తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair And Garlic: వెల్లుల్లిపాయలను జుట్టుకు అప్లై చేశారంటే జుట్టు రాలే సమస్య రెండు వారాల్లో ఆగిపోతుంది

Hair and Garlic: వెల్లుల్లిపాయలను జుట్టుకు అప్లై చేశారంటే జుట్టు రాలే సమస్య రెండు వారాల్లో ఆగిపోతుంది

Haritha Chappa HT Telugu

09 August 2024, 16:30 IST

google News
  • Hair and Garlic: మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే, వెల్లుల్లితో చిన్న చిట్కాలను పాటించడం ద్వారా  వెంట్రుకలు రాలకుండా అడ్డుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను ఎలా వాడాలో తెలుసుకోండి.

వెల్లుల్లి ఉపయోగాలు
వెల్లుల్లి ఉపయోగాలు (shutterstock)

వెల్లుల్లి ఉపయోగాలు

జుట్టు రాలడం ఎక్కువమందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. జుట్టు రాలుతున్నప్పుడు, కొత్త జుట్టు పెరగకపోతే అది బట్టతలగా మారిపోతుంది. కాబట్టి వెంట్రుకలు ఊడుతున్నప్పుడు ప్రాథమిక దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు రాలడానికి అనుగుణంగా జుట్టు పెరుగుదల లేకపోతే, అప్పుడు వెంటనే కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. ఈ చిట్కాల ద్వారా జుట్టు రాలే సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడానికి వెల్లుల్లి ఎఫెక్టివ్ హోం రెమెడీ అని చెప్పుకోవచ్చు. దీని సహాయంతో జుట్టు పెరుగుదలను కాపాడుకోవచ్చు. వెల్లుల్లిని అప్లై చేయడానికి ఈ పద్ధతిని అనుసరించండి.

వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతుంది?

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. దీని సహాయంతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. అల్లిసిన్ హెయిర్ ఫోలికల్స్ ను ప్రేరేపిస్తుంది. దీనివల్ల జుట్టు వేగంగా పెరిగి జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. కానీ వెల్లుల్లిని నేరుగా నెత్తిమీద రుద్దితే చికాకు, దురద, మంట కలుగుతాయి. అలాగే జుట్టు నుంచి వెల్లుల్లి వాసన వస్తుంది. కాబట్టి వెల్లుల్లిని ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

ముందుగా ఒక వెల్లుల్లిని నూరి ఒక గాజు సీసాలో వేయాలి. అందులో 50 మిల్లీలీటర్ల నీటిని నింపాలి. ఆ తరువాత ఆ సీసాను ఎండలో లేదా వెచ్చని ప్రదేశంలో రెండు రోజులు ఉంచాలి. ఆ తరువాత ఈ ద్రవాన్ని స్ప్రే బాటిల్లో తిప్పండి. తలకు స్నానం చేయడానికి రెండు మూడు గంటల ముందు ఈ స్ప్రేను జుట్టుకు అప్లై చేయాలి. వెంట్రుకల మొదళ్ల నుంచి దీన్ని అప్లై చేయాలి. రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. జుట్టుకు వాసన రాకూడదు అనకుంటే… వెల్లుల్లి నీళ్లలో 2 చుక్కల నిమ్మరసం కలుపుకోవచ్చు.

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం నలిపిన వెంటనే బయటికి పోతుంది. కాబట్టి దాన్ని భద్రపరుచుకోవాలంటే వెల్లుల్లిని నూరిన వెంటనే నీళ్లలో వేయాలి. తద్వారా అవి నీటిలో చురుకుగా కలిసిపోతాయి. జుట్టు రాలడం, చివర్లు పగలడం, చుండ్రు వంటి సమస్యలను ఎదుర్కోవడంలో ఈ వెల్లుల్లి నీరు ఎంతో సహాయపడుతుంది.

వెల్లుల్లి నీటిని ఒకసారి చేసుకుని భద్రపరచుకోవచ్చు. ఫ్రిజ్ భద్రపరచుకుని వాడే ముందు రెండు గంటల పాటూ బయట వదిలేయాలి. ఒకసారి ఈ వెల్లుల్లి జ్యూస్ తలకు పట్టిస్తే మళ్లీ వారం రోజుల పాటూ వాడాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే వారంలో రెండు సార్లు ఈ జ్యూస్ అప్లై చేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం