తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Tips With Tomato: ముఖంపై ఉన్న మచ్చలను సులువుగా టమోటాలతో పోగొట్టొచ్చు, ఇలా చేసి చూడండి

Beauty tips with Tomato: ముఖంపై ఉన్న మచ్చలను సులువుగా టమోటాలతో పోగొట్టొచ్చు, ఇలా చేసి చూడండి

Haritha Chappa HT Telugu

15 February 2024, 13:00 IST

google News
    • Beauty tips with Tomato: కాలుష్యం వల్ల ముఖంపై మచ్చలు పడుతూ ఉంటాయి. వాటిని టమోటాలతో సులువుగా పోగొట్టేలా చేయొచ్చు. ఈ టమోటా చిట్కా ఏమిటో తెలుసుకోండి.
సింపుల్ బ్యూటీటిప్స్
సింపుల్ బ్యూటీటిప్స్ (pexels)

సింపుల్ బ్యూటీటిప్స్

Beauty tips with Tomato: చర్మం కాంతివంతంగా మెరిస్తేనే ఎవరైనా అందంగా కనిపించేది. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. గాలి కాలుష్యం, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వంటి సమస్యల వల్ల ముఖం పేలవంగా మారుతుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. చర్మం మెరవాలన్నా, ఆ మచ్చలు పోవాలన్నా ఇంట్లోనే టమోటోల ద్వారా పోగొట్టుకోవచ్చు. రసాయనాలు కలిపిన క్రీములు వాడడం వల్ల ఇతర సమస్యలు రావచ్చు. కానీ సహజంగా టమోటాలను వాడడం వల్ల అలాంటి సమస్యలు ఏవీ రాకుండా చర్మం మెరుపును పొందుతుంది.

టమోటోలు కూరకి రుచినివ్వడమే కాదు, చర్మానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. ఎండాకాలం వస్తోంది కాబట్టి చర్మ సంరక్షణకు చిన్న చిన్న చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యమైనది ఈ టమోటో చిట్కా. ఎండలో తిరిగిన తర్వాత ముఖానికి ట్యాన్ పట్టేస్తుంది. అవి మచ్చలుగా మారిపోతాయి. వదిలించుకుని మచ్చలను పోయేలా చేయాలంటే ఈ చిన్న చిట్కాను పాటించండి.

టమోటా ప్యాక్ ఇలా చేయండి

ప్రతి ఇంట్లో శెనగపిండి ఉంటుంది. ఒక చిన్న కప్పులో శెనగపిండిని వేయండి. అందులో కాస్త పెరుగు కలపండి. అలాగే నాలుగైదు చుక్కల రోజ్ వాటర్‌ను కూడా వేయండి. ఇప్పుడు టమోటో రసాన్ని తీసి అందులో కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి. తరువాత దాన్ని ముఖానికి అప్లై చేయండి. మెల్లగా వేళ్ళతో మసాజ్ చేయండి. ఓ పావుగంటసేపు అలా వదిలేయండి. ఇది పూర్తిగా ఆరే వరకు ఉంచండి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖానికి పట్టిన మురికి వదిలిపోతుంది. అలాగే వ్యర్ధాలు, విష పదార్థాలు కూడా పోతాయి. దీనివల్ల మచ్చలు, మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

వారానికి ఇలా మూడుసార్లు ఈ టమోటో మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. అలాగే చర్మానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఈ మిశ్రమం ద్వారా చర్మానికి అందుతాయి. ఒక నెల రోజుల పాటు ఈ చిట్కాను పాటించి చూడండి. మీకు నెల రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఖచ్చితంగా పాటించాల్సిన చిట్కా ఇది. లేకపోతే చర్మం వాడిపోయినట్టు అవుతుంది. నల్లగా మారిపోతుంది.

మొటిమలు వచ్చే అవకాశాన్ని టమోటాలు చాలా వరకు తగ్గిస్తాయి. ఆయుర్వేదంలో టమోటోలకు ప్రత్యేక స్థానం ఉంది. చర్మం రంగును ఇది మెరుగుపరుస్తుంది. రెండు చెంచాల టమాటో గుజ్జులో, తేనె కలిపి ముఖాన్ని, మెడని శుభ్రం చేసుకుంటూ ఉంటే చర్మం మెరవడం ఖాయం. అలాగే శెనగపిండిలో టమోటో గుజ్జును బాగా కలిపి ఆ పేస్టును ముఖానికి పట్టిస్తే అది స్క్రబ్‌లా పనిచేస్తుంది. చర్మ రంధ్రాల్లో ఉన్న మురికిని తీసి పడేస్తుంది. ముల్తానీ మట్టిలో టమోటా జ్యూస్ కలిపి ముఖానికి ప్యాక్‌లా పట్టించాలి. అది ఎండిపోయాక చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఎండకు కమిలిపోయిన చర్మం తిరిగి అందంగా మారుతుంది.

తదుపరి వ్యాసం