NNS 28th October Episode: ఘోరా చెప్పినట్టు చేసిన ఆరు ఆత్మ.. భాగీ కోసం అమర్, పిల్లలు దీక్ష.. మనోహరి షాక్!
28 October 2024, 13:55 IST
- NNS 28th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్లో ఆరు ఆత్మ ఘోర చెప్పినట్లు వింటుంది. అటు భాగీ కోసం పిల్లలు, అమర్ కూడా దీక్ష చేస్తుండగా.. వాళ్లను చూసి మనోహరి షాక్ తింటుంది.
ఘోరా చెప్పినట్టు చేసిన ఆరు ఆత్మ.. భాగీ కోసం అమర్, పిల్లలు దీక్ష.. మనోహరి షాక్!
NNS 28th October Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (అక్టోబర్ 28) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఘోర దగ్గరకు వెళ్లి భాగీ దీక్ష చేస్తుందని చెప్తుంది మనోహరి. నువ్వే ఎలాగైనా దాన్ని ఇంట్లోంచి పంపించేయాలి అని అడుగుతుంది. అందుకు కొంచెం టైం పడుతుంది అని ఘోర చెప్పగానే నేను నిన్ను నమ్ముకుని నా టైం వేస్ట్ చేసుకున్నాను. నీకు సాయం చేసి నువ్వు నాకు సాయం చేస్తావని నేను చాలా తప్పు చేశాను. ఇక నీకు నాకు ఏ సంబధం లేదు అని మనోహరి వెళ్లిపోతుంటే.. ఘోర ఆపుతాడు.
ఘోర చెప్పినట్లు విన్న అరుంధతి ఆత్మ
మనోహరి నేను చెప్పేది విను అంటాడు. విని మోసపోయింది చాలు ఘోర. తప్పుకో నేను వెళ్లాలి. శక్తులు రావడం.. కోరుకున్నది జరగడం అన్నీ మాటలు మాత్రమే.. అంటుంది మనోహరి. కాదని నిరూపిస్తే.. నీ కర్తవ్యం నీవు నిర్వహిస్తావా? అంటాడు ఘోర. ముందు నిరూపించు. ఆ తర్వాత నేను నిర్వర్తిస్తా.. అని మనోహరి చెప్పగానే ఘోర సీసా తీసి మంత్రం చదివి ఎదురుగా వస్తున్న మహిళలోకి వెళ్లి ఆ స్త్రీని ఆవహించు అని సీసా మూత తీయగానే ఆరు ఆత్మ వెళ్లి ఆ ముసలామెను ఆవహిస్తుంది.
వస్తున్న ఆ కారుకు ఎదురుగా పరుగెత్తు అని చెప్పగానే కారుకు ఎదురు పరుగెడుతుంది ఆ మహిళ. మనోహరి షాక్ అవుతుంది. చూశావు కదా మనోహరి నా మాట నా మంత్రం. ఏదీ అబద్దం కాదు. ఇలాంటి మనోహన్నతమైన పనులు చేయాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ కావాలి అంటాడు ఘోర. సరే ఇందాక ఏదో సాయం అన్నావు. ఏం కావాలి అని అడుగుతుంది మనోహరి. ఆ అమ్మాయి దీక్ష విరమించేలా చేయాలి. మానవుడికి మాధవుడు తోడైతే అప్పుడు ఇక మన కష్టం అంతా వృథా అవుతుంది అని ఘోరా చెప్పగానే ఆ దీక్ష మధ్యలోనే ఆగిపోయేలా చేస్తానని వెళ్లిపోతుంది మనోహరి.
భాగీ కోసం పిల్లల దీక్ష
భాగీ చేస్తున్న దీక్ష పూర్తి చేసేలా దీవించమని దేవుడిని గుప్త కోరతాడు. ఇంతలో అమ్మవారు ఆ ఇంట్లోకి రావడం గుప్త చూస్తాడు. అటు పిల్లలు కూడా దీక్ష వేసుకుని రావడం చూసిన భాగీ ఆశ్యర్యపోతుంది. ఏంటిది నేను చూచుచున్నది నిజమా.. కలయా..? అనుకుంటాడు గుప్త. పిల్లలు ఏంటిదంతా మీరు.. అని భాగీ ఆశ్చర్యపోతుంటే మేం కూడా నీలాగే అమ్మవారి దీక్ష చేస్తున్నాము మిస్సమ్మ అంటుంది అమ్ము.
