వినాయక చవితి రోజు కొన్ని చోట్ల గౌరీ గణేషులను దూది హారాలతో అలంకరిస్తారు. వాటి డిజైన్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

By Koutik Pranaya Sree
Aug 26, 2024

Hindustan Times
Telugu

కొన్ని ప్రాంతాల్లో హరితాలీక రోజు గౌరీ దేవీని, వినాయక చవితిరోజు గణేషుణ్ని దూది హారాలతో అలంకరిస్తారు. 

దూదికి రంగులద్ది సృజనాత్మకంగా ఈ హారాలను తయారు చేస్తారు. 

చిన్న కార్డ్ బోర్డు కత్తిరించి దానిమీద దూదితో చేసిన పువ్వొత్తులను అతికిస్తే మంచి పువ్వుల డిజైన్ రెడీ అవుతుంది. 

దూదిని పొడవుగా దారాల్లాగా తాల్చి, దానిమీద రంగుల పూలు అంటిస్తే ఈ డిజైన్ రెడీ అవుతుంది. 

పత్తితో పువ్వొత్తులు చేసి వాటిని అల్లాలి. మీద కుందన్లు, సీక్వెన్లు అంటిస్తే అందంగా కనిపిస్తాయి. అలాంటి డిజైనే ఇది. 

ఇంట్లో లేసులు ఉంటే. దాని మీద పత్తితో చేసిన పువ్వుల ఆకారాలు అతికించొచ్చు. ఇది చేయడం కాస్త సులభమే. 

ఇది కూడా చాలా సింపుల్ డిజైన్. లేసు మీద దూదితో చేసిన పూలు అతికిస్తే సరిపోతుంది. 

చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఇవి తప్పక తీసుకోండి

Photo: Pexels