Yatra 2 Collection: యాత్ర 2కు మొదటి రోజు దారుణమైన కలెక్షన్స్.. యాత్ర కంటే తక్కువగా.. ఇలా అయితే కష్టమే!
09 February 2024, 15:58 IST
Yatra 2 Day 1 Box Office Collection: ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర 2. ఫిబ్రవరి 8న విడుదలైన యాత్ర 2కు మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..
యాత్ర 2కు మొదటి రోజు దారుణమైన కలెక్షన్స్.. యాత్ర కంటే తక్కువగా.. ఇలా అయితే కష్టమే!
Yatra 2 Day 1 Collection: సినిమాల్లో బయోపిక్‌లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులోను ఎక్కువగా ప్రముఖ రాజకీయవేత్తలకు సంబంధించిన బయోపిక్స్ అయితే మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే 2019లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చి మంచి హిట్ కొట్టింది యాత్ర మూవీ. ఇప్పుడు యాత్రకు సీక్వెల్‌గా యాత్ర 2 మూవీ వచ్చింది. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మించిన యాత్ర 2 చిత్రాన్ని మహి వి రాఘవ్ తెరకెక్కించారు.
యాత్ర 2 కలెక్షన్స్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర 2ను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యాత్ర2లో తండ్రి వైఎస్సార్ మరణం, తర్వాత నాయకునిగా జగన్ ఎదిగిన తీరుతోపాటు 2009 నుంచి 2019వరకు ఏపీలో జరిగిన రాజకీయ సంఘటనలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 8న యాత్ర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో యాత్ర 2 డే 1 కలెక్షన్స్ చూస్తే బాగా నిరాశపరిచినట్లుగా తెలుస్తోంది.
యాత్ర 2 గ్రాస్ కలెక్షన్స్
యాత్ర, యాత్ర 2 రెండు సినిమాలు పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కినవే. అయితే యాత్ర 2కు సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది. కంటెంట్ కూడా బాగా వచ్చిందనే టాక్ వచ్చింది. కానీ, అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద మాత్రం యాత్ర 2 బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. యాత్ర 2కి మొదటి రోజు రూ. 2.05 నెట్ ఇండియా కలెక్షన్స్ రూ. 2.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఓవర్సీస్ కలెక్షన్స్
తెలంగాణలోని నైజాం ఏరియాలో రూ. 25 లక్షలు వసూలు చేయగా ఏపీలోని గుంటూరులో రూ. 41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, మిగతా ప్రాంతాలన్ని కలిపి రూ. 1.30 కోట్ల రేంజ్‌లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా మొదటి రోజు యాత్ర 2 సినిమాకు రూ. 2.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. ఇక ఓవర్సీస్‌లో కాస్తా మెరుగ్గా 70 వేల డాలర్స్ అంటే రూ. 65 లక్షల గ్రాస్ కలెక్ట్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షల రేంజ్‌లో గ్రాస్ కలెక్ట్ అయినట్లు ట్రేడ్ సంస్థలు చెబుతున్నాయి.
యాత్ర 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇక యాత్ర 2 సినిమాకు వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు రూ. 1.65 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా రూ. 3.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయినట్లు సమాచారం. అయితే యాత్ర సినిమాతో పోలిస్తే యాత్ర 2కి కలెక్షన్స్ బాగా తగ్గినట్లు తెలుస్తోంది. 2019లో వచ్చిన యాత్ర సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.2 కోట్లు షేర్ వస్తే ప్రపంచవ్యాప్తంగా 2.99 కోట్ల షేర్ వచ్చింది. దీనికంటే యాత్ర 2 చాలా తక్కువ కలెక్ట్ చేసింది. ఇక యాత్ర 2క వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 10 కోట్ల వరకు అయింది.
నష్టం లేదు
కాబట్టి, యాత్ర 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే రానున్న రోజుల్లో బాగానే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, మొదటి రోజే ఇంత దారుణంగా కలెక్షన్స్ వస్తే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలా చూసుకుంటే లాంగ్ రన్‌లో యాత్ర 2 సినిమా కచ్చితంగా విఫలం అవడం ఖాయం అని జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉంటే అడ్వాన్స్ బెసిస్‌తో యాత్ర 2 విడుదలైనందును బయ్యర్‌లకు ఎలాంటి నష్టం ఉండదని తెలుస్తోంది.
టాపిక్