తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 13th May Episode: మాయా దర్పణంలో తన కుటుంబాన్ని చూసుకున్న అరుంధతి.. హాస్పిటల్లో సరస్వతి మేడం మిస్సింగ్​​​​!

NNS 13th May Episode: మాయా దర్పణంలో తన కుటుంబాన్ని చూసుకున్న అరుంధతి.. హాస్పిటల్లో సరస్వతి మేడం మిస్సింగ్​​​​!

Hari Prasad S HT Telugu

13 May 2024, 7:55 IST

google News
    • NNS 13th May Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (మే 13) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మాయా దర్పణంలో తన కుటుంబాన్ని చూసుకుంటుంది అరుంధతి. మరోవైపు హాస్పిటల్లో సరస్వతి మేడం మిస్ అవుతుంది.
మాయా దర్పణంలో తన కుటుంబాన్ని చూసుకున్న అరుంధతి.. హాస్పిటల్లో సరస్వతి మేడం మిస్సింగ్​​​​!
మాయా దర్పణంలో తన కుటుంబాన్ని చూసుకున్న అరుంధతి.. హాస్పిటల్లో సరస్వతి మేడం మిస్సింగ్​​​​!

మాయా దర్పణంలో తన కుటుంబాన్ని చూసుకున్న అరుంధతి.. హాస్పిటల్లో సరస్వతి మేడం మిస్సింగ్​​​​!

NNS 13th May Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (మే 13) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సరస్వతి మేడమ్​ తనతో ఏదో చెప్పాలనుకుంటున్నారని, ఆమెకి స్పృహ వచ్చేటప్పటికి తను పక్కనుంటే బాగుంటుందని హైదరాబాద్​ బయలుదేరతానంటాడు అమర్. ఆయన ఇక్కడ ఉన్నా అదే ఆలోచనతో ఉంటారు, దీపం కూడా పెట్టేసాం కాబట్టి వెళ్లనివ్వండి నాన్నా అని రామ్మూర్తికి నచ్చజెప్పుతుంది భాగీ.

అమర్‌ను ఒప్పించిన మనోహరి

కానీ మనోహరి మాత్రం అలా వెళ్లడం అపచారమనీ, ఒక్కపూటైనా నిద్ర చేయాలని లేకపోతే అరిష్టమనీ అంటుంది. పైగా అక్కడ ఇద్దరు పెద్దవాళ్లు, ఇక్కడ గుండె సమస్యతో బాధపడుతున్న పెద్దాయన ఉన్నారని వారికేమైనా అయితే బాధపడేది మనమే కదా అంటూ అమర్​ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది. చేసేదేంలేక సరే అంటాడు అమర్​. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు పొద్దున ఇద్దరం వెళ్దాం అమర్​ అంటుంది మనోహరి.

నువ్వెక్కడికి మనోహరి.. నువ్విక్కడే ఉండు.. నేను వెళ్తాను అని లోపలకు వెళ్తాడు అమర్​. మనోహరి మాటలకు షాకైన భాగీ.. ఏంటి మనోహరి గారు.. ఏ సాకు చెప్పి ఆయనని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారనుకుంటే మీరే ఆయన ఇక్కడ ఉండేలా ఒప్పిస్తున్నారు అని అడుగుతుంది. నా పెద్దకూతురు అన్నందుకు నీ చెల్లి, మరిది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావా? అంటాడు రామ్మూర్తి. దాంతో మనోహరి కోపంగా ఇంకోసారి మరిది అనకండి.. అమర్​ అంటే చాలు అంటూ చిరాగ్గా లోపలకు వెళ్తుంది.

మాయాదర్పణంలో కుటుంబాన్ని చూసిన అరుంధతి

యముడు చెప్పినట్లే అరుంధతిని ఆనందంగా ఉంచేందుకు మాయా దర్పణంలో తను కోరింది చూపించాలనుకుంటాడు గుప్త. మాయాదర్పణం తెరిచి ఓ ఇంటిని చూపిస్తాడు. ఎవరి ఇల్లు ఇది అని అడుగుతుంది అరుంధతి. నీ ఇల్లే అంటాడు గుప్త. నా పుట్టిల్లా.. అంటే నా తల్లిదండ్రులు ఉండే ఇల్లా అని అడుగుతుంది అరుంధతి. నీ ఇల్లు అంటే నీ భర్త ఇల్లు.. భాగమతి పుట్టిల్లు.. నీ భర్తకు అత్తారిల్లు అంటాడు గుప్త.

మాయాదర్పణంలో అమర్​, పిల్లలు కూర్చుని భోజనం చేయడం, రామ్మూర్తి, భాగీ అమర్​కి దగ్గరుండి మర్యాదలు చేయడం చూసి మురిసిపోతుంది అరుంధతి. నా పెళ్లి తర్వాత ఆయన విషయంలో నేను బాధపడింది దీని గురించే గుప్తగారు.. ఆయనకు మర్యాదలు చేసే అత్తామామలు, పిల్లలను ప్రేమగా చూసుకునే అమ్మమ్మతాతయ్య లేరనే వెలితి ఉండేది. ఆ లోటు ఇప్పుడు ఇలా తీరిపోయింది, ఈ విషయంలో మాత్రం భాగీ అంటే నాకు అసూయగా ఉంది అంటుంది.

హాస్పిటల్ నుంచి సరస్వతి మేడమ్ మిస్సింగ్

హాస్పిటల్లో ఉన్న సరస్వతి మేడమ్​ని చంపమని డ్రైవర్​కి చెబుతుంది మనోహరి. డ్రైవర్​ డాక్టర్​గా వేషం వేసుకుని సరస్వతి కోసం వెతుకుతాడు. కానీ ఆమె అక్కడ లేకపోవడం చూసి షాకవుతాడు. వెంటనే మనోహరికి ఫోన్​ చేసి చెబుతాడు. సరస్వతి మేడమ్​ని చంపేసి ఫోన్​ చేస్తున్నాడనుకున్న మనోహరి వెంటనే నువ్వు అక్కడ నుంచి వెళ్లు అని చెబుతూ ఉంటుంది.

అసలు తాను ఆమెను చంపలేదని, ఆమె హాస్పిటల్లో లేదని చెప్పడంతో షాకవుతుంది. వెంటనే డాక్టర్​ అమర్​కి ఫోన్​ చేసి విషయం చెబుతుంది. సరస్వతి మేడమ్​ అమర్​ని వెతుక్కుంటూ ఇంటికి వెళ్తుంది. అమర్​కి, మిస్సమ్మకి పెళ్లైందని తెలుసుకుని సంతోషపడుతుంది. వాళ్లు ఊరు వెళ్లారని వాచ్​మన్​ దగ్గర అడిగి తెలుసుకుని అక్కడికి బయలుదేరుతుంది.

వాచ్​మన్​కి ఫోన్​ చేసి సరస్వతి మేడమ్​ వచ్చిందా అని అడుగుతాడు రాథోడ్. వచ్చారని, ఇప్పుడే అక్కడికే బయలుదేరారని చెప్పడంతో అమర్​ ఆలోచనలో పడతాడు. ఆమె దగ్గర ఫోన్​ లేదని, ఆమె వచ్చేవరకు మనం ఇక్కడే ఉండాలనీ అంటాడు. అదంతా కిటికీలో నుంచి విన్న మనోహరి ఆలోచనలో పడుతుంది. ​సరస్వతి మేడమ్​ రామ్మూర్తి ఇంటికి చేరుకుంటుందా? మనోహరి తనని చంపించిందని అరుంధతికి తెలిసిపోనుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మే 13న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం