Varisu Enters 250 Crore Club: 11 రోజుల్లో 250 కోట్లు - బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ్రేక్ చేస్తోన్న విజ‌య్ వారిసు-varisu collection vijay movie collects 250 crore worldwide within 11 days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Varisu Collection Vijay Movie Collects 250 Crore Worldwide Within 11 Days

Varisu Enters 250 Crore Club: 11 రోజుల్లో 250 కోట్లు - బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ్రేక్ చేస్తోన్న విజ‌య్ వారిసు

Nelki Naresh Kumar HT Telugu
Jan 23, 2023 03:15 PM IST

Varisu Enters 250 Crore Club: విజ‌య్ వారిసు సంక్రాంతి రిలీజ్‌ల‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. 11 రోజుల్లో ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

విజ‌య్ వారిసు
విజ‌య్ వారిసు

Varisu Enters 250 Crore Club: విజ‌య్ వారిసు క‌లెక్ష‌న్ల రేసులో దూసుకుపోతున్న‌ది. సంక్రాంతి రిలీజ్‌ల‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. శ‌నివారం నాటితో ఈసినిమా 250 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించిన‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్ర‌క‌టించింది.

11 రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈసినిమా 250 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. త‌క్కువ టైమ్‌లో ఈ ఘ‌న‌త‌ను సాధించిన విజ‌య్ సినిమాగా వారిసు రికార్డ్ క్రియేట్ చేసింది. మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా వారిసు భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్ట‌డం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా విజ‌యోత్స‌వ వేడుక‌ను ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా నిర్వ‌హించారు.

యూనిట్ స‌భ్యుల స‌మ‌క్షంలో సింపుల్‌గా జ‌రిగిన‌ ఈ వేడుక‌కు హీరో విజ‌య్ హాజ‌ర‌య్యాడు. ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి, నిర్మాత దిల్‌రాజుల‌తో క‌లిసి అత‌డు కేక్ క‌ట్ చేస్తోన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు పెద్ద‌పీట వేస్తూ ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి వారిసు సినిమాను తెర‌కెక్కించారు. స‌మ‌స్య‌ల‌తో విడిపోయిన త‌న కుటుంబాన్ని ఓ యువ‌కుడు ఎలా ఏకం చేశాడ‌న్న‌దే వారిసు క‌థ‌.

త‌మిళంలో దిల్‌రాజు నిర్మించిన మొద‌టి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. తొలి సినిమాతోనే కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను దిల్‌రాజు అందుకున్నాడు. తెలుగులో వార‌సుడు పేరుతో ఈ సినిమాను డ‌బ్ చేశారు.

జ‌న‌వ‌రి 14న రిలీజైన తెలుగు వెర్ష‌న్ తొమ్మిది రోజుల్లో 25 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. విజ‌య్ కెరీర్‌లో తెలుగులో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా వార‌సుడు నిలిచింది. వారిసు సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది. శ‌ర‌త్‌కుమార్‌, శ్రీకాంత్‌, జ‌య‌సుధ‌, శామ్‌, సంగీత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

IPL_Entry_Point