దీక్ష అంటే పట్టింపులు, సంప్రదాయాలు ఉంటాయి నాన్నా.. పైగా రోజంతా ఉపవాసం కూడా ఉండాలి అంటుంది నిర్మల. పర్వాలేదు నాన్నమ్మా అన్ని తెలుసుకునే దీక్ష చేయాలనుకున్నాం అంటుంది అంజు. ఇంతకీ మీరెందుకు దీక్ష చేయాలనుకుంటున్నారు అంటాడు శివరామ్. ఎందుకో తెలియడం లేదు కానీ అంజు బర్తుడే నుంచి ఏదో బాధ తాతయ్యా కారణం తెలియడం లేదు అంటుంది అమ్ము. మిస్సమ్మ కూడా అలానే అనుకుని వేసుకుంది కదా? మేము కూడా మంచి జరుగుతుందని వేసుకున్నాం అంటుంది అంజు.
మంచి జరగాలని మీరనుకుంటున్నారు. కానీ మీ నాన్నకు ఇవన్నీ పట్టవు కదా? ఎంత గొడవ చేస్తాడో ఏంటో..? అని శివరామ్ అనగానే మీరు మాట్లాడుకుంటుంది మా సారు గురించేనా సార్ అంటూ రాథోడ్ పక్కకు జరగ్గానే అమర్ కూడా దీక్ష వేసుకుని వస్తాడు. అందరూ ఆశ్యర్యపోతారు.
పూజ మొదలుపెట్టిన భాగీ
ఏవండి నేను చూస్తుంది మిమ్మల్నేనా..? ఇవన్నీ మీరు నమ్మరు కదా? అంటుంది భాగీ. నేను ఎవర్ని నమ్ముతానో వాళ్లు నమ్ముతారు. అందుకే ఈ దీక్ష మనఃశాంతి తీసుకొస్తుంది అనుకుంటే అన్ని రోజుల దీక్షలో ఉండటానికి నేను రెడీ అంటాడు అమర్. మిస్సమ్మ నువ్వు ఏ ముహూర్తాన దీక్ష చేపట్టావే తెలియదు కానీ ఇంట్లో మంచి మార్పులు మొదలైనట్టే అంటుంది నిర్మల.
మిస్సమ్మ ఈ దీక్ష ఎలా చేయాలో ఏం చేయాలో నువ్వే చెప్పు అని అమర్ అడగ్గానే దీక్ష నియమాలు చెప్తుంది మిస్సమ్మ. అందరూ సరే అంటారు. ఇంతలో రామ్మూర్తి వచ్చి అమర్ దీక్ష తీసుకోవడం చూసి హ్యాపీగా ఫీలవుతారు. ఎమోషనల్ గా ఫీలవుతారు. భాగీ పూజ మొదలుపెడుతుంది.
షాక్‌లో మనోహరి
ఘోరా చెప్పినట్టు ఎలాగైనా భాగీ దీక్షను భగ్నం చేయాలని ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది మనోహరి. రాథోడ్ తో ఇంట్లో ఈ పూజలు అంటే అమర్ కు పడదు కదా..? మిస్సమ్మను దీక్ష అయ్యే వరకు గుడిలో ఉండమని చెప్పుకూడదు అంటుంది. దీంతో రాథోడ్ నవ్వుతూ సూపర్ ఐడియా మేడం ఇదే ఐడియా వెళ్లి ఇంట్లో చెప్పండి అనగానే హ్యాపీగా మనోహరి లోపలికి వెళ్తుంది.
అందరూ దీక్ష చేయడం చూసి షాక్ అవుతుంది. అమర్ ఏంటిదంతా ఏం చేస్తున్నారు అంటుంది. అందరం అమ్మవారి దీక్షను చేస్తున్నాం అంటాడు అమర్. అదే ఎందుకు..? అని మనోహరి అడగగానే ఎందుకంటారేంటి మేడంగారు మంచి మనసుతో మంచి జరగాలని మాల వేసుకున్నారు అంటాడు రాథోడ్. అసలు పిల్లలు, నువ్వు మాల వేసుకుని దీక్ష చేయడం ఏంటి అమర్ అంటుంది మనోహరి.
ఏం మనోహరి గారు వాళ్లు దీక్ష చేయకూడదా? చేస్తే ఎవరికైనా నష్టమా..? అని భాగీ అడగ్గానే మనసులో అవునే నాకు నష్టమే అంటూ భాగీని తిట్టుకుంటూ అమర్ ఇవన్నీ నమ్మడు కదా? మీరంతా కలిసి బలవంతంగా మాల వేయించి ఉంటారు. అమర్ ఇబ్బంది పడతాడు అనగానే నువ్వన్నది నిజమే మనోహరి కానీ మంచి జరగాలని నేనే దీక్ష చేస్తున్నాను అని అమర్ చెప్తాడు. మనోహరి అందరినీ దీక్ష విరమించేలా చేస్తుందా? అమ్మవారి దీక్షతో ఆరు ఆత్మకు విముక్తి లభిస్తుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్ 28న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్