తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Corn Manchurian: బేబీ కార్న్‌తో ఇలా మంచూరియా చేసి చూడండి, వేడివేడిగా తింటే టేస్టీగా ఉంటుంది

Baby Corn Manchurian: బేబీ కార్న్‌తో ఇలా మంచూరియా చేసి చూడండి, వేడివేడిగా తింటే టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

02 June 2024, 15:30 IST

google News
    • Baby Corn Manchurian: బేబీ కార్న్ చాలా రుచిగా ఉంటాయి. వీటితో ఒకసారి మంచూరియా చేసి చూడండి. చూస్తేనే నోరూరిపోతుంది. సాయంత్రం స్నాక్ గా ఇది ఉపయోగపడుతుంది.
బేబీకార్న్ మంచూరియా రెసిపీ
బేబీకార్న్ మంచూరియా రెసిపీ

బేబీకార్న్ మంచూరియా రెసిపీ

Baby Corn Manchurian: బేబీ కార్న్ సాధారణ ధరకే మార్కెట్లో లభిస్తుంది. దీంతో బిర్యానీ అధికంగా చేస్తూ ఉంటారు. అలాగే బేబీ కార్న్ మంచూరియా కూడా చేయవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. బేబీ కార్న్ తో అనేక రకాల స్నాక్స్ ను తయారు చేయవచ్చు. ఇక్కడ మేము మంచూరియా ఎలా చేయాలో ఇచ్చాము. ఇది రెస్టారెంట్ స్టైల్ లో అదిరిపోతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

బేబీ కార్న్ మంచూరియా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బేబీ కార్న్ - పది

కార్న్ ఫ్లోర్ - మూడు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

సోయాసాస్ - రెండు స్పూన్లు

చిల్లీ సాస్ - ఒక స్పూను

టమాటా సాస్ - రెండు స్పూన్లు

నూనె - వేయించడానికి సరిపడా

వెల్లుల్లి తరుగు - అర స్పూను

ఉల్లికాడల తరుగు - ఒక స్పూను

మైదాపిండి - రెండు స్పూన్లు

బేబీ కార్న్ మంచూరియా రెసిపీ

1. సన్నగా ఉన్న బేబీ కార్న్‌లను ఇందుకోసం ఎంచుకోవాలి.

2. ఒక గిన్నెలో బేబీ కార్న్‌లను వేసి ఒక్కొక్క దాన్ని రెండు ముక్కలు చేసుకోవాలి.

3. అందులోనే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. కాస్త నీటిని కూడా వేయాలి.

4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. ఈ బేబీ కార్న్‌లను వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అర స్పూన్ నూనె వేయాలి.

7. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.

8. అలాగే వెల్లుల్లి తరుగును వేసి వేయించాలి. అందులోనే చిల్లి సాస్, సోయాసాస్, టమాటా సాస్ కూడా వేసి చిన్న మంట మీద వేయించాలి.

9. రుచికి సరిపడా ఉప్పును వేయాలి. ఇవన్నీ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి.

10. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ వేసి టాస్ చేసుకోవాలి.

11. రెండు నిమిషాలు అవి ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి.

12. పైన ఉల్లికాడల తరుగును వేసుకోవాలి. అంతే బేబీ మంచూరియా రెసిపీ రెడీ అయినట్టే.

12. దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి వారి చేత తినిపించండి. వారు మళ్ళీ మిమ్మల్ని అడగడం ఖాయం.

బేబీ కార్న్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీంతో టేస్టీ వంటకాలు ఎన్నో చేసుకోవచ్చు. మన డైట్ లో చేర్చుకోవాల్సిన ఆహారాల్లో ఇది కూడా ఒకటి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ తిన్నా మంచిదే. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే డీప్ ఫ్రై చేయడం వల్ల కొన్ని పోషకాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే ఇలా డీప్ ఫ్రై వంటకాలు వండుకొని ఎక్కువగా ఉడికించిన ఆహారంగా మార్చుకోవడమే మంచిది. అంటే కూరగా, బిర్యానీగా వండుకుంటే బేబీకార్న్ లోని పోషకాలని శరీరానికి చేరుతాయి.

తదుపరి వ్యాసం