Yoga For Beginners । మొదటిసారి యోగా చేస్తున్నారా? ఈ 5 ఆసనాలతో ప్రారంభించండి!
13 July 2023, 7:30 IST
- Yoga For Beginners: మీరు మొదటిసారి యోగా చేస్తుంటే, ప్రారంభీకుల కోసం యోగా నిపుణులు కొన్ని సులభమైన యోగాసనాలు సూచించారు. ఎలాంటి ఆసనాలు వేయవచ్చో తెలుసుకోండి.
Yoga For Beginners
Yoga For Beginners: మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మీ ఫిట్‌నెస్ స్థాయిలను పెంచుకోడానికి మీ ముందున్న సులభమైన మార్గం యోగా చేయడం. యోగా ఆసనాలను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల మీరు శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. యోగాలో అన్ని వయసుల వారికి సరిపోయే అనేక రకాలైన ఆసనాలు, భంగిమలు, యోగ ముద్రలు ఉన్నాయి. వీటి అభ్యాసం మిమ్మల్ని బలోపేతం చేస్తాయి. మీ కండరాలను టోన్ చేయడం, మీ శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచడం, మీ కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడం, సహా మీ ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
అయితే, యోగాసనాలు సాధనం చేయమని చెప్పడం సులభమే, కానీ వాటిని ఆచరించడం మాత్రం అంత సులభం కాకపోవచ్చు. ఎవరికైనా, ఏదైనా కొత్తగా ప్రారంభించడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. మీరు మొదటిసారి యోగా చేస్తుంటే, ప్రారంభీకుల కోసం సెలబ్రిటీ యోగా నిపుణురాలు అన్షుక పర్వాణి కొన్ని సులభమైన యోగాసనాలు సూచించారు. దీపికా పడుకోణ్, అనన్య పాండే, రకుల్ ప్రీత్ సింగ్ మొదలైన వారికి అన్షుక పర్వాణి యోగా శిక్షణ అందిస్తారు. ఆమె ప్రకారం, తొలిసారిగా యోగా చేయాలనుకునేవారు ఎలాంటి ఆసనాలు వేయవచ్చో తెలుసుకోండి.
తాడాసనం
దీనిని పర్వత భంగిమ (Mountain Pose) అని పిలుస్తారు. ఇది నిలబడి చేసే యోగాసనం, ఇది యోగాలో ప్రాథమిక స్థాయి ఆసనం. ఇతర ఆసనాలు వేసేందుకు కూడా ఈ భంగిమనే ఆధారం. తడసానం వేయడానికి, మీ వేళ్లను ఇంటర్‌లాక్ చేయండి, మీ చేతులను మీ తలపైకి చాచి, శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ మీ కాలి వేళ్లను పైకి ఎత్తండి. కనీసం 10-12 సెకన్ల పాటు భంగిమలో ఉండటం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గటంతో పాటు ఒళ్లు నొప్పుల నుండి ఉపశమనం, మెరుగైన రక్త ప్రసరణ, కండరాలకు సరైన ఆకృతిని ఇవ్వడం వంటి ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. తాడాసనంను రోజులో ఏ సమయంలోనైనా సాధన చేయవచ్చు.
వృక్షాసనం
ఈ ఆసనం (tree pose) పాదాలలో స్నాయువులను బలోపేతం చేయడానికి, సమతుల్యతను మెరుగుపరచడానికి, సయాటికా నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
బిటిలాసన మార్జర్యాసనం
దీనిని క్యాట్ కౌ పోజ్ (Cat cow pose) అంటారు. ఈ భంగిమ మీ శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది, వెన్నెముక, మెడ కండరాలను సాగదీస్తుంది వాటిని బలపేతం చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.
భుజంగాసనం
ఈ ఆసనం (Cobra Pose) మీ వెన్నుభాగం, మీ భుజాలను సాగదీస్తుంది, వాటిని బలపేతం చేస్తుంది, ఉదర కండరాలను టోన్ చేస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
సుప్త మత్స్యేంద్రసనం
ఈ భంగిమ (Spine Twist On Back Pose) వెన్నెముక చలనశీలతను మెరుగుపరుస్తుంది, వెన్ను కండరాలు సాగదీసి, వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది.
watch video here: