తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varisu Streaming On Amazon Prime And Sunnxt: ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజ్ కానున్న విజ‌య్ వారిసు

Varisu Streaming On Amazon Prime And Sunnxt: ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజ్ కానున్న విజ‌య్ వారిసు

17 February 2023, 13:25 IST

  • Varisu Streaming On Amazon Prime And Sunnxt: విజ‌య్ వారిసు సినిమా ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌లో రిలీజ్ కానుంది. ఏ రోజు నుంచి ఏయే ఓటీటీల‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందంటే...

విజ‌య్ వారిసు
విజ‌య్ వారిసు

విజ‌య్ వారిసు

Varisu Streaming On Amazon Prime And Sunnxt: విజ‌య్ వారిసు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను శుక్ర‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఫిబ్ర‌వ‌రి 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు సన్ నెక్స్ట్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. వారిసు తెలుగు వెర్ష‌న్ వార‌సుడు కూడా అదే రోజు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

krishna mukunda murari serial: అబార్షన్ చేయించుకున్న మీరా.. బిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ

Jr NTR Movies OTT: హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్: మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హిట్ సినిమాలు ఈ ఓటీటీల్లో చూసేయండి

అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, త‌మిళంతో పాటు హిందీ భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న రిలీజైన వారిసు సినిమా 300 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. విజ‌య్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. తెలుగు వెర్ష‌న్ 25 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అమ్మ‌కు ఇచ్చిన మాట కోసం అపార్థాల‌తో విడిపోయిన త‌న కుటుంబాన్ని ఏకం చేసిన ఓ కొడుకు క‌థ‌తో వారిసు సినిమా రూపొందింది. విజ‌య్ యాక్టింగ్‌, ఆయ‌న మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. వారిసు సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. వారిసు సినిమాతో నిర్మాత‌గా దిల్‌రాజు, ద‌ర్శ‌కుడిగా వంశీపైడిప‌ల్లి త‌మిళంలోకి అరంగేట్రం చేశారు. వారిసు సినిమా జ‌న‌వ‌రి 11నథియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా తెలుగు వెర్ష‌న్ మాత్రం మూడు రోజులు ఆల‌స్యంగా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం