Pulses for diabetics: డయాబెటిస్ ఉంటే పప్పు ఎందుకో తినాలో తెలిపే 6 కారణాలు ఇవే
06 April 2023, 11:15 IST
- Pulses for diabetics: డయాబెటిస్ ఉంటే పప్పు ఎందుకో తినాలో తెలిపే 6 కారణాలు ఇక్కడ చూడండి. ప్రపంచ పప్పుల దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక కథనం.
డయాబెటిస్ ఉన్న వారు పప్పులు తప్పక తినాలంటున్న పోషకాహార నిపుణులు
డయాబెటిస్ ఉన్నప్పుడు మీ సంపూర్ణ ఆరోగ్యానికి పప్పులు ఉత్తమ ఆహాారంగా పరిగణించాలి. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన పిండి పదార్థాల వంటి కలయిక వల్ల ఇవి శాఖాహారులకు ఉత్తమ పోహక ఆహారంగా నిలిచాయి. మధుమేహం ఉన్న వారికి కూడా ఇవి సూపర్‌ఫుడ్‌గా ప్రాచుర్యం పొందాయి. గ్లూకోజు నియంత్రణలో పప్పుల వినియోగం చాలా కీలకమని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. బరువును అదుపులో పెట్టుకునేందుకు, లిపిడ్స్ నియంత్రణలో ఉండేందుకు ఇది మేలైన ఆహారం. క్రమం తప్పకుండా పప్పుల వినియోగం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఈ ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పుల దినం అయినందున ఈ ఆహారం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘పట్టణవాసులు ఎక్కువగా రోజంతా కూర్చుని తమ విధులు నిర్వర్తిస్తుంటారు. ఇన్సులిన్ నిరోధకత సమస్యలు ఏర్పడుతుంటాయి. అయితే భారతీయ వంటకాలంటే పప్పులు లేకుండా ఉండవు. ఇవి ఇక్కడి ఆరోగ్య అవసరాలను తీర్చుతాయి. అలాగే పర్యావరణ హితమైన ప్రోటీన్ అందిస్తుంది..’ అని డయాబెటిస్ ఎడ్యుకేటర్, న్యూట్రిషనిస్ట్ ఖుష్బూ జైన్ టైబర్‌వాలా వివరించారు.
రక్తంలో అధిక చక్కెర కారణంగా డయాబెటిస్ (టైప్ 2) వస్తుంది. పిండి పదార్థాలకు సంబంధించిన జీవక్రియలో వైఫల్యం ఏర్పడడమే ఇందుకు కారణం. అయితే దీనికి పరిష్కారం శరీరంలోని కొవ్వులను తగ్గించడం, కార్బోహైడ్రేట్ జీవక్రియకు అనుకూలంగా మార్చుకోవడమే. ఇందుకు పప్పుధాన్యాలు ఉత్తమ ఆహారం..’ అని వివరించారు.
Health benefits of pulses for people with diabetes: డయాబెటిస్ ఉన్న వారికి పప్పులతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..
పప్పులతో కూడిన ఆహారాన్ని డయాబెటిస్ పేషెంట్లు ఎందుకు తీసుకోవాలో 6 కారణాలను టైబర్‌వాలా వివరించారు.
- అధిక పోషకాలతో కూడిన ఆహారం: పప్పుల్లో ప్రొటీన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, బీ విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
- డైటరీ ఫైబర్: భోజనానంతరం వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోకుండా పప్పుల్లో ఉండే ఫైబర్ కాపాడుతుంది.
- స్టార్చ్ నిల్వలు తగ్గుతాయి: ఉడికించిన పప్పుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను మెరుగుపరుస్తుంది. తద్వారా ఇన్సులిన్ విధి నిర్వహణకు ఉపయోగపడుతుంది.
- ప్రోటీన్ కలిగిన ఆహారం: ఒక కప్పు పప్పు 12 నుంచి 15 గ్రాముల ప్రోటీన్ ఇస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు కండరాల ఆరోగ్యానికి ప్రోటీన్ తప్సనిసరి. రోజూ చురుగ్గా వ్యాయామంతో పాటు ప్రోటీన్ లభిస్తే కండరాలకు బలం.
- హెచ్‌బీఏ1సీ తగ్గుతుంది: పప్పులు తినడం వల్ల డయాబెటిస్‌లో కీలక కొలమానం అయిన హెచ్‌బీఏ1సీ తగ్గుతుందని పలు అధ్యయనాలు చూపాయి. అలాగే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ కూడా తగ్గుతాయని అధ్యయనాలు తెలిపాయి.
- ఆంథోసైనిన్స్: పప్పుల్లో ఆంథోసైనిన్స్ అనే యాంటిఆక్సిడంట్ల కారణంగా అవి విభిన్న రంగుల్లో ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, దీర్ఘకాలిక డయాబెటిస్ దుష్ప్రభవాలు, క్యాన్సర్ల నుంచి రక్షణగా నిలుస్తాయి.
పప్పులు తినేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి..
- పప్పులు, చిక్కుళ్లు జీర్ణం కావడం కష్టం. మీరు వాటిని వండే ముందు నానబెట్టాలి.
- జీర్ణక్రియను మెరుగుపరచడానికి జీలకర్ర, అల్లం, ఉంగరం, కొత్తిమీర ఆకులు మొదలైన ఆహారాలను ఎల్లప్పుడూ చేర్చాలి.
- గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించడానికి శనగలు, రాజ్మా వంటి స్టార్చ్ ఉన్న వాటిని 5-6 గంటల ముందు ఉడకబెట్టి చల్లబరచాలి.