గర్భంతో ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? వైద్యుల సలహాలు ఇలా..
28 February 2022, 20:08 IST
- కోవిడ్ మొదటి దశతో పోల్చి చూస్తే రెండవ దశలో ఎక్కువ మంది మహిళలకు గర్భధారణ సమయంలో కోవిడ్ -19 సోకింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే గర్భధారణ సమయంలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా చివరి మూడు నెలలో గర్భాశయం విస్తరించి యోని ద్వారమును మూయటానికి ఉపయోగించే సంతాన నిరోధక వ్య్వస్థ మీద ఒత్తిడి తీసుకుని వస్తుంది.
Vaccines for pregnant women
గర్భధారణ సమయంలో మహిళలు కోవిడ్ -19 టీకాలు తీసుకోవడానికి మన దేశంలో ఆరోగ్యశాఖ అనుమతినిచ్చింది. గర్భిణీలు టీకా తీసుకోవడం వారికి ఒక విధంగా మంచిదే అని వైద్యులు చెబుతున్నారు. మహిళలు తమను తాము కోవిడ్ నుంచి రక్షించుకుంటూ తమ పిల్లల సంరక్షణకు ఎటువంటి చర్యలను తీసుకోవాలన్న అంశంపై న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ ప్రసూతి, గైనకాలజీ విభాగ అధిపతి డాక్టర్ మంజు పూరి సూచనలు, సలహాలు ఇచ్చారు.
గర్భధారణ సమయంలో కూడా స్త్రీ కోవిడ్ -19 వ్యాక్సిన్లను తీసుకోవచ్చు, ఇది వారికి ఎలా సహాయపడుతుంది?
కోవిడ్ మొదటి దశతో పోల్చి చూస్తే రెండవ దశలో ఎక్కువ మంది మహిళలకు గర్భధారణ సమయంలో కోవిడ్ -19 సోకింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే గర్భధారణ సమయంలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా చివరి మూడు నెలలో గర్భాశయం విస్తరించి యోని ద్వారమును మూయటానికి ఉపయోగించే సంతాన నిరోధక వ్య్వస్థ మీద ఒత్తిడి తీసుకుని వస్తుంది. దీనితో మహిళ శరీరంలో ఆక్సిజన్ సాంద్రత తగ్గుతుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోవడానికి దారితీస్తుంది. అంతేకాకుండా తల్లి, బిడ్డ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. గర్భిణీలకు తీవ్రమైన వ్యాధులు సోకకుండా నివారించే అంశంలో వ్యాక్సిన్లు సహాయపడతాయి.
తల్లికి టీకా వేయడం వల్ల నవజాత శిశువుకు కొంత రక్షణ లభిస్తుంది. ఎందుకంటే టీకా తీసుకున్న తరువాత తల్లి శరీరంలో అభివృద్ధి చెందిన ప్రతిరోధకాలు ఆమె రక్తం ద్వారా గర్భంలో పెరుగుతున్న పిండానికి చేరతాయి. పిల్లలకు చనుబాలు ఇస్తున్న తల్లుల విషయంలో శిశువుకు పాల ద్వారా ఈ ప్రతిరోధకాలు లభిస్తాయి.
టీకాలు మహిళల్లో వంధత్వానికి దారి తీస్తాయని కొందరు నమ్ముతారు. ఇది నిజమా?
ఇవి కేవలం పుకార్లు మాత్రమే, వైరస్ కంటే కూడా ఇలాంటి తప్పుడు సమాచారం చాలా ప్రమాదకరమైనది.
కోవిడ్ -19 టీకాలు మనకు కొత్తవే అయినప్పటికీ, ఇవి అనేక పద్ధతులను ఉపయోగించి అభివృద్ధి చేశారు. టీకా ద్వారా శరీరం ఒక నిర్దిష్ట వ్యాధికారకానికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. ఇది ఇతర శరీర కణజాలాలను ప్రభావితం చేయదు. వాస్తవానికి, గర్భధారణ సమయంలో కూడా మహిళలు మరియు వారి పుట్టబోయే బిడ్డను వివిధ వ్యాధుల నుంచి రక్షించడానికి హెపటైటిస్ బి, ఇన్ఫ్లుఎంజా, పెర్టుసిస్ వ్యాక్సిన్ వంటి కొన్ని టీకాలను ఇస్తున్నారు.
టీకాల భద్రతపై నమ్మకం ఏర్పడిన తరువాత మాత్రమే గర్భధారణ సమయంలో వ్యాక్సిన్ వేయడానికి అనుమతులు మంజూరు అయ్యాయి. టీకాల వల్ల వంధత్వానికి కారణమవుతాయని చూపించే శాస్త్రీయ సమాచారం లేదా అధ్యయనాలు లేవు. ఈ టీకాలు పునరుత్పత్తి అవయవాలను ఏ విధంగానూ ప్రభావితం చేయవు.
టాపిక్