Beetroot Juice : బరువు తగ్గాలన్నా.. కలర్ పెరగాలన్నా.. దీనికి ఓటెయ్యొచ్చు..
16 June 2022, 13:45 IST
- బీట్‌రూట్ జ్యూస్ రోజూ తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయని.. ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు వ్యాపార నిపుణులు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ జ్యూస్ వల్ల ఉపయోగాలివే..
ప్రతిరోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వల్ల అనేక వ్యాధులు దూరం అవుతాయని వెల్లడించారు. ముఖ్యంగా గుండె సమస్యలను తగ్గిస్తుంది అంటున్నారు. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీకు మంచి ప్రయోజనాలు చేకూరతాయి అంటున్నారు.
రక్తపోటు అదుపులో ఉంటుంది..
బీట్‌రూట్ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది.
మెరిసేటి చర్మం కోసం..
బీట్‌రూట్ దుంపలలోని అనేక పదార్థాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. చర్మం కాంతివంతంగా లేని వారు నిత్యం దీని రసం తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు ఈ దుంప రసం చర్మాన్ని ఎండ నుంచి రక్షిస్తుంది.
కంట్రోల్లో కొలెస్ట్రాల్
బీట్‌రూట్ దుంపలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇందులోని కొన్ని పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది పరోక్షంగా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. బీట్‌రూట్ దుంపలలోని అనేక పదార్థాలు బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తాయి.
బీట్‌రూట్ దుంపలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా మంచి నాణ్యమైన యాంటీఆక్సిడెంట్. కాబట్టి బీట్‌రూట్ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. దీనివల్ల శరీర ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
కాలేయ సంరక్షణకు
కాలేయ సంరక్షణలో బీట్‌రూట్ దుంపలు మంచిగా పనిచేస్తాయి. అంతేకాకుండా నిత్యం బీట్‌రూట్ జ్యూస్ తీసుకునేవారిలో జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కాలేయంలో పేరుకుపోయిన కలుషితాలను క్లియర్ చేయడంలో బీట్‌రూట్ చాలా సహాయం చేస్తుంది.
బీట్‌రూట్ దుంపలు క్యాన్సర్‌ను నివారించడంలో గొప్పగా సహాయం చేస్తాయి. క్యాన్సర్‌ను నివారించే కొన్ని పదార్థాలను కలిగి ఉంటాయి. దీని రసం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ఉన్నవారికి కీమోథెరపీ వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా తగ్గుతాయి.