తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malaysia Tour: ఆ సినిమా చూస్తే ఫ్రీగా మలేసియా టూర్.. ఫ్యామిలీతో పాటు హాలీడే ట్రిప్.. బిచ్చగాడు హీరో ఆఫర్

Malaysia Tour: ఆ సినిమా చూస్తే ఫ్రీగా మలేసియా టూర్.. ఫ్యామిలీతో పాటు హాలీడే ట్రిప్.. బిచ్చగాడు హీరో ఆఫర్

Sanjiv Kumar HT Telugu

15 April 2024, 13:00 IST

  • Love Guru Free Family Tour: కోలీవుడ్ పాపులర్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లవ్ గురు సినిమా టీమ్ ఆడియెన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సినిమా చూస్తే ఫ్రీగా ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు అని అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ సినిమా చూస్తే ఫ్రీగా మలేసియా టూర్.. ఫ్యామిలీతో పాటు హాలీడే ట్రిప్.. బిచ్చగాడు హీరో ఆఫర్
ఆ సినిమా చూస్తే ఫ్రీగా మలేసియా టూర్.. ఫ్యామిలీతో పాటు హాలీడే ట్రిప్.. బిచ్చగాడు హీరో ఆఫర్

ఆ సినిమా చూస్తే ఫ్రీగా మలేసియా టూర్.. ఫ్యామిలీతో పాటు హాలీడే ట్రిప్.. బిచ్చగాడు హీరో ఆఫర్

Love Guru Free Family Trip: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ లవ్ గురు. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమా నుంచి ఓ ఎగ్జైటింగ్ ఆఫర్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. "లవ్ గురు" సినిమా చూసే ప్రేక్షకుల్లో విజేతలను ఫ్యామిలీతో సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

ఫస్ట్ ప్రైజ్ మలేషియా

ఈ ఆఫర్‌లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్‌కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విజేతకు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్‌కు ఊటీ హాలీడే ట్రిప్‌ను తీసుకెళ్తామని "లవ్ గురు" టీమ్ తెలిపింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 13 నుంచి అందుబాటులోకి వచ్చింది. "లవ్ గురు" సినిమా చూసిన ప్రేక్షకులు మీ పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఆన్ లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నెంబర్‌కు టికెట్ ఫొటోను వాట్సాప్ చేయాలి.

ఎంజాయ్ చేసే అవకాశం

ఆ ఆడియెన్స్ నుంచి ముగ్గురు లక్కీ విన్నర్స్‌ను మేకర్స్ ప్రకటిస్తారు. అనంతరం వారికి ఈ సమ్మర్ హాలీడేస్ వెకేషన్‌ను పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం "లవ్ గురు" సినిమా టీమ్ కల్పిస్తోంది. కాగా "లవ్ గురు" సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11న రిలీజ్ చేశారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది.

హీరోయిన్‌గా మృణాళిని

ప్రస్తుతం "లవ్ గురు" సినిమా సక్సెస్ ఫుల్‌గా థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాలో బ్యూటిఫుల్ మృణాళిని రవి హీరోయిన్‌గా విజయ్ ఆంటోనీకి జోడీగా నటించింది. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఈ సినిమాకు వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు.

మ్యూజిక్ డైరెక్టర్‌గా

ఇదిలా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ ఆంటోనీ తర్వాత హీరోగా మారారు. విభిన్న కంటెంట్‌తో సినిమాలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యాడు విజయ్ ఆంటోనీ. ఆయన తెలుగులో దరువు సినిమాకు సంగీతం అందించారు.

తెలుగు సినిమాల్లో

ఇక హీరోయిన్ మృణాళిని రవి గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు వారికి పరిచయమే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా చేశాడు. ఇదే కాకుండా సుధీర్ బాబు మామా మశ్చీంద్ర సినిమాలో కూడా హీరోయిన్‌గా చేసింది మృణాళిని రవి. అలాగే విశాల్, ఆర్య నటించిన ఎనిమీ సినిమాలో కథానాయికగా అలరించింది బ్యూటిఫుల్ మృణాళిని రవి.

ట్రైనింగ్ తీసుకున్నా

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా లవ్ గురు తెలిపింది మృణాళిని రవి. "లవ్ గురు సినిమాలో లీలా అనే క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన హీరో, ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్. లీలా క్యారెక్టర్‌లో నటించేందుకు నేను కలైరాణి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ పాత్రలో పర్‌ఫెక్ట్‌గా నటించేందుకు ఆ మేడమ్ ఇచ్చిన ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడింది" అని మృణాళిని తెలిపింది.

ఆ సినిమా చూస్తే ఫ్రీగా ఫ్యామిలీతో హాలీడే ట్రిప్.. మలేషియా, కశ్మీర్, ఊటికి టూర్
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.