Romeo OTT Release Date: మరో ఓటీటీలోనూ రిలీజ్ కానున్న విజయ్ ఆంటోనీ రోమియో.. ఇంకో రెండు రోజుల్లోనే..-vijay antony romeo to stream in amazon prime video also aha to stream the tamil and telugu version ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Romeo Ott Release Date: మరో ఓటీటీలోనూ రిలీజ్ కానున్న విజయ్ ఆంటోనీ రోమియో.. ఇంకో రెండు రోజుల్లోనే..

Romeo OTT Release Date: మరో ఓటీటీలోనూ రిలీజ్ కానున్న విజయ్ ఆంటోనీ రోమియో.. ఇంకో రెండు రోజుల్లోనే..

Hari Prasad S HT Telugu
May 08, 2024 08:41 AM IST

Romeo OTT Release Date: రోమియో మూవీ మరో ఓటీటీలోకి కూడా రాబోతోంది. విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే.

మరో ఓటీటీలోనూ రిలీజ్ కానున్న విజయ్ ఆంటోనీ రోమియో.. ఇంకో రెండు రోజుల్లోనే..
మరో ఓటీటీలోనూ రిలీజ్ కానున్న విజయ్ ఆంటోనీ రోమియో.. ఇంకో రెండు రోజుల్లోనే..

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ నటించిన రోమియో మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. తెలుగులో ఈ సినిమా లవ్ గురు పేరుతో రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓటీటీల్లో తెలుగు వెర్షన్ ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవుతుందన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

yearly horoscope entry point

రోమియో ఓటీటీ రిలీజ్ డేట్

రోమియో మూవీ మొదట ఆహా ఓటీటీలో శుక్రవారం (మే 10) నుంచి స్ట్రీమింగ్ కానుందని చెప్పారు. అయితే తాజాగా ప్రైమ్ వీడియోలోనూ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెప్పడం విశేషం. రెండు ఓటీటీల్లోనూ మే 10వ తేదీ నుంచే ఈ సినిమా రానుంది. తెలుగులో లవ్ గురు పేరుతో ఈ సినిమా రిలీజ్ కాగా.. ఆ వెర్షన్ ఎందులో వస్తుందన్నది మాత్రం వెల్లడించలేదు.

అయితే ఆహా ఓటీటీలోనే తెలుగు వెర్షన్ కూడా వస్తుందని తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ, మృణాలినీ రవి జంటగా నటించిన రోమియో మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. రిలీజ్ కు ముందు మంచి బజ్ ఏర్పడినా.. సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు నెల రోజుల్లోపే ఈ మూవీ రెండు ఓటీటీల్లోకి అడుగు పెట్టబోతోంది.

రోమియో ఎలా ఉందంటే?

రోమియో మూవీ ఏప్రిల్ 11నే తెలుగులో మాత్రం లవ్ గురు పేరుతో రిలీజైంది. ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేసిన విజయ్ ఆంటోనీ కాస్త పంథా మార్చుకొని రొమాంటిక్ కామెడీ డ్రామా జానర్‌లో రోమియో చిత్రం చేశాడు. ఈ సినిమాలో అతని నటన కూడా ఆకట్టుకుంది. భార్య ప్రేమను పొందేందుకు తంటాలు పడే భర్తగా అతని నటన మెప్పించింది.

హీరోయిన్ మృణాళిని రవి యాక్టింగ్‍ కూడా భేష్ అనిపించుకుంది. ఈ సినిమా కోసం ప్రమోషన్లను కూడా గట్టిగానే చేశారు విజయ్ ఆంటోనీ. తెలుగు వెర్షన్ లవ్ గురు కోసం కూడా ప్రమోషన్లను జోరుగా చేశారు. అయితే, మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్న రేంజ్‍లో ఈ మూవీ వసూళ్లను రాబట్టలేకపోయింది. రోమియో చిత్రాన్ని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.

అయితే, ఈ మూవీ కోసం ఆయన రాసుకున్న కథ కొత్తగా అనిపించలేదని ప్రేక్షకుల నుంచి రియాక్షన్స్ వచ్చాయి. ఎంటర్‌టైన్‍మెంట్ ఉన్నా కొత్తదనం లేదనే కామెంట్లు వచ్చాయి. దీంతో థియేటర్లలో సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయింది ఈ చిత్రం. రోమియో చిత్రంలో విజయ్ ఆంటోనీ, మృణాళినితో పాటు వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్, సుధ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్, రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు.

విజయ్ బిజీ బిజీ

రోమియో మూవీ ఫ్లాపయినా విజయ్ మాత్రం వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు మూడు సినిమాలు చేస్తుండటం విశేషం. హిట్లర్, ఖాకీ, వల్లి మాయిల్ సినిమాల షూటింగ్ లో ఉన్నాడు. బిచ్చగాడు మూవీతో తెలుగు ప్రేక్షకుల కూడా దగ్గరయ్యాడు విజయ్ ఆంటోనీ.

ఆ తర్వాత అతడు నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. అయితే మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. తాజాగా వచ్చిన లవ్ గురును కూడా తెలుగు ప్రేక్షకులు అసలు పట్టించుకోలేదు.

Whats_app_banner