తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods To Avoid In Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే..

Foods to Avoid in Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే..

20 December 2022, 15:36 IST

    • Foods to Avoid in Pregnancy : మనం ఆరోగ్యంగా ఉండాలన్నా.. బరువు తగ్గాలన్నా.. ఫిట్​గా ఉండాలన్నా.. ఇది ఏది చేసినా అది ఫుడ్​పై ఆధారపడి ఉంటుంది. కొన్ని సమస్యలు తగ్గించుకోవాలంటే కొన్ని ఫుడ్స్ తినకూడదు అంటారు. అలాగే గర్భాధారణ సమయంలో కూడా కొన్ని ఫుడ్స్ తినకూడదు అంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
గర్భధారణ సమయంలో ఇవి తినకండి..
గర్భధారణ సమయంలో ఇవి తినకండి..

గర్భధారణ సమయంలో ఇవి తినకండి..

Foods to Avoid in Pregnancy : గర్భధారణ సమయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా.. అది పిండం పెరుగుదల, అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తీసుకోబోయే ఆహారం.. శిశువు ఆరోగ్యం విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

పిండం ఆరోగ్యంగా పెరగాలన్నా.. మంచిగా అభివృద్ధి చెందాలన్నా.. కాబోయే తల్లులు విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుపచ్చని ఆకుకూరలు, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే కొన్ని ఆహారాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాశ్చరైజ్ చేయని పాలు.. చీజ్, పండ్ల రసం

లిస్టెరియా, క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, ఇ. కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియాతో నిండిన… పాశ్చరైజ్ చేయని పచ్చి పాలు తీసుకోవడాన్ని గర్భధారణ సమయంలో పూర్తిగా నిషేదించారు. మెత్తగా పండిన చీజ్‌లు, నిల్వ చేసిన పండ్లరసం కూడా తీసుకోకూడదు అంటారు.

బాక్టీరియా సహజంగా లేదా నిల్వ లేదా సేకరణ సమయంలో కాలుష్యం కారణంగా సంభవించవచ్చు. అదేవిధంగా పాశ్చరైజ్ చేయని పాలు, పండ్ల రసాలు బ్యాక్టీరియా కలుషితానికి దారితీయవచ్చు. ఇది పుట్టబోయే బిడ్డపై ప్రాణాంతక ప్రభావాన్ని చూపుతుంది. బదులుగా, పాశ్చరైజ్డ్ పాలు, చీజ్, పండ్ల రసాలు తీసుకోవచ్చు.

కెఫిన్

మీరు కాఫీ ప్రియులైతే.. మీ గర్భధారణ సమయంలో మీరు కచ్చితంగా దానిని తీసుకోవడం తగ్గించండి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ప్రకారం.. గర్భిణీ స్త్రీలు తమ కెఫిన్ తీసుకోవడం రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే తక్కువగా పరిమితం చేయాలని సూచించారు.

కెఫిన్ పిండానికి రక్త సరఫరాను తగ్గిస్తుంది. ఇది పిండం ఎదుగుదలను పరిమితం చేస్తుంది. ఈ కారణంగా మీ బిడ్డ తక్కువ బరువుతో పుట్టవచ్చు.

పచ్చి లేదా పండని బొప్పాయి

పండిన బొప్పాయి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. గర్భధారణ సమయంలో అది పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. అయితే పండని లేదా పచ్చి బొప్పాయి ఈ కాలంలో హానికరం. ఎందుకంటే ఇది అబార్షన్‌ను ప్రేరేపిస్తుంది.

పండని లేదా పచ్చి బొప్పాయిలో లాటెక్స్, పాపైన్ వంటి హానికరమైన రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి గర్భాశయ సంకోచాలను కలిగిస్తాయి. పిండం పెరుగుదలను నిరోధిస్తాయి. ఇది ముందస్తు ప్రసవానికి లేదా గర్భస్రావాలకు కూడా ప్రేరేపిస్తుంది.

పచ్చి గుడ్లు

పచ్చి లేదా పాక్షికంగా వండిన గుడ్లలో సాల్మొనెల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జ్వరం, కడుపు తిమ్మిరి, వాంతులు, వికారం, విరేచనాలకు కారణమవుతుంది. ఇది గర్భస్రావాలను రేకెత్తించే గర్భాశయ ఇన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది.

ఇది ప్రసవ లేదా అకాల పుట్టుకకు దారితీసే గర్భాశయ తిమ్మిరికి కూడా కారణం కావచ్చు. అందువల్ల, పాశ్చరైజ్డ్ గుడ్లను ఉపయోగించాలని నిర్ధారించుకోండి. గుడ్లను తినడానికి ముందు వాటిని బాగా ఉడికించాలి.

అధిక పాదరసం కలిగిన చేపలు

సాధారణంగా కలుషితమైన నీటిలో కనిపించే పాదరసం అత్యంత విషపూరిత మూలకం. ఇది తరచుగా పెద్ద సముద్ర చేపల లోపల పేరుకుపోతుంది. గర్భిణీ స్త్రీలు అటువంటి చేపలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది రోగనిరోధక వ్యవస్థ, మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా పిండం అభివృద్ధిపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.

అధిక-పాదరస చేపలలో ట్యూనా, మార్లిన్, కింగ్ మాకెరెల్, స్వోర్డ్ ఫిష్ మొదలైనవి ఉన్నాయి. బదులుగా సాల్మన్, టిలాపియా, ట్రౌట్, ఫ్లౌండర్ మొదలైన తక్కువ-మెర్క్యూరీ చేపలను తినవచ్చు.

తదుపరి వ్యాసం