తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Star Anise: పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చేలా చేసే అనాస పువ్వు..

Star anise: పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చేలా చేసే అనాస పువ్వు..

02 May 2023, 16:01 IST

google News
  • Star anise: కాస్త తియ్యగా, మంచి సువాసనతో ఉండే అనాసపువ్వు ఆహారం రుచి పెంచడంతో పాటూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

అనాస పువ్వు
అనాస పువ్వు (pexels)

అనాస పువ్వు

పొడిగా, పువ్వుగా అనాసపువ్వును వంటల్లో వాడుతుంటాం. కూరలు, రసం, బిర్యానీ, పులావ్, బిస్కట్లు, కేకుల్లో దీన్ని విరివిగా వాడుతుంటారు. నైరుతి చైనా, ఈశాన్య వియత్నాం దేశాలకు చెందిన ఇలీసియం వేరమ్ అనే చెట్టు మొగ్గలను ఎండబెడితే వచ్చేదే అనాసపువ్వు. మొగ్గ పక్వానికి రాకముందే కోసి, ఎరుపు రంగులోకి వచ్చే వరకు ఎండబెట్టి నిల్వ చేసుకోడానికి వీలుగా చేస్తారు. దీన్ని ఆయుర్వేదంలో కూడా వివిధ ఆరోగ్య సమస్యలకు వాడతారు.

అనాస పువ్వుతో చేసిన ఎసెన్షియల్ నూనెను చాకోలేట్లు, పర్ఫ్యూమ్‌లలో వాడతారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఉదర సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కూడా ఉపయోగిస్తారు.

చక్రఫూల్ లేదా అనాసపవ్వు ప్రయోజనాలు:

యాంటీ ఆక్సిడెంట్లు:

దీంట్లో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడతాయి. ఇవి క్యాన్సర్, గుండె వ్యాధులు, డయాబెటిస్ ను తగ్గించడంలో కూడా తోడ్పడతాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు:

వీటిలో వాపు తగ్గించే గుణాలున్నాయి. దానివల్ల దీర్ఘకాలిక రోగాలైన ఆర్థరైటిస్, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

జీర్ణ వ్యవస్థ:

అజీర్తి, గ్యాస్, బ్లోటింగ్ లాంటి సమస్యలకు ఇది మందు. ఆయుర్వేదంలో దీన్ని ఉదర సంబంధిత వ్యాధులని తగ్గించడంలో ఎక్కువగా వాడతారు.

రోగ నిరోధక శక్తి:

శరీరంలో ఉండే హానికర బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడటంలో అనాస పువ్వుకు ఉన్న యాంటీమైక్రోబియల్ లక్షణాలు సాయపడతాయి. ఇది రోగ నిరోధక శక్తి పెంచడంలో, ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో శరీరానికి సాయం చేస్తుంది.

శ్వాస వ్యవస్థ:

శ్వాస సంబంధిత వ్యాధులైన ఆస్థమా లాంటి వాటిని నయం చేయడానికి అనాస పువ్వు వాడతారు. సులువుగా శ్వాస తీసుకోవడంలో సాయం చేస్తుంది.

పీరియడ్స్:

మహిళల్లో హార్మోన్ల స్థాయుల సమతుల్యాన్ని అనాసపువ్వు కాపాడుతుంది. దానివల్ల అనాసపువ్వు చూర్ణాన్ని తేనెలో కలిపి తిన్నా, లేదంటే నీళ్లలో ఒక పువ్వు వేసుకుని మరిగించిన నీళ్లు తాగినా మంచిది. దీనివల్ల నెలసరి సమయంలో రక్తస్రావం నియంత్రిస్తుంది. నెలసరి సరిగ్గా, క్రమం వచ్చేలా చేయడంలో సాయపడుతుంది. మహిళలకు ఇది చేసే మేలు ఎక్కవ.

నొప్పులు:

కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి ఉన్నవాళ్లు అనాస పువ్వు (star anise)తో చేసిన ఎసెన్షియల్ నూనెతో మర్ధనా చేసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వాసన చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. సుఖంగా నిద్రపోయేలా సాయపడుతుంది.

అయితే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. వంటల్లో కూడా ఎక్కువ మోతాదులో దీన్ని వేయకూడదు. మోతాదు మించి తీసుకుంటే విరోచనాలయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

తదుపరి వ్యాసం