తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 16th September Episode: అంజు మెడలో దుర్గ లాకెట్​.. నిజం చెప్పనున్న అమర్​.. భయంతో వణికిన మనోహరి

NNS 16th September Episode: అంజు మెడలో దుర్గ లాకెట్​.. నిజం చెప్పనున్న అమర్​.. భయంతో వణికిన మనోహరి

Hari Prasad S HT Telugu

16 September 2024, 8:25 IST

google News
    • NNS 16th September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్లో అంజు మెడలో దుర్గ లాకెట్​ చూసి భయంతో వణికిపోతుంది మనోహరి. మరోవైపు రణ్‌వీర్ ప్రయత్నాలు ఫలించేలా కనిపిస్తున్నాయి.
అంజు మెడలో దుర్గ లాకెట్​.. నిజం చెప్పనున్న అమర్​.. భయంతో వణికిన మనోహరి
అంజు మెడలో దుర్గ లాకెట్​.. నిజం చెప్పనున్న అమర్​.. భయంతో వణికిన మనోహరి

అంజు మెడలో దుర్గ లాకెట్​.. నిజం చెప్పనున్న అమర్​.. భయంతో వణికిన మనోహరి

NNS 16th September Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (సెప్టెంబర్ 16) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బాబ్జీ ఫోన్​ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది మనోహరి. ఎంతకీ ఫోన్​ రాకపోవడంతో బాబ్జీకి తనే కాల్​ చేస్తుంది. బాబ్జీ ఫోన్​ తియ్యగానే చెప్పేది వినకుండా పాప ఆచూకీ తెలిసిందా.. అక్కడే ఉందా.. ఉంటే వెంటనే ఫోటో తీసిపెట్టు వెంటనే రణ్​వీర్​తో ఆట మొదలుపెట్టాలి అంటుంది మనోహరి.

భయంతో వణికిన మనోహరి

ఆగండి మేడమ్​.. ఇక్కడ వీళ్లు ఏదేదో అడుగుతున్నారు, పాపని ఇక్కడ వదిలిన డేట్​, గుర్తులు చెప్పమంటున్నారు అంటాడు బాబ్జీ. పాపకి రణ్​వీర్​ దుర్గ లాకెట్​ ఉన్న హారం మెడలో వేశాడు.. పాపని వదిలేసేటప్పుడు ఆ హారం పాప మెడలోనే ఉంది అని చెబుతుంది.. కానీ సిగ్నల్​ కట్​ అవడంతో బాబ్జీకి ఏం వినపడదు. ఫోన్​ మాట్లాడేందుకు బయటకు వెళ్లాలని ప్రయత్నించిన మనోహరిని ఆపి లోపలకు వెళ్లమంటారు సెక్యూరిటీ వాళ్లు.

వాళ్లతో వాదనకు దిగుతుంది మనోహరి. తామే జామర్లు ఆన్​ చేశామని సెక్యూరిటీ వాళ్లు చెప్పడంతో ఆశ్చర్యపోతుంది. ఏదో జరుగుతోంది.. సెక్యూరిటీ పెంచారు, జామర్లు ఆన్​ చేశారంటే ఏదో ఉంది అని వాళ్లని చెప్పమని అడుగుతుంది. అప్పుడే రాథోడ్​ అటుగా వచ్చి జరుగుతున్న గొడవ ఏంటో అడిగి ప్రాణాలు కాపాడాలనే ఇదంతా చేస్తున్నారని అసలు విషయం చెబుతాడు. అది విన్న మనోహరి భయంతో వణికిపోయి ఏం మాట్లాడకుండా లోపలకు వెళ్లిపోతుంది.

అమర్ ఎమోషనల్

పిల్లలందరూ ట్రెడిషనల్​ డ్రెస్సుల్లో తయారై హాల్లో కూర్చుని పూజకు కావలసినవి సర్దుతుంటారు. వాళ్లని చూసి ఎమోషనల్​గా ఫీలై రూమ్​లోకి వెళ్తాడు అమర్​. అంజు గురించి డైరీలో రాసింది చదివినప్పటి నుంచీ ఆయన మూడీగా ఉంటున్నారు అని బాధపడుతుంది అరుంధతి. అంజు మాటలు తలుచుకుని బాధపడుతున్న అమర్ దగ్గరకు వెళ్లి ఓదార్చాలని చూస్తుంది.

అమర్​ కబోర్డ్​లో ఉన్న గొలుసు తీయడం చూసి ఆశ్చర్యపోతుంది. ఆ గొలుసు తీసుకుని కిందకి వెళ్తాడు. ఈయన ఇప్పుడేం చేయబోతున్నాడు అని కంగారు పడుతుంది అరుంధతి. మిస్సమ్మ పడబోతూ ప్రసాదం కిందపడకుండా ఆపినందుకు పిల్లలు మెచ్చుకుంటారు. కానీ అంజు మాత్రం మిస్సమ్మ చేసింది తను చేసిన దానితో పోలిస్తే ఏం లెక్కలోకి రాదంటూ ఏడ్పిస్తుంది. మిస్సమ్మ కూడా అంజుని ఏడిపిస్తుంది. మన మధ్య అంతర్యుద్ధం జరగాలని మిస్సమ్మ ప్రయత్నిస్తోంది అంటూ అంజు మిగతా పిల్లలకి వార్నింగ్​ ఇస్తుంది.

అంజు మెడలో దుర్గ లాకెట్

ఇంట్లో బాంబ్​ ఉందని తెలిసిన మనోహరి బయటకు వెళ్లాలో ఇంట్లోకి వెళ్లాలో అర్థంకాక సతమతమవుతుంది. ఏదేమైనా ఇంట్లోకి వెళ్లి ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటుంది. కిందకి వచ్చిన అమర్​ అంజుని పిలిచి మెడలో గొలుసు వేస్తాడు. సంబరపడిపోతుంది అంజు. పండగ సంబరాల్ని ఎలాగైనా చెడగొట్టాలనుకుంటూ ఇంట్లోకి వస్తుంది మనోహరిని చూడగానే.. ఆంటీ మా డాడీ నాకోసం చైన్​ గిప్ట్​గా ఇచ్చాడు తెలుసా? అంటూ మెడలో ఉన్న లాకెట్​ తీసి చూపిస్తుంది.

ఆ లాకెట్​ చూసి షాకవుతుంది మనోహరి. తన కూతురు దుర్గ మెడలో రణ్​వీర్​ వేసిన లాకెట్​లా కనిపించేసరికి కంగారు పడుతుంది. అసలు ఆ లాకెట్​ ఇక్కడికి ఎలా వచ్చిందని భయపడుతుంది. మనోహరి కంగారు చూసి ఏమైందని అడుగుతుంది భాగీ. ఏం లేదని కవర్​ చేస్తుంది మనోహరి. అందరూ పూజలో కూర్చుంటారు. ఉగ్రవాదులు టైమ్​ బాంబ్ సెట్​ చేసి అది పేలే టైమ్​ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

అమర్​ తన ఇంట్లో బాంబ్​ ఉందని ఎలా తెలుసుకుంటాడు? రణ్​వీర్​ ఎలా అమర్​కి దగ్గరవుతాడు? కలకత్తా వెళ్లిన బాబ్జీ ఏం తెలుసుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్​ 16న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

తదుపరి వ్యాసం