తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Asthma Symptoms And Remedies: ఆస్తమా లక్షణాలు ఇవే.. దీపావళికి, అలాగే చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Asthma Symptoms and Remedies: ఆస్తమా లక్షణాలు ఇవే.. దీపావళికి, అలాగే చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

HT Telugu Desk HT Telugu

26 October 2024, 18:00 IST

google News
    • Asthma Symptoms and Remedies: ఆస్తమా లక్షణాలను పసిగట్టి సత్వర చికిత్స తీసుకోవడం ద్వారా దీపావళి, అలాగే చలికాలంలో దీని నుంచి ఎదురయ్యే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆస్తమా లక్షణాలు, సహజ ఉపశమన చర్యలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్తమా లక్షణాలు, నివారణ చర్యలు
ఆస్తమా లక్షణాలు, నివారణ చర్యలు

ఆస్తమా లక్షణాలు, నివారణ చర్యలు

అందరికీ దీపావళి ఆనందాలనిచ్చే పండుగ. కానీ ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ఈ సమయం తీవ్రంగా ఇబ్బందిపెడుతుంది. బాణాసంచా పేలుళ్లు, ఉదయం, సాయంత్రం పొగమంచు, అలర్జీలు వంటి కారణాల వల్ల ఈ సమయంలో శ్వాసకోశ వ్యాధుల లక్షణాలు తీవ్రతరం అవుతాయి. ఆస్తమా లక్షణాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆస్తమా వ్యాధి లక్షణాలు

  • నిరంతర దగ్గు: దీర్ఘకాలికంగా దగ్గు తగ్గకపోవడం.
  • ఛాతీలో బిగుతు: ఛాతీలో ఒత్తిడి లేదా బిగుతుగా ఉండడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆలాగే ఆయాసం వస్తుంది.
  • ఛాతీలో శబ్దం: ఊపిరి తీసుకునేటప్పుడు ఛాతీలో విజిల్ సౌండ్ లేదా గరగర శబ్దాలు వినిపిస్తాయి.
  • అలసట: నిరంతరం అలిసిపోయి కనిపిస్తారు. బలహీనంగా ఉంటారు.
  • నిద్రలేమి: నిద్ర లేక ఇబ్బంది పడుతుంటారు. ఆలస్యంగా నిద్ర పోతుంటారు.

ఆస్తమాకు ఈ సీజన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • బాణాసంచాకు దూరంగా ఉండండి: పటాకల పొగ శ్వాసకోశ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి, పటాకాలకు దూరంగా ఉండండి.
  • మాస్క్ ధరించండి: బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి. ఇది పొగమంచు, అలర్జీ కారకాల నుండి రక్షిస్తుంది.
  • వైద్యుడిని సంప్రదించండి: మీ శ్వాసకోశ వ్యాధి తీవ్రతరం అవుతుంటే వైద్యుడిని సంప్రదించండి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆస్తమా లక్షణాలు మరింత ఎక్కువై ఇబ్బందిపెడుతాయి.
  • నెబ్యులైజర్ ఉపయోగించండి: వైద్య సలహా మేరకు నెబ్యులైజర్ ఉపయోగించడం వల్ల ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతుంది.
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • రోజూ వ్యాయామం చేయండి: రోజూ తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శ్వాసకోశ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి.
  • తగినంత నీరు తాగండి: తగినంత నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. రోజూ మూడు నాలుగు లీటర్ల నీళ్లు తాగడం మంచిది. సందేహం ఉంటే వైద్యుడిని సంప్రదించడం మేలు చేస్తుంది.
  • పొగ, మద్యపానం మానుకోండి: పొగతాగడం వల్ల మీ ఆస్తమా సమస్య మరింత పెరుగుతుంది. మద్యపానం వల్ల మీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల ఈ రెండింటికీ ఆమడ దూరంలో ఉండడం మంచిది.

తదుపరి వ్యాసం