Afternoon Nap Benefits : మధ్యాహ్నం నిద్రపోతున్నారా? అయితే ఇది మీకోసమే..
06 December 2022, 15:07 IST
- Afternoon Nap Benefits : మధ్యాహ్నాం భోజనం చేసిన తర్వాత.. ఎవరికైనా కాస్త మగత ఫీలింగ్ వస్తుంది. అయితే ఉద్యోగాలు చేసేవారికి, చదువుకునేవారిపై ఈ మధ్యాహ్న నిద్ర బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంట్లో ఉండేవారు మాత్రం మధ్యాహ్నం చిన్న కునుకు తీయాలి అంటున్నారు నిపుణులు. దీనివల్ల మానసికంగా, శారీరకంగా కూడా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారా?
మధ్యాహ్నం నిద్రపోతున్నారా
Afternoon Nap Benefits : నేను పగలు అస్సలు పడుకోను అని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే మధ్యాహ్నం పడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు నిపుణులు. అరగంట నుంచి 2 గంటల వరకు పడుకోవడం ఆరోగ్యానికి శారీరకంగా, మానసికంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు. శరీరానికి రాత్రి నిద్ర ఎంత అవసరమో.. బ్యాటరీ రీఛార్జ్ కావడానికి మధ్యాహ్న నిద్రకూడా అంతే అవసరం అంటున్నారు.
నిద్ర సమతుల్యత శరీరానికే కాదు మొత్తం మనస్సుకు కూడా అవసరం. నిద్ర అవసరం ఒక్కొక్కరికి భిన్నంగా ఉండవచ్చు. కానీ సాధారణంగా 7-8 గంటల నిద్ర మంచిగా పరిగణిస్తాము. కానీ చాలా సార్లు ఉద్యోగం, కుటుంబం లేదా ఇతర బాధ్యతల కారణంగా ప్రజలు తెల్లవారుజామున నిద్రలేవాల్సి ఉంటుంది. అలాంటి వారు కచ్చితంగా మధ్యాహ్న నిద్రకు ప్రాధన్యత ఇవ్వాలి అంటున్నారు నిపుణులు. అయితే మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
* కొంతమందికి మధ్యాహ్నం పూట చిన్న నిద్ర కూడా చాలా రిలాక్స్‌గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
* శరీరానికే కాదు ఈ చిన్న నిద్ర మీ మైండ్‌ని కూడా రిలాక్స్ చేస్తుంది. పగటిపూట దాదాపు గంట నిద్రపోవడం వల్ల శరీరం మొత్తం కండరాలు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిద్రతో శరీరం, మనస్సు విశ్రాంతి పొందుతాయి. మీరు రిఫ్రెష్‌గా మేల్కొంటారు.
* చాలా సార్లు ప్రయాణం చేసిన తర్వాత లేదా రాత్రి పార్టీ నుంచి.. ఇంటికి ఆలస్యంగా వచ్చిన తర్వాత.. మీ నిద్రకు భంగం కలుగుతుంది. ఈ సమయంలో మధ్యాహ్నం నిద్ర.. మీ అలసటను తొలగించడానికి పని చేస్తుంది. పగటిపూట నిద్రపోయే అలవాటు ఉన్నవారు.. ముఖ్యంగా గృహిణులు.. పొద్దున్నే లేచి ఇంటి పనులు చూసుకోవడం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పనిచేయడం వెనుక పెద్ద కారణం ఉంది. వాళ్లకి అంత శక్తి మధ్యాహ్నాం తీసుకునే నిద్రవల్లే సాధ్యమంటున్నాయి పలు అధ్యయనాలు.
* వారి దినచర్య గడియారం ప్రకారం నడుస్తుంది. ఉదాహరణకు ఉదయాన్నే పనికి వెళ్లే వ్యక్తులు లేదా ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే పిల్లలకు.. మధ్యాహ్న నిద్ర వారిలో చురుకుదనాన్ని పెంచుతుంది.
* నిద్రలేకపోతే చిరాకు, మూడ్ స్వింగ్, ప్రవర్తనలో మార్పులు వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే పగటిపూట కునుకు తీసే వారి మానసిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. లేదంటే తలనొప్పి వచ్చే అవకాశముంది.
* ఈ చిన్నపాటి నిద్ర జ్ఞాపకశక్తిపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. ఇది కాకుండా.. శీఘ్ర నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ప్రతిదీ చేయగల సామర్థ్యంపై కూడా ఇది మంచి ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మధ్యాహ్న నిద్ర ప్రభావం పిల్లల్లో బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా పొద్దున్నే లేచి బడికి వెళ్లే పిల్లలు.
టాపిక్