తెలుగు న్యూస్  /  ఫోటో  /  Menstrual Disorders: భరించలేని నొప్పా .. కారణాలు ఇవే కావచ్చు!

Menstrual Disorders: భరించలేని నొప్పా .. కారణాలు ఇవే కావచ్చు!

26 April 2022, 15:25 IST

స్త్రీకి నెలసరి ఒక్కో అగ్నిపరీక్ష. 12 నుండి 15 సంవత్సరాల వయస్సులో నుండి పీరియడ్స్ ప్రారంభమవుతాయి. నెలసరి సమయంలో కొందరికి  కడుపునొప్పి వాంతులు, రక్త స్రావం వంటి తీవ్రమైన సమస్యలు రుతుస్రావ సమయంలో ఇబ్బంది పెడతాయి. పీరియడ్స్ సమయంలో ఇబ్బందులు కలగడానికి దైనందిన జీవితంలో కొన్ని అలవాట్లు కారణం కావచ్చు. ఆ పనులెంటో ఇప్పుడు చూద్దాం.

  • స్త్రీకి నెలసరి ఒక్కో అగ్నిపరీక్ష. 12 నుండి 15 సంవత్సరాల వయస్సులో నుండి పీరియడ్స్ ప్రారంభమవుతాయి. నెలసరి సమయంలో కొందరికి  కడుపునొప్పి వాంతులు, రక్త స్రావం వంటి తీవ్రమైన సమస్యలు రుతుస్రావ సమయంలో ఇబ్బంది పెడతాయి. పీరియడ్స్ సమయంలో ఇబ్బందులు కలగడానికి దైనందిన జీవితంలో కొన్ని అలవాట్లు కారణం కావచ్చు. ఆ పనులెంటో ఇప్పుడు చూద్దాం.
1.  వ్యాయామం: ఎక్కువ వ్యాయామం మీ ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది. తీవ్రమైన వ్యాయామ దినచర్య వల్ల పీరియడ్స్‌ క్రమరహితంగా మారుతాయి. అధిక వ్యాయామం చేయడం వల్ల అంతర్గత అవయవాలపై తీవ్రమైన ఓత్తిడి పడుతుంది.. దీని ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు కారణమవుతుంది
(1 / 6)

2. ఒత్తిడి:  మీరు ఒత్తిడికి గురైతే, అది మీ పీరియడ్స్‌పై ప్రభావం చూపుతుంది.  ఒత్తిడి వల్ల శరీరంలోని అవయవాలపై ప్రభావం పడి పీరియడ్స్‌ ఆలస్యానికి కారణమవుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు మెదడు తన సహాజ చర్యను కోల్పోతుంది. దీంతో అండోత్సర్గము వంటి విధులను నిలిపివేస్తుంది. ఈ సమయంలో తేలికైన లేదా లేట్ పీరియడ్స్‌కు కారణం కావచ్చు.
(2 / 6)

3. అధిక బరువు ఉండటం:  అధిక బరువు వల్ల ఋతు చక్రంలో తేడాలు వస్తాయి . పెరిగిన కొవ్వు కణాలతో హార్మోన్ ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. ఇది అండోత్పత్తిని ఆపివేస్తుంది. అండాశయాల ద్వారా ఎగ్స్ విడుదల కానప్పటికీ, గర్భాశయం లైనింగ్ గట్టిపడడానికి కారణమవుతుంది. దీని వల్ల పీరియడ్స్ వచ్చినప్పుడు భారీ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్న మహిళలు పీరియడ్స్‌ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు
(3 / 6)

4. వ్యాధులు:అనారోగ్య సమయంలో శరీరం ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రమరహితమైన రుతు స్త్రావానికి కారణమవుతుంది. అలాగే హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటే, ఎక్కువ తిమ్మిర్లు అధిక రక్త ప్రవాహం వంటి అనేక సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమస్యలు వస్తాయి. కావున ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి.
(4 / 6)

5. ఆల్కహాల్:అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ సరిగా రాకపోవచ్చు. ఆల్కహాల్ ఫోలికల్స్, అండోత్సర్గము ప్రక్రియను నిరోధించే ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో పీరియడ్స్‌ సరిగ్గా రావు.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి