Less Sleep Side Effects : ఈ సంకేతాలకు అర్థం అదే.. జాగ్రత్తగా లేకపోతే ఆరోగ్యం బిస్కెట్ అవుతుంది..
09 July 2022, 6:55 IST
- Less Sleep Side Effects : ప్రతి మనిషి నిద్రకు కచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇది శరీరంలోని అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. సరైన నిద్రలేకుంటే ఆ రోజు మీకు సరిగా ఉండదు. పైగా ఆరోగ్యానికి కూడా చాలా సమస్యలు వస్తాయి. అయితే నిద్ర సరిపోకపోతే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ సంకేతాలేమిటో చుద్దామా?
నిద్రలేమి సంకేతాలు
Less Sleep Side Effects : ప్రతి ఉదయాన్నే నిద్రలేవడం కష్టంగా ఉందా? రోజంతా నిద్రమత్తులో ఉన్నట్లు అనిపిస్తుందా? దేని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారా? దీని అర్థం మీకు నిద్ర సరిపోవట్లేదని. సరైన నిద్ర లేకపోతే కలిగే నష్టాలు అందరికీ తెలుసు. కానీ దీనివల్ల మనం కొన్ని వ్యసనాలకు బానిసవుతామని మీకు తెలుసా? అరె మేము బాగానే పడుకున్నాము మాకు నిద్ర ఎందుకు సరిపోలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని సంకేతాలు మీకు నిద్ర సరిపోలేదు అని చెప్పేందుకు ఉదాహరణలు. మీకు ఎక్కువ నిద్ర సమయం అవసరమని తెలిపే కొన్ని సంకేతాలు ఇక్కడ ఉన్నాయి.
మేము సరైన సమయానికే పడుకుంటున్నామే.. మరి మాకు నిద్ర ఎందుకు సరిపోదు అనే అపరాధ భావనలో ఉన్నారా? అయితే మీకు నిద్ర గురించి తెలియకపోయినా.. మీ శరీరానికి తెలుస్తుంది. దానికి ఏమి అవసరమో సంకేతాల రూపంలో చూపిస్తుందని మనస్తత్వవేత్త డాక్టర్ జెన్ ఆండర్స్.. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. నిద్ర సరిపోకపోతే శరీరం చూపించే సంకేతాల గురించి ఆయన వివరించారు.
నిద్ర సరిపోలేదు అనడానికి సంకేతాలు..
* మీరు ఏదైనా సీరియస్ విషయంపై దృష్టి పెట్టడం ఇబ్బంది అవుతుంది. ఎంత కష్టపడుతున్నా ఏకాగ్రత రాదు. ఏ పనిమీద దృష్టి సారించలేకపోవడం.
* మీరు అది ఇది లేకుండా అన్ని తింటూ ఉన్నారా? నిరంతరం చిరుతిండి లేదా అనారోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటే.. దాని అర్థం మీకు సరైన నిద్రలేదని. మీ దినచర్యకు మరింత నిద్రను జోడించాల్సిన అవసరం ఉందనడానికి ఇది సంకేతం.
* ఎల్లప్పుడూ డీహైడ్రేషన్‌తో ఉంటారు. ఇది నిద్ర లేమికి మరొక సంకేతం.
* తెలియకుండానే కెఫిన్‌పై ఎక్కువ ఆధారపడతారు. తర్వాత దానిని కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకంటే నిద్రమత్తు అనిపించినప్పుడు చాలా మంది కాఫీని తాగుతారు. రాత్రి సరైన నిద్రలేకపోతే ఉదయం ఎక్కువగా కాఫీ తాగుతారు. ఇలా ఇదొక వ్యసనం అయిపోతుంది.
* ప్రతిరోజూ విశ్రాంతి తీసుకోవడానికి మీకు మద్యం అవసరం. చాలా మంది నిద్రపోవడానికి మద్యాన్ని ఆశ్రయిస్తారు. ఎందుకంటే మద్యం వల్ల తెలియకుండా త్వరగా నిద్రపోతామని.. ఆలోచనలు ఏమి రావని భావిస్తారు.
మీరు కూడా ఇలాంటి సంకేతాలను గమనిస్తే.. వెంటనే సరైన నిద్రకు ప్లాన్ చేసుకోండి. తెలియకుండా చేసే ఈ పనులు క్రమంగా వ్యసనాలుగా మారిపోతాయి. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.
టాపిక్