తెలుగు న్యూస్ / ఫోటో /
ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందండం చాలా ఈజీ.. టెస్ట్ లేకుండానే లైసెన్స్!
- ఇక నుండి డ్రైవింగ్ లైసెన్స్ చిక్కులు తప్పనున్నాయి. లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్, పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కష్టాలు మాములుగా ఉండవు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనతో లైసెన్సుల జారీ విధానం సరళతరం కానుంది.

(1 / 5)
కొత్త నిబంధన ప్రకారం ఇంట్లో కూర్చొని ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాలను సంబంధించిన లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1, 2022 నుండి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. దీని ప్రకారం, గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ పొందిన తర్వాత వారు జారీ చేసే సర్టిఫికెట్ కాపీతో పాటు ఇతర గుర్తింపు కార్డులను జతచేసి రవాణా శాఖకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు.
(2 / 5)
రోడ్లు, రవాణా శాఖ నిబంధనల ప్రకారం, మీరు రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్ర పరీక్షలో ఉత్తీర్ణులై, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు మీరు RTO వద్ద డ్రైవింగ్ పరీక్షను తీసుకోవలసిన అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ప్రైవేట్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్ సర్టిఫికెట్ సరిపోతుంది.
(3 / 5)
అదే విధంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ పేరుతో విడుదల చేసిన నోటిఫికేషన్ వీటికి సంబంధించి రూల్స్ స్పష్టంగా పేర్కొంది.
(4 / 5)
లైసెన్స్ పొందడంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల పాత్ర కీలకం కానుండటంతో.. వాటి గుర్తింపు నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది.
ఇతర గ్యాలరీలు