తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Scratchy Throat : గొంతు నొప్పి, జలుబు, దగ్గును దూరం చేసే పానీయాలు ఇవే..

Scratchy Throat : గొంతు నొప్పి, జలుబు, దగ్గును దూరం చేసే పానీయాలు ఇవే..

22 October 2022, 19:45 IST

google News
    • Relief from Scratchy Throat : సీజన్ మారుతున్న సమయంలో గొంతునొప్పి, దగ్గు, జలుబు చేయడం సహజం. అయితే అంతే సహజంగా ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు. కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిప్పరమింట్ టీ
పిప్పరమింట్ టీ

పిప్పరమింట్ టీ

Relief from Scratchy Throat : శీతాకాలం వస్తుందంటే చాలు.. జలుబు, దగ్గు జంటపక్షుల్లా వచ్చేస్తాయి. అంతేనా గొంతునొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ గొంతునొప్పి ఓ రకమైన చికాకును కలిగిస్తుంది. తాగడం, తినడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు వైద్యులు ఇచ్చే సలహాలతోపాటు.. కొన్ని డ్రింక్స్ తాగిస్తే.. ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుని.. మీరు కూడా సమస్యను దూరం చేసుకోండి.

అల్లం టీ

యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన అల్లం టీ గొంతు నొప్పిని తగ్గిస్తుంది. తాజా అల్లాన్ని వేడి నీటిలో తీసుకుని.. మరింగించి తాగాలి. చిన్న పిల్లలపై ప్రభావితం చేసే శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ నుంచి కూడా ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. వేడినీటిలో తురిమిన అల్లం వేసి మరిగించాలి. టీని వడకట్టి రుచి కోసం కొద్దిగా తేనె వేసుకుని వేడిగా తాగేయండి.

పసుపు పాలు

అనేక ఔషధ ప్రయోజనాలతో నిండిన పసుపు పాలు గొంతులో ఇన్ఫెక్షన్‌ను నయం చేస్తుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దాని సహజ క్రిమినాశక లక్షణాలు నిరంతర జలుబుకు చికిత్స చేయడంలో, దగ్గు నుంచి వేగంగా కోలుకోవడంలో కూడా సహాయం చేస్తుంది. పాలల్లో పసుపు, మిరియాలు వేసి కాసేపు మరిగించాలి. పాలను వడకట్టి.. దానిలో తేనె వేసి తాగేయండి.

నిమ్మ, తేనెతో

వేడి నీరు గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం నుంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మ, తేనెతో కలిపిన వేడి నీటిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి సహాయపడుతుంది. తేనె యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

పిప్పరమింట్ టీ

పిప్పరమెంటు టీ గొంతు నొప్పిని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైనది. పిప్పరమింట్‌లో స్పియర్‌మింట్ ఉంటుంది. ఇది గొంతులో వాపు, మంట నుంచి ఉపశమనం ఇస్తుంది. పిప్పరమెంటు టీ ఆవిరిని పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ సమస్య కూడా నయం అవుతుంది.

తదుపరి వ్యాసం