తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For High Bp। హైబీపీని సహజంగా తగ్గించే యోగాసనాలు ఇవే!

Yoga for High BP। హైబీపీని సహజంగా తగ్గించే యోగాసనాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

26 July 2023, 17:18 IST

    • Yoga for High Blood Pressure: హైపర్‌టెన్షన్‌ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. హైబీపీని సహజమైన రీతిలో తగ్గించుకోవడానికి యోగాలో కొన్ని ఆసనాలు ఉపయోగపడతాయి. ఏది ఉత్తమమో చూడండి.
Yoga for High Blood Pressure- anulom vilom
Yoga for High Blood Pressure- anulom vilom (getty images)

Yoga for High Blood Pressure- anulom vilom

Yoga for High Blood Pressure: ఈరోజుల్లో హైబీపీ సమస్య ప్రజల్లో ఒక సాధారణ సమస్యగా తయారవుతోంది. హైపర్‌టెన్షన్‌ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. నిశ్చల జీవనశైలి, ఊబకాయం, ధూమపానం, అధిక ఒత్తిడి, అనారోగ్యపు ఆహారపు అలవాట్లు బీపీ పెరగడానికి కారణమవుతాయి. వయసు పెరగటం కూడా హైబీపీకి ఒక కారణమే. హైబీపీ రోగులకు గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైబీపీని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

హైబీపీ/ హైపర్‌టెన్షన్‌ లక్షణాలు:

- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

- అలసటగా అనిపించడం

- తలనొప్పి

- మైకము

- ఛాతి నొప్పి

హైబీపీని సహజమైన రీతిలో తగ్గించుకోవడానికి యోగాలో కొన్ని ఆసనాలు ఉపయోగపడతాయి. అన్నింటికంటే ప్రాణయామం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ప్రాణయామం చేయడం కూడా చాలా సులభం, ఎవరైనా చేయవచ్చు. ఈ ప్రాణాయామంతో హైబీపీ తగ్గడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఇతర మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడైతే హైబీపీ తగ్గడానికి ప్రాణాయామంలో ఏది ఉత్తమమో చూడండి.

అనులోమ విలోమ ప్రాణాయామం

రోజూ ఉదయం ఖాళీ కడుపుతో అనులోమ విలోమ సాధన చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను నయం చేస్తుంది. ఆస్తమా, న్యుమోనియా, క్షయ వంటి ఊపిరితిత్తుల పరిస్థితులను ఎదుర్కోవడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

అనులోమ విలోమ ప్రాణాయామం చేయడానికి, ముందుగా యోగా మ్యాట్‌పై కూర్చోండి. పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోండి, దీని తర్వాత మీ కుడి చేతి బొటనవేలుతో కుడి నాసికా రంధ్రం మూసివేయండి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి. కుడివైపు పూర్తయ్యాక ఎడమ వైపు నుండి కూడా ఇలాగే చేయండి. మీ ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి, కుడి నాసికా రంధ్రం ద్వారా ఊపిరి పీల్చుకోండి. దీని తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి, కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకోండి. ఇలా ఈ ప్రక్రియను సుమారు 10 నిమిషాలు చేయండి.

భ్రమరీ ప్రాణాయామం

భ్రమరీ ప్రాణాయామం శ్వాసను నియంత్రించే ఒక టెక్నిక్. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరం కోలుకునే సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం ఆచరిస్తున్నపుడు ఏర్పడే ప్రకంపనాలతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుముఖం పడతాయి, మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. థైరాయిడ్, సైనస్, మైగ్రేన్, రక్తపోటు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. భ్రమరీ ప్రాణాయామాన్ని క్రమం తప్పకుండా అభ్యసించడం కూడా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు.

ఈ ఆసనం వేసేందుకు ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చుని, మీ అరచేతులను మీ ముఖంపై ఉంచండి. చూపుడు వేళ్లతో కళ్లపై సున్నితంగా నొక్కండి. మధ్య వేళ్లను ముక్కు పక్కన, పెదవులపై ఉంగరపు వేళ్లను, నోటి చివర చిన్న వేళ్లను తాకండి. బొటనవేళ్లతో చెవులను సున్నితంగా కప్పండి. ఇప్పుడు ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకోండి, శబ్దం చేస్తూ గాలిని వదిలివేయండి. భ్రమరీ ప్రాణాయామంను కనీసం ఓ 5 నిమిషాలు చేయండి.

హైబీపీ ఉంటే ఈ యోగాసనాలు వేయకూడదు

హైబీపీ ఉన్నవారు చేయకూడని ఆసనాలు కూడా యోగాలో కొన్ని ఉన్నాయి. శీర్షాసనము, అదో ముఖ స్వనాశనం. ఉత్తనాసన యోగాసనం వంటివి హైబీపీ కలిగిన వ్యక్తులు ఆచరించడం నిషిద్ధం. ఈ యోగాసనాలు వేయడం వల్ల మనిషికి రక్తపోటు మరింత పెరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

తదుపరి వ్యాసం