తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eye Health: ప్రయాణాల్లో మీ కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు 8 టిప్స్

Eye health: ప్రయాణాల్లో మీ కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు 8 టిప్స్

HT Telugu Desk HT Telugu

19 June 2023, 9:43 IST

google News
    • ప్రయాణాల్లో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అవసరమైన 8 చిట్కాలు ఇక్కడ చదవండి. నేత్ర వైద్య నిపుణులు వీటిని అందించారు.
ప్రయాణాల్లో కంటి ఆరోగ్యానికి 8 చిట్కాలు
ప్రయాణాల్లో కంటి ఆరోగ్యానికి 8 చిట్కాలు (Vitalii Khodzinskyi on Unsplash)

ప్రయాణాల్లో కంటి ఆరోగ్యానికి 8 చిట్కాలు

కొత్త కొత్త గమ్యస్థానాలకు చేరుకోవడం ఉత్సాహభరితంగా ఉంటుంది. నగరాలు, బీచ్‌లు, పర్వత ప్రాంతాలు, లోయలు.. ఇలా ఒకటేమిటి పర్యాటక ప్రాంతాల్లో విహరించాలని ఎవరికి ఉండదు? అయితే ప్రయాణాల్లో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సుదీర్ఘ ప్రయాణాలు, విభిన్న వాతావరణాలు మన ఆరోగ్యాన్ని, ముఖ్యంగా కళ్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మీ సాహసోపేత యాత్రలు క్షేమంగా సాగాలంటే కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

ట్రావెలింగ్‌లో కంటి ఆరోగ్యానికి చిట్కాలు

ప్రయాణాల్లో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నీరజ్ సండూజ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో కొన్న చిట్కాలు పంచుకున్నారు.

  1. సన్ గ్లాసెస్: పర్యాటక ప్రాంతాల్లో దాదాపుగా మనం పగటి పూటే విహరిస్తాం. ఈ సమయంలో సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి, అలాగే దుమ్మూదూళి నుంచి కాపాడుకునేందుకు మనం తప్పనిసరిగా సన్ గ్లాసెస్ వాడాలి.
  2. డ్రాప్స్: ఒక్కోసారి దుమ్మూదూళికి, ఎండ వేడిమికి మన కళ్లు బాగా పొడిబారుతాయి. లేదా అలెర్జీకి గురవుతాయి. వీటికి సంబంధించి మీ వైద్యుడి సూచన మేరకు డ్రాప్స్, మెడిసిన్ ఏవైనా ఉంటే వెంట తీసుకెళ్లొచ్చు.
  3. స్విమ్మింగ్ గాగుల్స్: ఒకవేళ మీ షెడ్యూలులో బీచ్, స్విమ్మింగ్ పూల్స్ ఉంటే మీ వెంట గాగుల్స్ తీసుకెళ్లండి. సముద్రపు నీటిని ముఖ్యంగా క్లోరిన్, ఉప్పు లేదా చెత్త నుంచి మీ కళ్లకు రక్షణ లభిస్తుంది. కళ్లు చికాకుకు గురికాకుండా, ఎరుపెక్కకుండా ఇవి కాపాడుతాయి. నీటిలో ఎక్కువ సేపు ఉన్నప్పుడు మీ కళ్లకు వీటితో రక్షణ లభిస్తుంది.
  4. టోపీ ధరించాలి: సూర్య రశ్మి నుంచి తట్టుకునేందుకు కచ్చితంగా టోపీ ధరించాలి. లేదంటే మీ కళ్లకు శుక్లాలు పెరిగే ప్రమాదం ఉంది. కళ్లకు సూర్య రశ్మి సోకితే ఫోటోకెరాటిటిస్ అనే వడ దెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
  5. కాంటాక్ట్ లెన్స్ వాడొద్దు: సుదీర్ఘ ప్రయాణాలు ఉన్నప్పుడు, విమానాల్లో తిరిగేటప్పుడు కాంటాక్ట్ లెన్స్ వాడడం ఆపండి. కాంటాక్ట్ లెన్స్ తీసేయాల్సి వస్తే సొల్యూషన్ వాడడం మరిచిపోకండి. అత్యవసర పరిస్థితుల కోసం మీ వద్ద అదనంగా ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఉండేలా చూసుకోండి.
  6. డ్రైవింగ్ బ్రేక్స్: లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టయితే మీ కంటిపై ఒత్తిడి పడుతుంది. కళ్లకు విరామం అవసరం అవుతుంది. తరచూ బ్రేక్స్ తీసుకోండి. అలాగే డ్రైవింగ్‌లో అవసరాన్ని బట్టి సన్ గ్లాసెస్ వాడండి.
  7. ఐ మేకప్ మితం: కళ్లకు మేకప్ చేసుకునే వారు ప్రయాణాల్లో దానిని తగ్గించాలి. దుమ్మూదూళిని ఈ మేకప్ ఆకర్షిస్తుంది. తద్వారా కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఉంది.
  8. నీళ్లు తాగండి: శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరచుగా నీళ్లు తాగుతుండండి. ప్రయాణాల్లో నీరు తాగడం ఒక్కోసారి మరిచిపోతుంటాం. కాఫీ, టీలు తగ్గించి వెంట నీటి సీసా ఉండేలా చూసుకోండి.

తదుపరి వ్యాసం