ఈ హెల్దీ స్నాక్స్ రోజులో ఎప్పుడైనా తినేయవచ్చు.. రుచితో పాటు ఆరోగ్యం
Photo: Pexels
By Chatakonda Krishna Prakash May 18, 2024
Hindustan Times Telugu
స్నాక్స్‌లా జంక్ ఫుడ్స్ కాకుండా ఆరోగ్యకరమైనవి తింటే చాలా మేలు. హెల్దీ స్నాక్స్ ద్వారా ప్రయోజనాలు కూడా దక్కుతాయి. అలా.. రోజులో ఎప్పుడైనా తినగలిగే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
శెనగల్లో ఫైబర్, ఫోలెట్, ఐరన్ సహా అవసరమైన చాలా పోషకాలు ఉంటాయి. శనగలను వేయించుకొని (ఫ్రై చేసుకొని) స్నాక్స్‌లా తింటే చాలా మేలు. సాలాడ్లలో కూడా కలుపుకోవచ్చు. శెనగలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.
Photo: Pexels
ఎలాంటి ఫ్లేవర్లు మిక్స్ చేయని పాప్‍కార్న్ కూడా మంచి హెల్దీ స్నాక్స్ ఆప్షన్. ఇవి తింటే శరీరానికి ఫైబర్, ఐరన్, కాపర్, కొన్ని విటమిన్లు అందుతాయి. అయితే, కారామిల్, చీజ్ సహా ఎలాంటి ఫ్లేవర్లు లేకుండా ప్లైన్‍గా ఉండే పాప్ కార్న్ తినాలి.
Photo: Pexels
బాదం, జీడిపప్పు, వేరుశనగ కాయలు, ఆక్రోటు ఇలా నట్స్ మిక్స్ చేసుకొని తినడం కూడా చాలా బెస్ట్ స్నాక్స్ ఆప్షన్. వీటిలో అన్‍సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యమైన విటమిన్లు సహా చాలా పోషకాలు ఉంటాయి.
Photo: Pexels
గుమ్మడి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సహా చాలా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. గిమ్మడి గింజలను ఫ్రై చేసుకొని, కాస్త ఉప్పు చల్లుకొని స్నాక్స్‌లా తినవచ్చు.
Photo: Pexels
కొన్ని రకాల పండ్లను ముక్కలుగా చేసుకొని తినడం కూడా చాలా మంచి స్నాక్స్‌లా ఉంటుంది. ఈ మిక్స్డ్ ఫ్రూట్ చాట్ వల్ల శరీరానికి పోషకాలు కూడా బాగా అందుతాయి.
Photo: Pexels
మొలకెత్తిన విత్తనాలు (స్పౌట్స్) కూడా స్నాక్స్‌లా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని సలాడ్‍లా కూడా తయారు చేసుకొని తినొచ్చు.