తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Web Series For Teenagers: టీనేజర్లూ.. ఈ వెబ్ సిరీస్ మీకోసమే.. ఓటీటీల్లో మిస్ కాకుండా చూడండి

Web Series for Teenagers: టీనేజర్లూ.. ఈ వెబ్ సిరీస్ మీకోసమే.. ఓటీటీల్లో మిస్ కాకుండా చూడండి

Hari Prasad S HT Telugu

11 June 2024, 12:08 IST

google News
    • Web Series for Teenagers: ఓటీటీల్లో టీనేజర్లు బాగా ఎంజాయ్ చేసే ఎన్నో వెబ్ సిరీస్ ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లను మిస్ కాకుండా చూడండి.
టీనేజర్లూ.. ఈ వెబ్ సిరీస్ మీకోసమే.. ఓటీటీల్లో మిస్ కాకుండా చూడండి
టీనేజర్లూ.. ఈ వెబ్ సిరీస్ మీకోసమే.. ఓటీటీల్లో మిస్ కాకుండా చూడండి

టీనేజర్లూ.. ఈ వెబ్ సిరీస్ మీకోసమే.. ఓటీటీల్లో మిస్ కాకుండా చూడండి

Web Series for Teenagers: స్టూడెంట్స్, యూత్‌ను ఆకట్టుకునేలా వెబ్ సిరీస్ తీయడంతో ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్)ను మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ప్రతి వెబ్ సిరీస్ ను అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా టీనేజర్లను ఇవి బాగా ఆకట్టుకుంటాయి. మరి అలాంటి వెబ్ సిరీస్ ఏవి? ఏ ఓటీటీల్లో చూడాలన్నది ఇప్పుడు చూద్దాం.

టీనేజర్లు చూడాల్సిన వెబ్ సిరీస్

ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) అనేది ఓ ఓటీటీ. ఇది 2010లో ప్రారంభమైంది. అన్ని రకాల వెబ్ సిరీస్ లను తెరకెక్కించినా.. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సిరీస్ యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందుతాయి. అసలు ఇండియాలో రూపొందిన తొలి వెబ్ సిరీస్ గా పేరుగాంచిన పర్మనెంట్ రూమ్మేట్స్ కూడా టీవీఎఫ్ నుంచి వచ్చిందే. మరి వీళ్లు నిర్మించిన అద్భుతమైన సిరీస్ లేవో చూడండి.

టీవీఎఫ్ పిచర్స్ - జీ5, టీవీఎఫ్ యూట్యూబ్ ఛానెల్

పిచర్స్ వెబ్ సిరీస్ నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. తమ ఉద్యోగాలు వదిలి సొంతంగా స్టార్టప్ కంపెనీ పెట్టుకుందామని భావించే వీళ్లు ఆ క్రమంలో ఎదుర్కొనే సవాళ్ల గురించి చాలా అద్భుతంగా చూపించారు. యువతకు ఇన్‌స్పిరేషన్ గానూ నిలిచే ఈ వెబ్ సిరీస్ ను జీ5 ఓటీటీతోపాటు టీవీఎఫ్ యూట్యూబ్ ఛానెల్లోనూ చూడొచ్చు.

ట్రిప్లింగ్ - జీ5, టీవీఎఫ్ యూట్యూబ్ ఛానెల్

ట్రిప్లింగ్ వెబ్ సిరీస్ కూడా జీ5, టీవీఎఫ్ యూట్యూబ్ ఛానెల్స్ లో అందుబాటులో ఉంది. 2016లో మొదలై 2022 వరకు మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇది ముగ్గురు తోబుట్టువుల చుట్టూ తిరిగే కథ. తమ మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా అన్యోన్యంగా ఉండే ఈ ముగ్గురూ తమ గురించి తాము మరింత తెలుసుకోవడానికి ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. తర్వాత జరిగే ఘటనలన్నీ ఆసక్తికరంగా సాగుతాయి.

కోటా ఫ్యాక్టరీ - నెట్‌ఫ్లిక్స్

కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ ఐఐటీల్లో సీటు సంపాదించాలని పగలూరాత్రీ శ్రమించే కొందరు స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. ఐఐటీ ఎంట్రెన్స్ టెస్టులకు సిద్ధం చేసే కోటా అనే ఊరు.. తర్వాతి కాలంలో అదే విద్యార్థుల ఆత్మహత్యలకు ఎలా అడ్డాగా మారిపోయిందో నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ఈ సిరీస్ లో చూడొచ్చు.

గుల్లక్ - సోనీలివ్

గుల్లక్ వెబ్ సిరీస్ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ. గుల్లక్ అంటే మన అందరి ఇళ్లలో ఉండే కిడ్డీ బ్యాంక్. ఇది మిడిల్ క్లాస్ జీవితాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో సరదాగా చెప్పే ప్రయత్నం ఈ సిరీస్ ద్వారా చేశారు. సోనీలివ్ ఓటీటీలో చూడొచ్చు.

హాస్టల్ డేజ్ - ప్రైమ్ వీడియో

కాలేజీ హాస్టల్ జీవితాన్ని కళ్లకు కట్టే వెబ్ సిరీస్ ఈ హాస్టల డేజ్. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఆ హాస్టల్ జీవితాన్ని అనుభవించిన ప్రతి ఒక్కరూ ఈ సిరీస్ తో సులువుగా కనెక్ట్ అవుతారు.

పంచాయత్ - ప్రైమ్ వీడియో

పంచాయత్ కూడా టీవీఎఫ్ తెరకెక్కించిన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీసే. 2019లో మొదలైన ఈ సిరీస్.. తాజాగా మూడో సీజన్ తో వచ్చింది. ఓ ఊళ్లో పంచాయతీ సెక్రటరీగా వచ్చిన యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

ఆస్పిరెంట్స్ - ప్రైమ్ వీడియో, మినీ టీవీ

ముగ్గురు సివిల్స్ ఆస్పిరెంట్స్ చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీయే ఈ ఆస్పిరెంట్స్. రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ సిరీస్ ను ప్రైమ్ వీడియో, అమెజాన్ మినీ టీవీల్లో చూసే వీలుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం