తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Avoid Meat: ఒక నెలపాటు మాంసాహారం మానేసి చూడండి, మీ శరీరంలో ఇలాంటి మార్పులు వస్తాయి

Avoid Meat: ఒక నెలపాటు మాంసాహారం మానేసి చూడండి, మీ శరీరంలో ఇలాంటి మార్పులు వస్తాయి

Haritha Chappa HT Telugu

30 March 2024, 7:00 IST

google News
    • Avoid Meat: ప్రతిరోజూ మాంసాహారాన్ని తినేవారు ఒక నెలరోజుల పాటు దానికి దూరంగా ఉండి చూడండి. మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో గమనించండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా.
మాంసాహారం వదిలేస్తే ఎంతో ఆరోగ్యం
మాంసాహారం వదిలేస్తే ఎంతో ఆరోగ్యం (Pixabay)

మాంసాహారం వదిలేస్తే ఎంతో ఆరోగ్యం

Avoid Meat: ప్రపంచంలో శాకాహారులుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతోమంది మాంసాహారాన్ని విడిచి పెడుతున్నారు. మాంసాహారులు, శాఖాహారులుగా మారేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరం బరువు తగ్గేందుకు, శరీరానికి ఎక్కువ ఆరోగ్యాన్ని అందించేందుకు ఇలా చేస్తున్నారు. అలాగే మాంసం వల్ల వచ్చే ఇతర సమస్యలు రాకుండా ఉండేందుకూ శాకాహారులుగా మారుతున్నారు. శాఖాహారంలో అన్నీ మొక్కల ఆధారిత ఆహారాలే ఉంటాయి. ఇది గుండెకు, మూత్రపిండాలకు, రక్తనాళాలకు ఎంతో మేలు చేస్తాయి. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, అధిక రక్తపోటు వంటి సమస్యలు రాకుండా అడ్డుకునే శక్తి వీటికి ఉంది. అందుకే ఎంతోమంది మాంసాన్ని విడిచి శాఖాహారులుగా మారేందుకు ఇష్టం చూపిస్తున్నారు.

మాంసాహారం విడిచిపెడితే

మీకు మాంసాహారం అంటే ఇష్టమా.. అయితే ఒక నెలపాటు మాంసాన్ని విడిచిపెట్టి చూడండి. పూర్తిగా శాకాహారాన్ని తినండి. అది కూడా పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాలను ఎంచుకోండి. మొక్కల ఆధారిత ఆహారాలలో అన్ని రకాల పోషకాలు దొరుకుతాయి. ముఖ్యంగా దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక నెల పాటు మాంసాన్ని దూరం పెట్టి... ఆ నెలరోజులు తర్వాత మీ శరీరంలో వచ్చే మార్పులను గమనించండి. మీ ఆరోగ్యంలో ఎలాంటి సానుకూల ప్రభావాలు వస్తున్నాయో గమనించండి.

పూర్తి శాకాహారులుగా మారడం వల్ల మీ బరువు అదుపులో ఉంటుంది. హఠాత్తుగా పెరగడం వంటివి జరగదు. జంతు మాంసంతో పోలిస్తే శాఖాహార ఉత్పత్తుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి తక్కువ ఆహారాన్ని తింటారు. క్యాలరీలు కూడా శరీరానికి తక్కువే అందుతాయి. కాబట్టి బరువు పెరగరు. ఇక జంతు ఆధారిత ఆహారాలలో ప్రాసెస్ చేసిన మాంసాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతాయి. ఈ ఇన్ఫ్లమేషన్‌ను శరీరంలో ఎక్కువకాలం ఉంటే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్‌ఫాట్స్ కూడా దీంట్లో అధికంగా ఉంటాయి. దీనివల్ల మాంసాహారం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. ఒక నెలపాటు మీరు మాంసాహారాన్ని దూరంగా పెడితే రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు.

మీ మానసిక ఆరోగ్యం కోసం కూడా మాంసాహారాన్ని కొన్ని రోజులు పాటు వదిలేస్తే మంచిది. మానసిక ఆందోళనలు, మూడ్ స్వింగ్స్ వంటివి తగ్గుతాయి. కోపం తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటారు. శాఖాహారం శరీరంలో ఎన్నో మార్పులను తెస్తుంది. కణాలు నష్టపోకుండా కాపాడుతుంది. మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మెదడుకు మేలు చేసే కూరగాయలు, పండ్లు, నట్స్ అధికంగా తింటారు. కాబట్టి మెదడు చురుగ్గా ఉంటుంది. పనులను ప్రశాంతంగా చేసేలా చూస్తుంది.

నెలరోజుల పాటు మాంసాహారం మానేసి మీ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించుకొని పూర్తి శాకాహారులుగా మారండి. ఈ నెల రోజుల్లో మీ మానసిక, శారీరకపరంగా ఎలాంటి ఆరోగ్య మార్పులు కలిగాయో ఓ చోట రాసుకోండి. మీకు నచ్చితే శాఖాహారులుగా మారండి. లేదా అప్పుడప్పుడు మాంసాన్ని తినండి. కానీ ప్రతిరోజు తినకపోవడమే మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం