తెలుగు న్యూస్  /  Entertainment  /  Vishwak Sen Starred Das Ka Dhamki Trailer Released

Das Ka Dhamki Trailer: దాస్ ధమ్కీ మొదలైంది.. ఇంజిన్ హీట్ ఎక్కేసింది.. ట్రైలర్ వచ్చేసింది

18 November 2022, 20:29 IST

    • Das Ka Dhamki Trailer: విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంతో అతడు నటించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో నివేధా పేతురాజ్ హీరోయిన్‌గా చేసింది. ఫిబ్రవరి 2023లో ఈ సినిమా విడుదల కానుంది.
దాస్ కా ధమ్కీ ట్రైలర్ విడుదల
దాస్ కా ధమ్కీ ట్రైలర్ విడుదల

దాస్ కా ధమ్కీ ట్రైలర్ విడుదల

Das Ka Dhamki Trailer: టాలీవుడ్ యంగ్ విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అశోక వనంలో అర్జున కల్యాణం, ఓరీ దేవుడా లాంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్.. తాజాగా మరో సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే దాస్ కా ధమ్కీ. అతడు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పాగల్ చిత్రంతో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న నివేదా పేతురాజ్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ అయింది. నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

DeAr OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన డియర్ సినిమా.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Pokiri Trending: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘పోకిరి’ సినిమా.. ఎందుకో తెలుసా?

Samantha Next Movie: పుట్టిన రోజున గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టైటిల్, పోస్టర్

Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

దాస్ కా ధమ్కీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కినట్లు ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. రెండు రకాల విభిన్న గెటప్పుల్లో విశ్వక్ కనిపిస్తున్నాడు. ఇందులో ఓ రోల్ పూర్తిగా ప్రతినాయకుడి ఛాయలు ఉంటాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఫలక్‌నూమా దాస్ మాదిరిగానే ఇందులోనూ కొన్ని అభ్యంతరకర డైలాగులు ఉన్నాయి. వాటిని ట్రైలర్‌లోనే చూపించడం విశేషం.

ఇంజిన్ హీట్‌లోకి వచ్చింది.. ఇంక స్టార్ట్ చేద్దామా అంటూ విశ్వక్ ట్విటర్ వేదికగా తెలియజేశాడు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విశ్వక్ తనదైన కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషన్, నెగిటివ్ షేడ్స్‌ను కూడా చూపించాడు. ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాను 2023 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనుంది. ఇది విశ్వక్ మొదటి పాన్ ఇండియా చిత్రం. వన్యమే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. దినేష్ కే బాబు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.