంటాయి. వాటిని మన సృజనాత్మకత జోడించి డిజైన్లలో అమర్చుకోవచ్చు. గణేష్ చతుర్థి రోజు వినాయకుడి పీట చుట్టూ వీటిని ఒక్కోటి వరసగా పెట్టినా బాగుంటాయి. ఒక్కసారి కొన్నారంటే ప్రతిసారీ విభిన్నంగా వాడుకోవచ్చు వీటిని.

బార్డర్ రంగోలీ స్టెన్సిల్స్:

బార్డర్ రంగోలీ స్టెన్సిల్

వినాయకుడు లేదా దేవతా మూర్తులను పీట మీద ప్రతిష్టించి పూజలు చేస్తాం. ఆ పీట చుట్టూ ముగ్గు వేయడానికి ఈ బార్డర్ రంగోలీ స్టెన్సిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సన్నగా వెడల్పుగా ఉండే ఇవి బోలెడు డిజైన్లలో, సైజుల్లో దొరుకుతాయి. పీట చుట్టూ కాదు ముగ్గు చుట్టు బార్డర్స్ వేయడానికి, గడప ముందు ముగ్గు వేయడానికి కూడా ఇవి బాగా పనికొస్తాయి. అచ్చు దింపేసి వాటిలో రంగులు నింపారంటే అద్భుతంగా కనిపిస్తుంది.

తదుపరి వ్యాసం