NNS 3rd June Episode: భాగీని పొడిచేసిన బాబ్జి.. మనోహరికి అరుంధతి వార్నింగ్.. బయటపడిన మనోహరి నిజస్వరూపం!
03 June 2024, 11:07 IST
- NNS 3rd June Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (జూన్ 3) ఎపిసోడ్లో భాగీని బాబ్జి పొడిచేస్తాడు. మరోవైపు మనోహరికి అరుంధతి వార్నింగ్ ఇస్తుంది.
భాగీని పొడిచేసిన బాబ్జి.. మనోహరికి అరుంధతి వార్నింగ్.. బయటపడిన మనోహరి నిజస్వరూపం!
NNS 3rd June Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (జూన్ 3) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తనకు తెలియకుండా జరిగిన పెళ్లిని దాటి ఆలోచించి పిల్లలు తనను ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని మిస్సమ్మ రాథోడ్‌తో బాధగా చెప్తుంది. అమ్ము ఎందుకు మిస్సమ్మను సపోర్ట్ చేసిందో అర్థంకాక పిల్లలు అందరూ మీటింగ్ పెట్టుకుంటారు.
అమ్ము లోపలికి వచ్చిన అరుంధతి పిల్లలకు మిస్సమ్మ చాలా మంచిది అని చెప్తుంది. దీంతో మిగతా పిల్లలు నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అంటూ ప్రశ్నిస్తారు. దీంతో ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి అని చెప్పి బయటకు వెళ్లిపోతుంది. దీంతో అంజు, అమ్ము ఎందుకు ఇలా మాట్లాడుతుందో నేను తనని ఫాలో అయి తెలుసుకుంటాను అని చెప్తుంది.
పోలీస్ స్టేషన్‌కు అమర్
బాబ్జీని సీసీటీవీలో చూశానని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో అమర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. గౌతమ్ వాడు అక్కడి నుంచి మూవ్ అయ్యాడా? ఎవరినైనా కలిశాడా? ఫోన్స్ ఏమైనా మాట్లాడాడా? అసలు అక్కడి ఎలా వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతాడు. ఎక్కడికి మూవ్ అవ్వలేదు సార్ ఒకటి రెండు కాల్స్ మాట్లాడాడు అంతే ఎవ్వరూ రాలేదు ఎవ్వరినీ కలవలేదు సార్ అని పోలీస్ చెప్పగానే సీసీ కెమెరాలో బాబ్జీని చూసి అమర్ కోపంగా ఫీలవుతాడు. నీ వెనక ఉండి నడిపిస్తుంది ఎవరో నాకు తెలియాలి. ఆరును చంపాల్సిన అవసరం ఎవరికుందో నేను తెలుసుకుంటాను అని మనసులో అనుకుంటాడు.
మనోహరి అమ్ము మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. బాబ్జికి ఫోన్ చేస్తుంది. ఇవాళే మిస్సమ్మను చంపాలని చెప్తుంది. మనోహరి, బాబ్జితో మాట్లాడిన మాటలు పోలీసులు అబ్జర్వ్ చేస్తుంటారు. వాడు ఎక్కడికి వెళ్లేది నాకు చెప్పండి అంటూ అమర్ వెళ్లిపోతాడు. మరోవైపు మిస్సమ్మ అత్తామామలతో కలిసి గుడికి వెళ్లబోతుంటే.. మనోహరి వచ్చి మిస్సమ్మ ఒక్కతే గుడికి వెళ్లేలా చేస్తుంది.
గుడికి ఒంటరిగా మిస్సమ్మ
ఏంటి మను నేను వెళ్తుంటే అంత ఆనంద పడుతున్నావు. ఇందాక నుంచి ఒక లాజిక్ అర్థం కావడం లేదు మను. గుడికి వెళ్తే మా కాపురానికి మంచిది కానీ నువ్వేంటి దగ్గరుండి పంపుతున్నావు. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అంటుంది మిస్సమ్మ. నేను ప్లాన్ చేస్తే ఇలా డౌట్ రాదు ఓన్లీ రిజల్ట్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు నీ మీద గెలిచినా నాకు మజా రాదు అంటుంది మనోహరి.
ఏం డైలాగ్ చెప్పావు మను ఎంత ముద్దొస్తున్నావు తెలుసా? అయినా ఈ క్రిమినల్ బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందా? నేను గుడికి వెళ్లి వస్తా.. అంటూ చెప్పి మిస్సమ్మ వెళ్లిపోతుంది. వెళ్లవే నీ చావు నీకు దగ్గరలోనే ఉందని అనుకుంటుంది మనోహరి.
మిస్సమ్మను పొడవబోయిన బాబ్జీ
సీసీటీవిలో చూస్తూ బాబ్జీ ఎక్కడికి వెళ్లేది పోలీసులు అమర్‌కు చెప్తుంటారు. మనోహరి బాబ్జికి ఫోన్ చేసి మిస్సమ్మ ఇంటి నుంచి బయలుదేరిందని చెప్తుంది. మరోవైపు పోలీసులు అమర్‌కు బాబ్జీ రోడ్ నెంబర్ త్రీకి వెళ్లాడని చెప్పగానే అది మా ఇల్లు ఉండే ఏరియా అని షాక్ అవుతాడు అమర్. వెంటనే రాథోడ్‌కు ఫోన్ చేస్తాడు.
అమ్ము, మనోహరి వైపు కోపంగా చూస్తూ వార్నింగ్ ఇస్తుంది. అమ్మూ నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటుంది మనోహరి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడలేదనుకుందట.
అలా నువ్వు కూడా నీ తప్పులు ఎవరికి తెలియవు నీ ప్లాన్స్ ఎవరికీ అర్థం కావు అనుకున్నావా మనోహరి అంటుంది అమ్ము. నువ్వు ఏం మాట్లాడుతున్నావో.. అని మనోహరి అనగానే కోపంగా నటించకు నా దగ్గర నటించకు మనోహరి అంటుంది అమ్ము. మా అమ్మను చంపించింది నువ్వేనని మా నాన్నకు చెప్తాను. నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను అంటూ అమ్ము లోపల ఉన్న అరుంధతి వార్నింగ్ ఇస్తుంది. దూరం నుంచి చూస్తున్న అంజు భయంగా ఆనంద్, ఆకాష్ లను తీసుకోస్తానని లోపలికి వెళ్తుంది.
మిస్సమ్మ గేటు తెరుచుకుని బయటకు రాగానే బాబ్జీ మిస్సమ్మను చంపేందుకు ఫాలో అవుతుంటాడు. మిస్సమ్మ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగానే బాబ్జీ మిస్సమ్మ ముందుకు వెళ్లి కత్తితో పోడవబోతాడు. భాగీకి కత్తిపోటు తగులుతుందా? భాగీని అమర్ కాపాడతాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జూన్ 03న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్