తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weekend Ott Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన రెండు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, ఇంట్రెస్టింగ్ సినిమాలు ఇవే

Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన రెండు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, ఇంట్రెస్టింగ్ సినిమాలు ఇవే

Hari Prasad S HT Telugu

09 May 2024, 14:38 IST

    • Weekend OTT Releases: వీకెండ్ ఓటీటీల్లో ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? ఈ వీకెండ్ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా చాలా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు, సినిమాలు వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి.
ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన రెండు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, ఇంట్రెస్టింగ్ సినిమాలు ఇవే
ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన రెండు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, ఇంట్రెస్టింగ్ సినిమాలు ఇవే

ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన రెండు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, ఇంట్రెస్టింగ్ సినిమాలు ఇవే

Weekend OTT Releases: వీకెండ్ ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే ఈ వారం చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లే ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చేయగా.. మరికొన్ని రాబోతున్నాయి. రెండు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లతోపాటు తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లిష్ భాషల్లో చాలా సినిమాలు వీకెండ్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఏ మూవీ, వెబ్ సిరీస్.. ఏ ఓటీటీలో ఉందో, రానుందో చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

వీకెండ్ ఓటీటీ రిలీజెస్

ఆవేశం - ప్రైమ్ వీడియో

ఈ మధ్యే మలయాళంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన ఫహాద్ ఫాజిల్ మూవీ ఆవేశం గురువారం (మే 9) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూడొచ్చు. 

గీతాంజలి మళ్లీ వచ్చింది - ఆహా ఓటీటీ

అంజలి నటించిన కామెడీ హారర్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా.. బుధవారం (మే 8) సాయంత్రం 7 గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంజలితోపాటు శ్రీనివాస్ రెడ్డి నటించిన ఈ సినిమాకు థియేటర్లలో అంత రెస్పాన్స్ రాలేదు. మరి ఓటీటీలో ఎలా వస్తుందో చూడాలి.

చిత్రం చూడరా - ఈటీవీ విన్

ఈటీవీ విన్ ఓటీటీలోకి గురువారమే (మే 9) చిత్రం చూడరా అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. వరుణ్ సందేశ్, కమెడియన్ ధనరాజ్, కాశీ విశ్వనాథ్ నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ చూసేయండి మరి.

పార్థు - ఈటీవీ విన్

ఇక ఈటీవీ విన్ ఓటీటీలోనే గురువారమే (మే 9) మరో సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆ మూవీ పేరు పార్థు. ఇదొక సైకో థ్రిల్లర్ సినిమా. తమిళం నుంచి తెలుగులోకి డబ్ చేశారు. రెండేళ్ల కిందట థియేటర్లలో వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి అందుబాటులోకి రావడం విశేషం.

పార్ట్‌నర్ (తమిళం)- ఆహా తమిళం

ఆది పినిశెట్టి, హన్సిక నటించిన మూవీ ఈ పార్ట్‌నర్. ఈ సినిమా కూడా బుధవారం (మే 8) నుంచే ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది ఆగస్ట్ లో తమిళంలో రిలీజైన ఈ సినిమా.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చింది.

రోమియో - ఆహా, ప్రైమ్ వీడియో

విజయ్ ఆంటోనీ నటించిన రోమియో (తెలుగులో లవ్ గురు) మూవీ శుక్రవారం (మే 10) నుంచి ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రాబోతోంది. తెలుగులో లవ్ గురుగా రిలీజైనా.. ఈ ఓటీటీల్లో ఎందులో రాబోతుందన్నది మాత్రం వెల్లడించలేదు.

అన్‌దేఖీ సీజన్ 3(వెబ్ సిరీస్) - సోనీలివ్

సోనీలివ్ ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అన్‌దేఖీ మూడో సీజన్ శుక్రవారం (మే 10) అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో మూడో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఓ పంజాబీ వెడ్డింగ్ లో జరిగే రెండు హత్యలు, వాటి ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూడో సీజన్ ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

మర్డర్ ఇన్ మాహిమ్ (వెబ్ సిరీస్) - జియో సినిమా

ఈ వీకెండ్ ఓటీటీలోకి వస్తున్న మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మర్డర్ ఇన్ మాహిమ్. విజయ్ రాజ్, అశుతోష్ రాణా నటించిన ఈ సిరీస్ శుక్రవారం (మే 10) నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. హిందీలో రూపొందిన ఈ సిరీస్.. తెలుగులోనూ అందుబాటులోకి రానుండటం విశేషం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం