NNS 24th December Episode: ఆత్మను చూసిన స్వామీజీ.. హెచ్చరించిన గుప్త.. ఆరు అస్థికలు నదిలో కలుపుతానన్న అమర్..
24 December 2024, 6:00 IST
- NNS 24th December Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (డిసెంబర్ 24) ఎపిసోడ్లో ఆరు ఆత్మను చూస్తాడు అమర్ ఇంటికి వచ్చిన స్వామీజీ. ఆమె అస్థికలను నదిలో కలిపి ఆరుకు విముక్తి కల్పించాలని కుటుంబ సభ్యులకు చెబుతాడు. దీంతో మనోహరి ఎంతో సంతోషంగా ఫీలవుతుంది.
ఆత్మను చూసిన స్వామీజీ.. హెచ్చరించిన గుప్త.. ఆరు అస్థికలు నదిలో కలుపుతానన్న అమర్..
NNS 24th December Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు (డిసెంబర్ 24) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్ ఇంట్లో ఉన్న సమస్య ఏంటో తెలుసుకునేందుకు వస్తాడు స్వామీజీ. ఇంట్లోకి అడుగుపెడుతూనే ఆరు ఆత్మను చూస్తాడు. ఆరుకు అనుమానం వస్తుంది. ఆయనకు నేను కనిపించానా గుప్త గారు. నేను ఆయనకు కనిపించానా చెప్పండి గుప్త గారు అని అడుగుతుంది ఆరు. దీంతో ఆయనకు నువ్వు కనిపించావని చెప్తాడు గుప్త.
ఆరులో మొదలైన భయం
రెండు రోజుల్లో నువ్వు ఈ లోకం విడిచి వెళ్లెదవు బాలిక అంటూ చెప్పిన గుప్త మాటలు గుర్తు చేసుకుని ఆరు భయపడుతుంది. ఇంతలో నువ్వు ఈ లోకం విడిచి వెళ్లుటకు విధి నిర్ణయించింది. ఎప్పటి వలే ఇప్పుడు కూడా నువ్వు విధికి ఎదురు వెళ్లకు బాలిక. లేదంటే నువ్వు నీ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమీ మాట్లాడకుండా నాతో నువ్వు మా లోకానికి రమ్ము బాలిక అని పిలుస్తాడు.
దీంతో మనోహరి కన్న కూతురునే వదిలేసిన కసాయి అని తెలిసి కూడా నా పిల్లలను వదిలేసి నేను ఎలా రాగలను గుప్త గారు అని ప్రశ్నిస్తుంది. ఇంతలో బాల్కనీలోకి వచ్చిన మనోహరి.. ఆరు నా గురించి నాకు తెలిసినదాని కన్నా నీకే ఎక్కువ తెలుస్తుంది. నా గురి ఎప్పటికీ తప్పదని తెలుసుకో ఆరు అంటూ వెళ్లిపోతుంది. ఆరు భయంగా చూస్తుంది.
మనోహరిని ఇరికించిన స్వామీజీ
స్వామీజీ లోపలికి వెళ్లగానే ఆయనను కూర్చోబెట్టి మిస్సమ్మ ను వాటర్ తీసుకురమ్మని చెప్తాడు. మిస్సమ్మ వాటర్ తీసుకురాగానే ఇంత కాలానికి గమ్యం చేరావా తల్లి అంటాడు స్వామిజీ. ఇంతలో అమర్ వచ్చి నమస్కారం స్వామిజీ అని చెప్పగానే మీ పెళ్లి కోసం విధి చాలా పెద్ద ఆట ఆడింది. ఎన్ని కష్టాలు వచ్చినా మీ బంధాన్ని వదలకండి అని చెప్తాడు.
మనోహరి రాగానే ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది అని అడుగుతాడు. మనోహరి అని నా పెద్ద కోడలి స్నేహితురాలు అని నిర్మల చెప్పగానే.. చావు కోరి వచ్చిన స్నేహమా..? చావు కూడా వేరు చేయలేని స్నేహమా అని స్వామిజీ అడగ్గానే మనోహరి షాక్ అవుతుంది. చెప్పమ్మా మనోహరి నీ స్నేహం ఎటువంటిది. స్నేహం ప్రాణాలు ఇస్తుందా..? ప్రాణాలు తీస్తుందా..? అని అడుగుతాడు.
ఆరు ఇక్కడే ఉందన్న స్వామీజీ
మనోహరి తడబడుతుంటే మీ సమస్య ఏంటో చెప్పమ్మా అని నిర్మలను అడుగుతాడు స్వామిజీ.. ఇంట్లో ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది. ఏదో ఒక ప్రమాదం కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. దోషం ఏమైనా ఉందేమోనని తెలుసుకుని నివారణ చేసుకుందామని పిలిపించాం స్వామి అని నిర్మల చెప్పగానే నీ అనుమానం నిజం నిర్మలమ్మ అంటాడు స్వామిజీ.. దోషం జరిగింది. మీ మనసులో ఉన్న అనుమానమే నిజం అయింది. అని స్వామి చెప్పగానే అంటే తప్పు జరిగిందా.. స్వామి.. మేము ఏ తప్పు చేయలేదు. తెలియకుండా ఏదైనా చేసి ఉంటే చెప్పండి స్వామి పరిహారం చేసుకుంటాం అని మిస్సమ్మ అడుగుతుంది.
