తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brinjal Curry: ఏ మసాలాలు లేకుండా అదిరిపోయే వంకాయ కొత్తిమీర కూర

brinjal curry: ఏ మసాలాలు లేకుండా అదిరిపోయే వంకాయ కొత్తిమీర కూర

27 April 2023, 12:03 IST

  • brinjal curry: సులభంగా, తక్కువ మసాలాతో చేసుకునే వంకాయ కొత్తమీర కూర తినడానికి రుచిగా, చేయడానికి సులభంగా ఉంటుంది. 

వంకాయ కొత్తిమీర కూర
వంకాయ కొత్తిమీర కూర

వంకాయ కొత్తిమీర కూర

వంకాయ వంటి కూర ఇంకోటి లేదంటారు. ఒకే రకమైన కూరను వివిధ ప్రాంతాల్లో విభిన్న రకాలుగా వండుతారు. ఎలాంటి మసాలాలు లేని వంకాయ కొత్తిమీర కూర మాత్రం గోదావరి జిల్లాల్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేస్తారో చూద్దాం. పదంటే పదే నిమిషాల్లో కూర తయారవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కావాల్సిన పదార్థాలు:

అరకిలో- వంకాయలు (పచ్చని పొడుగు వంకాయలు)

ఒక కట్ట - కొత్తిమీర

పచ్చి మిర్చి - 5

జీలకర్ర - 1/2 టీస్పూన్

పసుపు - 1/2 టీస్పూన్

ఉప్పు - తగినంత

నూనె - రెండు టేబుల్ స్పూన్లు

త‌యారు చేసే విధానం:

step 1: వంకాయ‌ల్ని పొడవాటి ముక్కలుగా తరిగి రంగు మారకుండా ఉప్పు వేసిన నీళ్ల‌లో వేయాలి.

step 2: ఇప్పుడు కాడలతో సహా తరిగిన కొత్తిమీర‌, ఉప్పు, ప‌చ్చి మిర్చి, జీలకర్ర క‌లిపి మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి.

step 3: ఒక పాన్‌లో నూనె వేసి కాగిన త‌రువాత వంకాయ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టాలి. ముక్కలు కాస్త మగ్గాక పసుపు, కొన్ని నీళ్లు పోసుకొని మళ్లీ మూత పెట్టుకోవాలి.

step 4: ముక్కలు ఉడికి నీరు ఇంకి పోయాక కొత్తిమీర మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇపుడు వంకాయ ముక్కల్ని స‌న్న‌ని సెగ మీద మ‌గ్గ‌నివ్వాలి. అయిదు నిమిషాల్లో నీరు ఇంకిపోయి కూర సిద్ధం అవుతుంది. ఈ కూర అన్నం, చపాతీలోకి బాగుంటుంది.

 

టాపిక్

తదుపరి వ్యాసం