తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleep Position: పడుకునే విధానాన్ని బట్టీ వారి మనస్తత్వాన్ని చెప్పొచ్చు!

Sleep Position: పడుకునే విధానాన్ని బట్టీ వారి మనస్తత్వాన్ని చెప్పొచ్చు!

HT Telugu Desk HT Telugu

06 June 2022, 16:58 IST

google News
    • వ్యక్తుల మనస్తత్వాన్ని తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అధ్యయనలలో పడుకునే విధానాన్ని బట్టీ వారి మనస్తత్వం ఉంటుందని తేలింది.
Sleep Position
Sleep Position

Sleep Position

రోజంతా వివిధ పనుల్లో బిజీ బజీగా గడిపిన తర్వాత చాలా మంది ఎదురుచూసేది మంచి నిద్ర.  స్లీప్ సమయంలో అందరిది ఓకే పొజిషన్‌‌లో ఉండదు. అయితే స్లీపింగ్ పొజిషన్‌ బట్టి మనషి అంతర్గత స్వభావం గురించి చాలా విషయాలు తెలుకోవచ్చని నిపుణులు అంటున్నారు. స్లీపింగ్ ప్యాటర్న్‌లు మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా తెలియజేస్తాయో తెలుసుకుందాం.

1.వీపు వైపు పడుకోవడం: వెనుకభాగం వైపు తిరగి నిద్రిస్తే, తిరిగి ఫుల్ రీఛార్జ్‌తో మేల్కొనే అవకాశం ఉంది. మీ దృష్టి కేంద్రికృతంగా ఉండటానికి ఇష్టపడతారు. సారూప్యత గల వ్యక్తుల సహవాసాన్ని ఇష్టపడతారు. బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీపై అధిక అంచనాలను కలిగి ఉంటారు. సమయపాలన పాటిస్తారు. లక్ష్యాలను సాధించడానికి నిశితంగా పని చేస్తారు.

2.Stomach Sleepers: పొట్టపైకి ఉంచి వెన్నెముకను బెడ్‌ వైపుగా ఉండి నిద్రపోయేవారు తమ గురించి ఆలోచించుకుంటూ ఇతరుల గురించి కూడా ఆలోచిస్తారు. త్వరగానే నిద్రలేవడం త్వరగా నిద్ర పోవడం వీరికి అలవాటుగా ఉంటుంది. వీరు దేనినైనా తేలిగ్గా తీసుకునే రకం. అందువల్ల వాళ్లతో స్నేహం చేయవచ్చని మానసిక వేత్తలు చెబుతున్నారు.

3. Side Sleepers: పక్కకు తిరిగి పడుకునేవారు రాత్రి పూట తొందరగా నిద్ర రాదు. ఈవెంట్లలలో ఎక్కువగా పాల్గొనడం చేస్తారంట.. బయటకు ఒకటి లోపల ఒకటి మాట్లాడకుండా పూర్తి ఓపెన్‌గా ఉంటారంట. ఇతరులకు నమ్మకం కలిగే కలిగి ఉంటారు. రాత్రి పూట నిద్ర పోవడానికి టైమ్ పడుతుంది. వీరికి స్నేహం చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది.

4. Right, Left Side Sleepers: ఎడమవైపు తిరిగి పడుకునేవారు మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ రంగంలో బాగా రాణిస్తారు. చదువులలో కూడా ఫస్ట్‌గా ఉంటారు. ఇక కుడివైపు తిరిగి పడుకునేవారికి స్మోకింగ్ అలవాటు ఉండే ఛాన్స్ ఎక్కువ. టీ,కాఫీలు కూడా బాగా తాగుతారట. ట్రాన్స్‌పోర్టేషన్, మాన్యుఫాక్చరింగ్ రంగాలలో ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.

తదుపరి వ్యాసం