తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pcod సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చడం కష్టమా? దీన్ని ఎలా అధిగమించవచ్చు?

PCOD సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చడం కష్టమా? దీన్ని ఎలా అధిగమించవచ్చు?

Manda Vikas HT Telugu

30 December 2021, 16:04 IST

    • పిసిఒడి, పిసిఒఎస్ సమస్యలు ఉన్న మహిళల్లో హర్మోన్ల అసమతుల్యత ఏర్పడి అది రుతుక్రమంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా వారు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిజానికి ఈ రెండూ ఒకేరమైన సారూప్యతలు కలిగి ఉన్నప్పటికీ ఒకదానికొకటి భిన్నమైనవి. వీటి మధ్య వ్యత్యాసం ఎలా అర్థం చేసుకోవచ్చో ఒకసారి నిశితంగా పరిశీలించండి.
PCOD/PCOS Symptoms
PCOD/PCOS Symptoms (Shutterstock)

PCOD/PCOS Symptoms

పిసిఒడి, పిసిఒఎస్ అనేవి మహిళల్లో అండాశయాలను ప్రభావితం చేసే పరిస్థితులు. ఇటువంటి సమస్యలు ఉన్న మహిళల్లో హర్మోన్ల అసమతుల్యత ఏర్పడి అది రుతుక్రమంపై ప్రభావం చూపుతుంది. దీంతో వారు గర్భం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

ట్రెండింగ్ వార్తలు

How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

New Broom Tips : కొత్త చీపురుతో ఇంట్లోకి దుమ్ము రావొచ్చు.. అందుకోసం సింపుల్ టిప్స్

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

Turmeric Water Benefits : వేడి నీటిలో పసుపు కలిపి తాగితే ఈ 7 సమస్యలు రాకుండా ఉంటాయి

అయితే చాలా మంది మహిళలు పిసిఒడి, పిసిఒఎస్ మధ్య గందరగోళానికి గురవుతుంటారు. నిజానికి ఈ రెండు సమస్యలు ఒకేరమైన సారూప్యతలు కలిగి ఉన్నప్పటికీ ఒకదానికొకటి భిన్నమైనవి. వీటి మధ్య వ్యత్యాసం ఎలా అర్థం చేసుకోవచ్చో ఒకసారి నిశితంగా పరిశీలించండి.

పిసిఒడి: 

స్త్రీలలో రెండు అండాశయాలు ఉంటాయి, అవి ప్రతి నెలా సాధారణంగా ఒక అండాన్ని విడుదల చేస్తాయి. అయితే ఈ అండాశయాలు  చాలా అపరిపక్వమైన లేదా పాక్షికంగా పరిపక్వమైన అండాలను విడుదల చేస్తే, ఆ పరిస్థితిని పిసిఒడి (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇలాంటి అపరిపక్వమైన అండాలు చివరికి తిత్తులుగా మారతాయి. పిసిఒడి కలిగిన మహిళల్లో కొన్ని  పొత్తికడుపుబరువు పెరగడం, క్రమరహిత పీరియడ్స్,  జుట్టు రాలడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.  పరిపక్వతలేని అండం వీర్యకణంతో కలిసినప్పటికీ ఫలదీకరణ జరగకపోవచ్చు, కాబట్టి సంతానోత్పత్తి కష్టంగా మారుతుంది. అయితే మంచి చికిత్స ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. పిసిఒడి ఉన్న స్తీలు కూడా గర్బం దాల్చవచ్చు, పిల్లల్ని కనవచ్చు అందుకోసం సరైన చికిత్సతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, శరీర బరువును నియంత్రించే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. 

పిసిఒఎస్: 

ఇక పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్) విషయానికి వస్తే, ఈ సమస్య ఉన్న మహిళల్లో, అండాశయాలు సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో పురుష హార్మోన్ అయిన ఆండ్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది అండాల అభివృద్ధి, విడుదలకు ఆటంకం కలిగిస్తుంది. కొన్నిసార్లు అండాలు తిత్తులుగా లేదా ద్రవంతో నిండిన చిన్న బుడగలు, సంచుల మాదిరిగా అభివృద్ధి చెందుతాయి. అండం విడుదలయ్యే సమయంలో విడుదల కాకుండా అండాశయాలల్లోనే విడుదలవుతూ కొన్నిసార్లు పెద్దవిగా తయారవుతాయి. 

పిసిఒఎస్ లక్షణాలు అందరు మహిళల్లో ఒకేలా ఉండవు, సాధారణంగా అయితే క్రమరహిత పీరియడ్స్ లేదా పీరియడ్స్ అసలే లేకపోవడం, రక్తస్రావం సమస్యలు, మొటిమలు, అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం, మానసిక కల్లోలం, చిరాకు, బరువు పెరగడం లేదా ఊబకాయం తదితర లక్షణాలు కనిపిస్తాయి.

హర్మోన్ల అసమానతలు..

PCOS ఉన్న మహిళలకు, హార్మోన్ల అసమానతల కారణంగా గర్భం దాల్చడం ఒక సవాలుగా ఉంటుంది. వీరు గర్భం దాల్చాలంటే, పురుషుడి శుక్రకణాన్ని అండంలోకి జొప్పించే అనుకూల వాతావరణాన్ని సృష్టించాల్సి ఉంటుంది. PCOD కంటే PCOS ఇంకా తీవ్రమైన పరిస్థితి.

PCOD నిజానికి ఒక వ్యాధిగా కూడా పరిగణించరు, ఎందుకంటే దీనిని ఏదో రకంగా నయం చేసుకోవచ్చు. కానీ పిసిఒఎస్ అనేది పూర్తిగా నయం కాని ఒక రుగ్మత. అయినప్పటికీ మందులు, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైనఆహారంతో ఈ సమస్య లక్షణాలను తగ్గించవచ్చు.

 

టాపిక్

తదుపరి వ్యాసం