తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zebra Ott Streaming: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. కానీ వాళ్లకు మాత్రమే.. రెండు భాషల్లో..

Zebra OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. కానీ వాళ్లకు మాత్రమే.. రెండు భాషల్లో..

Hari Prasad S HT Telugu

18 December 2024, 9:05 IST

google News
    • Zebra OTT Streaming: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. కానీ ఇది అందరికీ అందుబాటులోకి రాలేదు. కేవలం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు మాత్రమే 48 గంటలు ముందుగానే యాక్సెస్ ఇవ్వడం విశేషం.
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. కానీ వాళ్లకు మాత్రమే.. రెండు భాషల్లో..
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. కానీ వాళ్లకు మాత్రమే.. రెండు భాషల్లో..

ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. కానీ వాళ్లకు మాత్రమే.. రెండు భాషల్లో..

Zebra OTT Streaming: ఓటీటీలోకి నెల రోజుల్లోపే మరో తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ సినిమా పేరు జీబ్రా. సత్యదేవ్ నటించిన ఈ మూవీ నవంబర్ 22న రిలీజ్ కాగా.. డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో గతంలోనే అనౌన్స్ చేసింది. అయితే తమ ఓటీటీ గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు మాత్రం 48 గంటలు ముందే యాక్సెస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఓటీటీలోకి వచ్చేసిన జీబ్రా

ఆహా వీడియో చెప్పినట్లుగా ఆ ఓటీటీ గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు జీబ్రా మూవీ అందుబాటులోకి వచ్చేసింది. బుధవారం (డిసెంబర్ 18) ఉదయం నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆహా గోల్డ సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లు మాత్రం మరో రెండు రోజులు అంటే శుక్రవారం (డిసెంబర్ 20) వరకు ఆగాల్సిందే. నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ అయింది. తెలుగుతోపాటు తమిళంలోనూ మూవీ అందుబాటులోకి రావడం విశేషం.

జీబ్రా మూవీ ఎలా ఉందంటే?

జీబ్రా మూవీకి ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రియా భ‌వానీ శంక‌ర్‌, అమృత అయ్యంగార్ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో సత్య రాజ్ కీలక పాత్ర లో క‌నిపించాడు.న‌వంబ‌ర్ 22న జీబ్రా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. స‌త్య‌దేవ్ రీసెంట్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాగా నిలిచింది. 

ఫ‌స్ట్ వీక్‌లో మోస్తారు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ మూవీ మౌత్ టాక్‌తో లాభాల్లోకి అడుగుపెట్టింది. ఈ మూవీతో చాలా రోజుల త‌ర్వాత స‌క్సెస్‌ను అందుకున్నాడు స‌త్య‌దేవ్‌. జీబ్రా మూవీకి కేజీఎఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ అందించాడు.

జీబ్రా క‌థ ఏంటంటే?

సూర్య (స‌త్య‌దేవ్‌) ప్రైవేటు బ్యాంకు ఎంప్లాయ్‌. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌తో పాటు అందులోని లోతుపాతుల‌పై పూర్తిగా అవగాహ‌న ఉంటుంది. త‌న బ్యాంకులోనే ప‌నిచేసే స్వాతిని (ప్రియా భ‌వానీ శంక‌ర్‌) ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటాడు. ఓ వ్య‌క్తి ఖాతాలో జ‌మ చేయాల్సిన డ‌బ్బును మ‌రొక‌రి అకౌంట్‌లో వేస్తుంది స్వాతి. త‌న తెలివితేట‌ల‌తో స్వాతి పొగొట్టుకున్నడ‌బ్బును రాబ‌డుతాడు స‌త్య‌.

అదే టైమ్‌లో మ‌రో బ్యాంక్‌లో సూర్య పేరుతో ఉన్న‌ అకౌంట్‌లో ఐదు కోట్లు ప‌డ‌తాయి. ఆ డ‌బ్బు తీసుకునే లోపే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆ ఐదు కోట్లు ఎక్క‌డివి? అదే త‌న డ‌బ్బే అంటూ గ్యాంగ్ స్ట‌ర్ ఆది (డాలీ ధ‌నుంజ‌య‌)...సూర్య‌ను ఎందుకు బెదిరించాడు? త‌న అకౌంట్‌లో ప‌డిన డ‌బ్బును ఆదికి సూర్య ఎలా చెల్లించాడు? అనే అంశాల‌తో ద‌ర్శ‌కుడు ఈశ్వ‌ర్ కార్తీక్ జీబ్రా మూవీని తెర‌కెక్కించాడు.

తదుపరి వ్యాసం