Alcohol: మద్యాన్ని పారదర్శకంగా ఉండే గాజు గ్లాసుల్లోనే ఎందుకు తాగుతారు?
28 February 2024, 10:30 IST
- Alcohol: ఎప్పుడైనా మద్యం తాగే వారిని గమనించండి పారదర్శకంగా ఉండే గ్లాసులనే వాడతారు. ముఖ్యంగా గాజు గ్లాసులనే వాడతారు. అలా ఎందుకు వాడతారో ఎప్పుడైనా ఆలోచించారా?
గాజు గ్లాసులు
Alcohol: మద్యం తాగేవారు పారదర్శకమైన గాజు గ్లాసులను వినియోగిస్తారు. లేకపోతే పారదర్శకంగా ఉండే డిస్పోజబుల్ గ్లాసులలో తాగుతారు. ఇలా ఆల్కహాల్‌ను పారదర్శకంగా ఉన్న గ్లాసుల్లోనే ఎందుకు తాగుతారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరూ కూడా స్టీలు గ్లాసులు, రంగు గ్లాసులను వాడరు. పారదర్శకమైన గ్లాసులనే ఎంచుకుంటారు. దీనికి కారణాన్ని వివరిస్తున్నారు నిపుణులు.
గాజుతో తయారుచేసిన వస్తువులు చూసేందుకు హుందాగా ఉంటాయి. వాటిలో వేసిన ఆహారాలు చూస్తే నోరూరుతాయి. అంతేకాదు గాజు ఇతర ఉత్పత్తులతో పోలిస్తే రియాక్షన్ లక్షణాన్ని తక్కువగా చూపిస్తుంది. అంటే గాజు గ్లాసు లేదా గాజు ప్లేటులో ఏవైనా ఆహారాలను వేస్తే ఆ పదార్థాలతో రసాయన సంబంధాలను కలిగి ఉండదు. దీనివల్ల వాటి రుచి, వాసన మారవు. అదే ఇతర గ్లాసులైతే ఆహారంతో రసాయన సంబంధాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. దీని వల్ల ఆహారం రుచి మారవచ్చు. అందుకే పూర్వం నుంచి గాజు గ్లాసుల్లోనే ఆల్కహాల్ ను ఆస్వాదించడం మొదలుపెట్టారు.
గాజు గ్లాసు మద్యాన్ని ఏమాత్రం కలుషితం చేయదు. రుచి, వాసనను మార్చదు. అంతేకాదు నోరూరించేలా ఆల్కహాల్ బయటికి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు చూసేవారికి దాన్ని తాగాలన్న కోరిక కూడా పెరుగుతుంది. అందుకే పూర్వం నుంచి గాజు గ్లాసుల్లోనే ఆల్కహాల్ తాగడాన్ని అలవాటు చేసుకున్నారని అంటారు.
గాజు గ్లాసుల్లోనే ఆల్కహాల్ తాగడానికి మరో కారణం కూడా ఉంది. గాజు గ్లాసులో వేసిన ఆల్కహాలు త్వరగా గది ఉష్ణోగ్రత వద్దకు రాదు. గదిలోని ఉష్ణోగ్రత మార్పులను ఆ గాజు గ్లాసు తట్టుకుంటుంది. ఆల్కహాల్ వరకు చేరనివ్వదు. దీనివల్ల ఆల్కహాల్ ఉష్ణోగ్రత మారదు. అలాగే ఆ మద్యంలో ఏమైనా కలుషితాలు, వ్యర్ధాలు ఉంటే గాజు గ్లాసులోనుంచి చూస్తే క్లియర్ గా కనిపిస్తాయి. దాని వల్ల కూడా మద్యాన్ని గాజు గ్లాసులో తాగడం అలవాటు చేసుకున్నారని అంటారు.
గాజు గ్లాసు త్వరగా బ్యాక్టీరియాలకు చోటు ఇవ్వదు. అందులో వేసిన ఆహారాలు కాలుష్యం కాకుండా కాపాడుతుంది. అందుకే పూర్వం నుంచి మద్యం నిల్వలకు, మద్యాన్ని తాగేందుకు గాజు బాటిల్స్ ని, గాజు గ్లాసులను వాడడం ఆనవాయితీగా మారిపోయింది. ఇంతకుమించి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు.
టాపిక్