ముఖంపై మొటిమలు తగ్గేందుకు తోడ్పడే ఫుడ్స్ ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Dec 05, 2023

Hindustan Times
Telugu

ముఖంపై మొటిమలు తగ్గేందుకు కొన్ని రకాల ఆహారాలు సహకరిస్తాయి. మొటిమలపై ప్రభావం చూపిస్తాయి. అలా.. మొటిమల సమస్యను తగ్గించగల ఫుడ్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి. 

Photo: Pexels

స్ట్రాబెర్రీలు, చెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్‍బెర్రీల్లో విటమిన్ సీతో పాటు యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తింటే మొటిమలు, నల్లమచ్చలు తగ్గేందుకు ఉపకరిస్తాయి. 

Photo: Pexels

బీట్‍రూట్‍లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మీ ఆహారంలో బీట్‍రూట్ తీసుకుంటే మొటిమలు తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. చర్మంపై పగుళ్లను కూడా ఇది తగ్గించగలదు. 

Photo: Pexels

అవకాడోలో చాలా విటమిన్స్, యాంటిఇన్‍ఫ్లమేటరీ లిపిడ్స్ ఉంటాయి. అందుకే దీన్ని తింటే మొటిమల సమస్య తగ్గుతుంది.

Photo: Pexels

బ్రకోలీ, కేల్‍ కూరగాయల్లో మినరల్స్, విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే లాంటి పోషకాలు ఉంటాయి. మీ ఆహారంలో వీటిని తీసుకున్నా మెటిమల సమస్య తగ్గేందుకు తోడ్పడతాయి. 

Photo: Pexels

గుమ్మడికాయలోనూ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. మొటిమలు, చర్మ సమస్యలపై గుమ్మడి కూడా మంచి ప్రభావం చూపుతుంది. 

Photo: Pexels

ఈ హెల్దీ స్నాక్స్ రోజులో ఎప్పుడైనా తినేయవచ్చు.. రుచితో పాటు ఆరోగ్యం

Photo: Pexels