తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay And Rashmika Hang Out: కాఫీ షాపులో ప్రేమ పక్షులు.. చిల్ అవుతున్న విజయ్-రష్మిక..!

Vijay and Rashmika Hang out: కాఫీ షాపులో ప్రేమ పక్షులు.. చిల్ అవుతున్న విజయ్-రష్మిక..!

04 May 2023, 9:04 IST

google News
    • Vijay and Rashmika Hang out: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి కలిసి సందడి చేశారు. హైదరాబాద్‍‌లో ఓ కాఫీ షాపులో కలిసి చిల్ అవుతూ కనిపించారు. వీరితో పాటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా ఉండటం విశేషం.
విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా
విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా

Vijay and Rashmika Hang out: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మికా మందన్నా మధ్య ఏదో ఉందని చాలా రోజులుగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ చాలా సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరగడం, కలిసి డిన్నర్లకు వెళ్లడం కెమెరా కంటికి చిక్కాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని పలు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై స్పందించిన విజయ్-రష్మిక తాము స్నేహితులమనే చెబుతూ దాట వేస్తూ వచ్చారు. కానీ పబ్లిక్ ప్రదేశాల్లో కనిపించినప్పుడల్లా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి విజయ్-రష్మిక కలిసి కనిపించారు.

హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని ఓ కాఫీ షాపులో విజయ్-రష్మిక(Rashmika Mandanna) సందడి చేశారు. వీరిద్దరూ కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యారు. వీరితో పాటు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా జాయిన్ కావడం విశేషం. విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని గౌతమ్‌తోనే చేస్తున్నాడు. బుధవారం నాడు వీరి సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా రష్మికతో పాటు విజయ్-గౌతమ్ కాఫీ షాపులో కలుసుకున్నట్లు తెలుస్తోంది.

విజయ్-రష్మిక మరోసారి కలిసి కనిపించడంతో వీరి డేటింగ్ ఊహాగానాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వీలుచిక్కినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ మధ్య కాలంలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రష్మిక కనిపంచేసరికి.. విజయ్‌తో కటీఫ్ చెప్పిందని భావించారు. కానీ తాజాగా మరోసారి పబ్లిక్ ప్లేస్‌లో విజయ్-రష్మిక సందడి చేయడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.

గతేడాది విజయ్-రష్మిక కలిసి మాల్దీవుల వెకేషన్‌కు వెళ్లినప్పుడు వీరి డేటింగ్ రూమర్లు నిజమేనని తేలింది. అంతేకాకుండా 2023 న్యూ ఇయర్‌కు వీళ్లు షేర్ చేసిన ఫొటోలు కూడా ఒకేలా ఉండటం, విజయ్ సన్ గ్లాసెస్‌తో రష్మిక కనిపించడంతో వీరి సీక్రెట్ రిలేషన్‌షిప్ గురించి తెలిసింది.

ప్రస్తుంత విజయ్ దేవరకొండ.. సమంతతో కలిసి ఖుషీ అనే మూవీ చేస్తున్నాడు. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదికాకుండా గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. మరోపక్క రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇది కాకుండా నితిన్‌తో వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. వీటితో పాటు బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి.

తదుపరి వ్యాసం