రాథోడ్ కూడా ఏమైంది స్వామి బయటకే చూస్తున్నారు. ఇందాక వచ్చేటప్పుడు కూడా బయట అలా చూశారు అని అడుగుతాడు. దీంతో నేను చెప్పే విషయం మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు.. సంతోషాన్ని ఇవ్వవచ్చు.. మనసును బాధ పెట్టవచ్చు కానీ మీ కుటుంబం క్షేమం కోరే మనిషిని కాబట్టి చెప్తున్నాను అంటూ ఈ ఇంటి పెద్ద కోడలు ఎక్కడికి పోలేదు. ఈ ఇంటి చుట్టూనే తిరుగుతుంది అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు.
ఎమోషనల్ అయిన అమర్, ఆరు
అదెలా సాధ్యం అవుతుంది స్వామి.. మనిషి చనిపోయాక ఆత్మ, పరమాత్మలో లీనం అవుతుంది కదా అని శివరాం అడగ్గానే అదెలా జరగుతుంది శివరాం. అమ్మాయి ఆస్తికలు ఇంకా కలపలేదు కదా..? అస్థికలు దాచుకుని ఆత్మకు మోక్షం కలగాలంటే ఎలా సాధ్యపడుతుంది అని స్వామిజీ అడగ్గానే.. కిటికీలోంచి వింటున్న ఆరు.. గుప్త గారు నా పర్మిషన్ లేకుండా నన్ను పైకి తీసుకెళ్లలేరు కదా.. మరి అస్థికలు కలిపితే నేను ఎలా పైకి వెళ్తాను చెప్పండి అని అడుగుతుంది. మనోహరి మాత్రం హ్యాపీగా ఫీలవుతుంది.
అంటే స్వామిజీ ఆరు ఇక్కడే ఉందా..? అని అమర్ అడగ్గానే అవును ఇక్కడే ఉంది. బయట ఉండొచ్చు.. గుమ్మం దగ్గర ఉండొచ్చు.. ఏ కిటికీ దగ్గరైనా ఉండొచ్చు అని స్వామిజీ చెప్తాడు. అమర్ అంతా వెతుకుతాడు. బయటకు వెళ్లి చూస్తాడు. గార్డెన్‌లోకి వెళ్లి ఏమోషనల్ అవుతూ గట్టిగా ఆరు అని పిలుస్తాడు అమర్. పక్కనే ఉన్న ఆరు ఎమోషనల్ అవుతుంది. ఇంతలో లోపల ఉన్న శివరాం, మిస్సమ్మను వెళ్లి అమర్‌ను తీసుకురాపో అని చెప్తాడు. మిస్సమ్మ బయటకు వస్తుంటే.. గుప్త పరుగెత్తుకొచ్చి ఆరును పక్కకు తీసుకెళ్తాడు. మిస్సమ్మ వచ్చి అమర్‌ను లోపలకి తీసుకెళ్తుంది.
నదిలోకి ఆరు అస్థికలు?
అంజు.. స్వామి దగ్గరకు వెళ్లి మీరు చెప్తుంది నిజమా..? మా అమ్మా ఇక్కడే ఉందా..? అని అడుగుతుంది. అవును తల్లీ అని స్వామిజీ చెప్తాడు. ఇంతలో మనోహరి వెంటనే హడావిడి చేసి అస్థికలు నదిలో కలిపించాలి అని మనసులో అనుకుని స్వామిజీ మీరు చెప్తుంది నిజమే కదా..? అయితే వెంటనే ఆరు అస్థికలను నదిలో కలిపేద్దాం అంటుంది. బాధపడినట్టు నటిస్తుంది. నిర్మలకు కూడా ఆరు అస్థికలు వెంటనే నదిలో కలుపుదాం అంటుంది. ఈ ఇంటి మేలు కోరే మేడం వల్ల ఆపద వస్తుందంటే నేను నమ్మడం లేదు స్వామి అంటాడు రాథోడ్.
అది నిజమే ఆస్థికలు నదిలో కలపకపోవడం వల్ల దోషం జరిగిందేమో కానీ ఇంటికి కాపలాగా రక్షణగా నిలబడింది ఈ ఇంటి పెద్ద కోడలు అని స్వామిజీ చెప్తాడు. తన వలన కీడు ఎప్పటికీ జరగదు. కానీ అస్థికలు కలిపి అమ్మాయికి మోక్షం కలిపించడం మన ధర్మం. మీ ధర్మం మీరు పాటించండి.. మిగతాది దేవుడు చూసుకుంటాడు అని చెప్పి వెళ్లిపోతాడు స్వామిజీ. ఆరు ఆత్మ యమలోకానికి వెళ్తుందా? అమర్ ఆరు అస్థికల్ని నదిలో కలుపుతాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు డిసెంబర్ 24న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్