తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  A Day In Samantha's Life: సమంత జీవితంలో ఒక రోజు ఎలా ఉంటుంది? అందం, ఆరోగ్యం కోసం ఈ పనులు చేస్తుంది

A day in Samantha's life: సమంత జీవితంలో ఒక రోజు ఎలా ఉంటుంది? అందం, ఆరోగ్యం కోసం ఈ పనులు చేస్తుంది

13 September 2024, 10:30 IST

google News
  • A day in Samantha's life: సమంత తన జీవితంలో ఒక రోజు ఎలా ఉంటుందో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పంచుకుతంది. ఈ వీడియోలో తన చర్మం అంద రహస్యాలు, ఫిట్ నెస్ కోసం తను చేసే పనులను కూడా పంచుకుంది. 

ఒక రోజులో సమంత ఏం చేస్తుంది?
ఒక రోజులో సమంత ఏం చేస్తుంది? (Instagram/@samantharuthprabhuoffl)

ఒక రోజులో సమంత ఏం చేస్తుంది?

సమంత తన జీవితంలోని ఒక రోజు ఎలా ఉంటుందో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. చాలా చురుగ్గా ఉండే ఈ 36 ఏళ్ల ముద్దుగుమ్మ తన చర్మ, ఆరోగ్య రహస్యాలను పంచుకుంది. ఏ డే ఇన్ మై లైఫ్ అని వీడియో షేర్ చేసిన సమంత తన స్కిన్ కేర్ రొటీన్ నుంచి రోజూవారీ దినచర్య వరకు ఉదయం నుంచి రాత్రి దాకాం ఏమేం చేస్తుందో చూడండి.

సమంత రొటీన్:

సమంత ఉదయాన్నే సూర్యరశ్మిలో గడపడం ద్వారా తన రోజును ప్రారంభిస్తుంది.

సమంత స్కిన్ కేర్ కోసం ఏమేం చేస్తుందంటే..

ఆయిల్ పుల్లింగ్: సమంత తన మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కోసం ఆయిల్ పుల్లింగ్ చేస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడానికి నోటిలో నూనెను పుక్కలించినట్లు చేసే పురాతన పద్ధతి. ఈ పద్ధతి ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా చర్మం స్పష్టమైన, ప్రకాశవంతంగా ఉండేలా చూస్తుంది.

గువా షా: ఆయిల్ పుల్లింగ్ తర్వాత సమంత గువా షా టూల్ ను ఉపయోగిస్తుంది. ఈ సాంప్రదాయ చైనీస్ విధానం ముఖాన్ని మసాజ్ చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, ముఖంలో ఉబ్బు తగ్గించడానికి సాయపడుతుంది. దీన్ని మీరు కూడా కొనుక్కొని మీ స్కిన్ కేర్ రొటీన్ లో వాడుకోవచ్చు.

ఎల్ఈడీ ఐ మాస్క్: సమంత తన కంటి సంరక్షణ కోసం ఎల్ఈడీ ఐ మాస్క్ ఉపయోగిస్తుంది. ఈ మాస్క్ కాంతి-ఉద్గార డయోడ్లతో ఉంటుంది. కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మాన్ని లక్ష్యంగా చేసి నల్లటి వలయాలు, ఉబ్బు, సన్నని గీతలను కూడా తగ్గిస్తుంది.

ఐస్ వాటర్ డిప్: షూటింగ్ కు ముందు ముఖానికి సమంత ఐస్ వాటర్ డిప్ చేస్తుంది. అంటే ఒక వెడల్పాటి పాత్రలో ఐస్ వాటర్ వేసి అందులో ముఖం ఉంచడం. ఇది ముఖంలో ఉబ్బును తగ్గించడానికి, చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడానికి, రక్త ప్రసరణను పెంచడానికి సాయపడుతుంది. దాంతో చర్మం చాలా ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపిస్తుంది.

రెడ్ లైట్ థెరపీ: మధ్యాహ్నం పూట సమంత తన రెడ్ లైట్ థెరపీ సెషన్ కు వెళ్తుంది. దీంట్లో తక్కువ కాంతినిచ్చే ఎరుపు రంగు ఎల్‌ఈడీ లైట్లు వాడతారు. ఈ చికిత్స కొలాజెన్ పెంచడానికి, ముడతలను తగ్గించడానికి సాయపడుతుంది. చర్మం టోన్ మెరుగుపరుస్తుంది. దీనికోసం ఇది ఆరోగ్యకరమైన, మరింత యవ్వనమైన చర్మానికి సాయం చేస్తుంది.

సమంత వర్కవుట్ రొటీన్

జిమ్:

ఉదయాన్నే సమంత కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ తో కూడిన వ్యాయామం కోసం జిమ్ కు వెళ్తుంది. సమతుల్యమైన, సమర్థవంతమైన ఫిట్ నెస్ రొటీన్ ను ఫాలో అవుతుంది.

పికిల్ బాల్ సెషన్: సాయంత్రం పూట సమంత పికిల్ బాల్ ఆటను ఆస్వాదిస్తూ, సరదాతో పాటు ఫిట్‌నెస్ ను మిళితం చేసి తన రోజును ఉల్లాసంగా ముగిస్తుంది.

సమంత చివరగా కొన్ని నిమిషాల ధ్యానం చేసిన తర్వాత నిద్రకు సిద్ధమవుతుంది. ఇది సి

టాపిక్

తదుపరి వ్యాసం