తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika On Vijay Deverakonda: విజయ్ దేవరకొండపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తమ రిలేషన్‌షిప్ కన్ఫమ్ చేసినట్లేనా?

Rashmika on Vijay Deverakonda: విజయ్ దేవరకొండపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తమ రిలేషన్‌షిప్ కన్ఫమ్ చేసినట్లేనా?

Hari Prasad S HT Telugu

31 January 2024, 20:58 IST

google News
    • Rashmika on Vijay Deverakonda: తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ దేవరకొండపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రష్మిక మందన్నా. అతడు సపోర్ట్ చేసినట్లు తననెవరూ సపోర్ట్ చేయలేదని, తాను చేసే ప్రతి పనిలో విజయ్ భాగస్వామ్యం ఉంటుందని చెప్పడం విశేషం.
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ

రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ

Rashmika on Vijay Deverakonda: టాలీవుడ్ లవ్ బర్డ్స్ గా అందరూ భావిస్తున్న రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ.. తమ మధ్య ఏముందో ఇప్పటి వరకూ చెప్పలేదు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఏదో ఉందని మాత్రం తరచూ తమ మాటలు, చేతల ద్వారా పరోక్షంగా చెబుతూనే ఉంటారు.

తాజాగా రష్మిక మరోసారి విజయ్ పై చేసిన కామెంట్స్ అలాగే ఉన్నాయి. విజయ్ తనకు సపోర్ట్ చేసినట్లు ఎవరూ చేయలేదని, తాను చేసే ప్రతి పనిలో అతని భాగస్వామ్యం ఉంటుందని చెప్పడం విశేషం.

ప్రతి పనికీ విజయ్ సలహా తీసుకుంటా?

ప్రస్తుతం యానిమల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇందులో తన కోస్టార్ట్స్ అమితాబ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రణ్‌బీర్ కపూర్, అల్లు అర్జున్ ల గురించి కూడా మాట్లాడింది. అయితే విజయ్ దేవరకొండపై ఆమె చేసిన కామెంట్స్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. తమ మధ్య అందరూ అనుకుంటున్నట్లు ఏదో ఉందన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి.

"విజు, నేను ఇద్దరం కలిసే ఈ స్థాయికి వచ్చాం. అందుకే ప్రస్తుతం నా జీవితంలో నేను ఏం చేసినా అందులో అతని భాగస్వామ్యం ఉంటుంది. నేను చేసే ప్రతి పనికీ అతని సలహా తీసుకుంటాను. నాకు అతని అభిప్రాయం అవసరం. ప్రతిదానికీ ఎస్ అని చెప్పే వ్యక్తి కాదతడు. కచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. ఇది మంచిది.. ఇది కాదు.. నేను ఇలా అనుకుంటున్నాను.. ఇది అనుకోవడం లేదు. నా మొత్తం జీవితంలో విజయ్ నాకు సపోర్ట్ ఇచ్చినట్లుగా ఎవరూ చేయలేదు. అందుకే అతన్ని నేను చాలా చాలా గౌరవిస్తాను" అని రష్మిక చెప్పింది.

రిలేషన్‌షిప్ కన్ఫమ్ చేసినట్లేనా?

రష్మిక చేసిన కామెంట్స్ చూస్తుంటే విజయ్ తో తన రిలేషన్షిప్ ను కన్ఫమ్ చేసినట్లే ఉంది. నిజానికి ఈ ఇద్దరూ ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్య లైఫ్ స్టైల్ ఏషియాకు విజయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పుకార్లను ఖండించాడు. "నేను ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ గానీ, పెళ్లిగానీ చేసుకోవడం లేదు. ప్రతి రెండేళ్లకు నేను పెళ్లి చేసుకోవాలని మీడియా అనుకుంటున్నట్లు అనిపిస్తోంది. ప్రతి ఏడాది ఈ పుకారు నాకు వినిపిస్తుంది. నన్ను పట్టుకొని పెళ్లి చేయాలని చూస్తున్నట్లుగా ఉంది" అని విజయ్ అన్నాడు.

అటు ఈ ఇద్దరి సన్నిహితులు కూడా హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. "ఆ వార్తల్లో అసలు నిజం లేదు. వాళ్లు చాలా ప్రైవేట్ వ్యక్తులు. ఇప్పటి వరకూ వాళ్ల మధ్య రొమాన్స్ గురించి పబ్లిగ్గా చెప్పలేదు. తమ మధ్య బంధం గురించి మాత్రం కొన్ని హింట్స్ ఇస్తూ వస్తున్నారు. కానీ వాళ్లు దానిని పబ్లిక్ చేయబోతున్నారని, ఎంగేజ్ మెంట్ అన్న వార్తల్లో నిజం లేదు" అని వాళ్లు స్పష్టం చేశారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీతో బిజీగా ఉన్నాడు. అటు రష్మిక కూడా పుష్ప 2, రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్, డీఎన్ఎస్ మూవీలతో తీరిక లేకుండా ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం