శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు ఇవే

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jun 11, 2024

Hindustan Times
Telugu

శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండడంలో పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యమైన విటమిన్ల వల్ల శరీరంలో ఇమ్యునిటీ పెరుగుతుంది. అధిక శాతం ఆహారాల వల్లే శరీరానికి విటమిన్లు అందుతాయి. రోగ నిరోధక శక్తి పెంచేలా చేసే విటమిన్లు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

విటమిన్ సీ.. శరీరంలో రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. సిట్రస్ పండ్లు, పాలకూర, స్ట్రాబెర్రీలు, బొప్పాయి, క్యాబేజీ లాంటి వాటిలో విటమిన్ సీ మెండుగా ఉంటుంది. 

Photo: Pexels

రోగ నిరోధక శక్తిని ‘విటమిన్ ఏ’ కూడా మెరుగుపరుస్తుంది. క్యారెట్లు, బ్రకోలీ, చిలకడ దుంపలు సహా చాలా కూరగాయలు, టునా చేపల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. 

Photo: Pexels

విటమిన్ ఈ కూడా ఇమ్యునిటీకి తోడ్పడుతుంది. బాదం, వేరుశనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, కొన్ని రకాల నూనెలు సహా మరిన్ని విత్తనాల్లో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. 

Photo: Pexels

విటమిన్ డీ ద్వారా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలు, ఫ్యాటీ ఫిష్, పుట్టగొడుగులు సహా కొన్ని రకాల ఆహారాలతో పాటు సూర్యరశ్మి ద్వారా కూడా ఈ విటమిన్ శరీరానికి అందుతుంది. 

Photo: Pexels

ఐరన్ కూడా శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే కాయధాన్యాలు, పాలకూర, రెడ్ మీట్, టోఫు, గుమ్మడి గింజలు లాంటి ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు రెగ్యులర్‌గా తినడం చాలా ముఖ్యం. 

Photo: Pexels

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.

pixabay