తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Will Smith | విల్ స్మిత్ నుంచి ఆస్కార్ వెనక్కి తీసుకుంటారా? అకాడమీ ఏమంటోంది?

Will Smith | విల్ స్మిత్ నుంచి ఆస్కార్ వెనక్కి తీసుకుంటారా? అకాడమీ ఏమంటోంది?

HT Telugu Desk HT Telugu

28 March 2022, 15:11 IST

google News
    • Will Smith తన ఆస్కార్‌ను కోల్పోతాడా? లేకలేక అకాడమీ అవార్డు అందుకున్న అతనికి లీగల్‌ కష్టాలు తప్పవా? అంటూ వస్తున్న వార్తలపై అకాడమీ స్పందించింది.
అకాడమీ అవార్డుతో విల్ స్మిత్
అకాడమీ అవార్డుతో విల్ స్మిత్ (REUTERS)

అకాడమీ అవార్డుతో విల్ స్మిత్

లాస్‌ఏంజిల్స్‌: విల్ స్మిత్‌.. హాలీవుడ్‌ టాప్‌ యాక్టర్స్‌లో ఒకడు. ఎన్నో దశాబ్దాలుగా హాలీవుడ్‌ హిట్ మూవీస్‌లో నటించినా ఎప్పుడూ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అందుకోలేకపోయాడు. అయితే మొత్తానికి ఈ ఏడాది అతని కల నెరవేరింది. కింగ్‌ రిచర్డ్‌ మూవీ కోసం విల్‌ ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు అందుకున్నాడు. అయితే అంతకుముందు అదే ఆస్కార్స్‌ వేదికపై అతడు కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ను కొట్టడం సంచలనం సృష్టించింది. తన భార్య జాడా పింకెట్‌ స్మిత్‌పై రాక్‌ జోకులేయడంతో తట్టుకోలేకపోయి విల్‌.. వెంటనే స్టేజ్‌ మీదికి వెళ్లి అతన్ని కొట్టడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

అప్పటి నుంచీ అతను అందుకున్న అవార్డు కంటే ఆస్కార్స్‌ వేదికపై విల్‌ ప్రవర్తన గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. విల్‌ స్మిత్‌కు ఇబ్బందులు తప్పవని, అతడు అందుకున్న అకాడమీ అవార్డును కూడా తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందని సోషల్‌ మీడియా యూజర్లు చర్చించుకుంటున్నారు. దీనిపై అకాడమీ స్పందించింది. అవార్డు సెర్మనీ ముగిసిన తర్వాత ట్విటర్‌ ద్వారా పరోక్షంగా ఈ ఘటన గురించి ప్రస్తావించింది. "అకాడమీ ఏ రూపంలోని హింసనూ క్షమించబోదు. ఇవాళ రాత్రి 94వ అకాడమీ అవార్డుల కార్యక్రమానికి జరుపుకోవడం సంతోషంగా ఉంది" అంటూ ట్వీట్‌ చేసింది.

నిజానికి అవార్డు అందుకున్న తర్వాత స్మిత్‌ కూడా స్టేజీపైనే క్షమాపణ చెప్పాడు. "అకాడమీతోపాటు నా సహచర నామినీలందరికీ క్షమాపణ చెబుతున్నాను. ఇది చాలా సంతోషకరమైన క్షణం. ఈ అవార్డు కింగ్‌ రిచర్డ్‌ మూవీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అంకితం" అని స్మిత్‌ అన్నాడు. అటు ఈ ఘటన తర్వాత క్రిస్‌ రాక్‌ కూడా స్మిత్‌ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరినట్లు తెలిసింది.

తదుపరి వ్యాసం