Vijay Deverakonda: తెలుగు ఇండియన్ ఐడల్ షోకి స్పెషల్ గెస్టుగా కల్కి అర్జునుడు.. మిస్ కావద్దు
03 July 2024, 10:56 IST
- Vijay Deverakonda: తెలుగు ఇండియన్ ఐడల్ షోకి ఓ స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు. రాబోయే ఎపిసోడ్లో అతడు సందడి చేయనున్నాడు. అతని పేరు నేరుగా చెప్పకుండా ఆహా ఓటీటీ కొన్ని హింట్స్ తో వరుస వీడియోలు రిలీజ్ చేస్తోంది.
తెలుగు ఇండియన్ ఐడల్ షోకి స్పెషల్ గెస్టుగా కల్కి అర్జునుడు.. మిస్ కావద్దు
Vijay Deverakonda: ఇండియన్ ఐడల్.. హిందీలోనే కాదు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటున్న సింగింగ్ షో. ప్రస్తుతం తెలుగులో మూడో సీజన్ నడుస్తోంది. అయితే ఈ షోకి ఓ స్పెషల్ గెస్ట్ రాబోతున్నట్లు ఈ షో ఆర్గనైజర్లు, ఆహా ఓటీటీ వరుస వీడియోల్లో చెబుతున్నారు. వాళ్లు అతని పేరు చెప్పకపోయినా.. ఇచ్చిన హింట్స్ తో అతడు కల్కి 2898 ఏడీలోని అర్జునుడే అని తేలిపోయింది.
ఇండియన్ ఐడల్‌కు విజయ్ దేవరకొండ
ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీలో అర్జునుడి పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇండియన్ ఐడల్ షో ఓ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్టుగా వస్తున్నాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఆహా ఓటీటీ తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో వీడియోలు రిలీజ్ చేసింది. ఈ ఇండియన్ ఐడల్ జడ్జీలతోపాటు కంటెస్టెంట్లు కూడా ఆ గెస్టు గురించి కొన్ని హింట్స్ ఇచ్చారు.
ఈ షోకి జడ్జ్‌గా ఉన్న సింగర్ కార్తీక్ అయితే కల్యాణీ వచ్చా వచ్చా అని పాడుతూ వచ్చేది విజయ్ అనే తేల్చేశాడు. 12 మంది టాప్ సింగర్స్ తో ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 3 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్త సీజన్లో ఆడిషన్స్ తర్వాత మిగిలిన కంటెస్టెంట్లు ఒకరిని మించి మరొకరు పర్ఫామ్ చేస్తూ ఈ షోని చాలా ఆసక్తికరంగా మార్చేస్తున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్
ఈ తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్ లో జడ్జీలుగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తోపాటు సింగర్స్ కార్తీక్, శ్రీరామచంద్ర, గీతా మాధురి ఉన్నారు. ఇప్పటికే ఈ షో ఆరు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అందులో నాలుగు ఎపిసోడ్లు ఆడిషన్స్ చూపించగా.. ఐదు, ఆరు ఎపిసోడ్లలో టాప్ 12 కంటెస్టెంట్లతో గ్రాండ్ గాలా నిర్వహించారు. ఈ రెండు ఎపిసోడ్లు దుమ్ము రేపాయి.
గత శుక్ర, శనివారాల్లో (జూన్ 28, 29) ఈ ఎపిసోడ్ల స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు రాబోయే శుక్రవారం (జులై 5) ఏడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కే విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా రానున్నాడు. అతడు తన చరిష్మాతో ఈ షోని మరో రేంజ్ కు తీసుకెళ్లడం ఖాయం. కల్కి 2898 ఏడీ మూవీలో అర్జునుడి పాత్రలో కాసేపే కనిపించినా.. అతడు ఉన్నంతసేపు థియేటర్లలో అరుపులు, ఈలలే వినిపించాయి.
అయితే ఈ సినిమాలో అర్జునుడి పాత్ర పోషించిన విజయ్ ఎప్పటిలాగే తన తెలంగాణ యాసలో మాట్లాడటంపై విమర్శలు కూడా వచ్చాయి. అతన్ని కొంత మంది ట్రోల్ చేశారు. కానీ ఈ ప్రభావం మూవీపై పెద్దగా లేదు. నిజానికి విజయ్ ఈ సినిమాకు ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.
అతనితోపాటు రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లాలాంటి వాళ్లు కూడా గెస్టు రోల్స్ లో కనిపించినా.. విజయ్ అర్జునుడి పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోయింది.
ఇప్పుడీ రౌడీ బాయ్ రానుండటంతో ఇండియన్ ఐడల్ ఏడో ఎపిసోడ్ మరో లెవల్లో ఉండబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.