oscars 2022 | ఆస్కార్ అందుకున్న ఐదో నల్లజాతి నటుడు విల్ స్మిత్
28 March 2022, 11:34 IST
- కింగ్ రిచర్డ్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. అతడికి ఇదే తొలి ఆస్కార్ పురస్కారం కావడం గమనార్హం. ఉత్తమ నటిగా జెస్సికా చస్టెయిన్, ఉత్తమ దర్శకుడిగా జాన్ కాంపియన్ ఆస్కార్ పురస్కారాలను దక్కించుకున్నారు.
విల్ స్మిత్
ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ అస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారు. తన కూతుళ్ల బంగారు భవిష్యత్తు కోసం ఆరాటపడే తండ్రిగా కింగ్ రిచర్డ్ సినిమాలో అసమాన నటనను కనబరిచి బెస్ట్ యాక్టర్ గా నిలిచారు. 30 ఏళ్ల సినీ ప్రయాణంలో విల్ స్మిత్‌కు ఇదే తొలి ఆస్కార్ అవార్డు కావడం గమనార్హం. అమెరికన్ అగ్ర టెన్నిస్ క్రీడాకారిణిలు సెరెనా, వీనస్ విలియమ్స్ తండ్రి రిచర్డ్ విలియమ్స్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రిచర్డ్ విలియమ్స్ పాత్రలో విల్ స్మిత్ జీవించాడు. తన డైలాగ్ డెలివరీ, మేజరిజమ్స్ తో చాలా చోట్ల రిచడ్డ్ ను విల్ స్మిత్ గుర్తుకుతెస్తాడు. ఈ పాత్రలో అతడు పండించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి.
ఉత్తమ నటిగా జెస్సికా చస్టెయిన్
అమెరికన్ సింగర్, రచయిత టమ్మీ ఫేయ్ జీవితకథతో రూపొందిన ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయ్ సినిమాలో టైటిల్ పాత్రలో విలక్షణ అభినయాన్ని కనబరచని జెస్సికా చస్టెయిన్ ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును అందుకున్నది. తనలోని అభద్రతా భావాల్ని జయించి కష్ట సమయాల్లో భర్తకు చేదోడుగా నిలిచే మహిళగా భావోద్వేగభరిత పాత్రలో జెస్సికా అభినయం మనసుల్ని కదిలిస్తుంది.
ఉత్తమ దర్శకుడిగా జాన్ కాంపియన్
పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా జాన్ కాంపియన్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ప్రేమ, అసూయ, విషాదం, పగ లాంటి అంశాలు మానవ జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలను ఆవిష్కరిస్తూ వెస్ట్రన్ సైకలాజికల్ డ్రామాగా దర్శకుడు జాన్ కాంపియన్ ఈ సినిమాను తెరకెక్కించారు.
టాపిక్